

దివంగత అందాలరాశి శ్రీదేవి పెద్ద కూతురు ఈ బ్యూటీ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. దడక్ చిత్రం ద్వారా కథానాయకిగా రంగప్రవేశం చేసిన ఈ అమ్మడు ఆ తరువాత పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంది.

యితే ఈమె నటన కంటే గ్లామర్‌నే ఎక్కువగా నమ్ముకున్నట్లుంది. తరచూ గ్లామరస్ ఫొటోలను మీడియాకు విడుదల చేస్తూ వార్తల్లో ఉంటోంది. అంతకంటే ఎక్కువగా తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంటాయి.

ఈ 27 ఏళ్ల బ్యూటీ షికర్ బషీర్‌తో చాలా కాలంగా ప్రేమలో ఉంటోంది. వీరి ప్రేమను జాన్వీకపూర్ తండ్రి, నిర్మాత బోనీకపూర్ కూడా అంగీకరించారు. ఆయనే స్వయంగా ఇటీ వల వారు ప్రేమలో ఉన్నారని తెలిపారు. ఇకపోతే ఇటీవల జాన్వీకపూర్ తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తిరుపతికి వెళ్లి వేంకటేశ్వరస్వామివారి దర్శనం కూడా చేసుకున్నారు.

జాన్వీకపూర్ నూతన సంవత్సరం, పుట్టిన రోజు వంటి విశేష రోజుల్లో తప్పకుండా దైవదర్శనం చేసుకుంటుందట. కాగా పెళ్లి ఎప్పుడు చేసుకుంటారోనన్న చర్చ జరుగుతున్న తరుణంలో జాన్వీకపూర్ ఇటీవల ఒక భేటీలో తన పెళ్లి ఎలా జరగాలి, ఎక్కడ జరగాలి ? అన్న విషయాలపై క్లారిటీ ఇచ్చింది.

పెళ్లి సమయంలో జన సందోహం ఎక్కువగా ఉండకూడదని చెప్పింది. వివాహాన్ని వేడుకలా జరుపుకోవడం ఇష్టమే కానీ, అయినా కొంచెం భ యం అని చెప్పింది. వచ్చిన వాళ్లు తననే చూస్తుంటారనే ఆ భయం అని పేర్కొంది. అందుకే తన కుటుంబం, సన్నిహిత మిత్ర బృందం ఉంటే చా లని అంది

అలాగే తన వివాహం తమి ళ సంప్రదాయం ప్రకారం జరగాలని, వివాహానికి కాంచీపురం పట్టు చీర ధరించి, తలనిండా మల్లెపూలు పెట్టుకోవాలని చెప్పింది. త న భర్త కూడా పంచె కట్టుకోవా లని చెప్పింది. చివరిగా పెళ్లికి వచ్చిన అతిథులకు అరటి ఆకుల్లో విందు భోజనం పె ట్టాలని, మొత్తం మీద తమిళ సంప్రదాయం అక్క డ ఆవిష్కృతం కావాలని నటి జాన్వీకపూర్ పేర్కొంది.

కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ దక్షిణాది చిత్రపరిశ్రమపై దృష్టి పెట్టింది. ఇప్పటికే తెలుగులో జూనియ ర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటిస్తున్న జాన్వీకపూర్ త్వ రలో రామ్‌చరణ్‌కు జంటగా నటించడానికి సిద్ధం అవుతోంది. ఒక కోలీవుడ్ రంగప్రవేశం ఎ ప్పుడన్నదే ఆసక్తిగా మారింది.



