
'కార్తీకదీపం' సీరియల్ చేస్తున్న ప్రేమి విశ్వనాథ్.. రీసెంట్‌గా ఓ కుర్రాడితో కలిసి ఇన్ స్టాలో రీల్ చేసింది.

ఈ వీడియోని సదరు కుర్రాడే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 'మామ్ అండ్ సన్' (తల్లి-కొడుకు) అనే క్యాప్షన్ పెట్టాడు.

దీంతో అందరూ ఒక్కసారిగా షాకవుతున్నారు. ఎందుకంటే వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్‌కి పెళ్లయి పిల్లలున్నారని తెలుసు గానీ మరీ ఇంత పెద్ద కొడుకు ఉన్నాడని మాత్రం ఊహించలేకపోయారు.

కేరళకు చెందిన ప్రేమి విశ్వనాథ్.. వినీత్ భట్ అనే ఆస్ట్రాలజర్‌ని చాలా ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకుంది. వీళ్లకు పుట్టిన అబ్బాయి పేరు మనుజిత్

తాజాగా తల్లితో కలిసి చేసిన ఓ రీల్ షేర్ చేయగా.. అందరూ అవాక్కవుతున్నారు. ఎందుకంటే ఆరడుగుల పొడుగు సిక్స్ ప్యాక్ బ్యాడీతో చూడటానికి హీరోలా ఉన్నాడు.











