
జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేశ్ పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిలా ఉండిపోవాలనుకున్నాడు. అతడి నిర్ణయం విని తల్లి కంగారుపడిపోయింది.

నిజంగానే పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోతే ఎలారా దేవుడా? అని భయపడి ఏడ్చింది కూడా! కానీ జోర్దార్ సుజాత పరిచయమయ్యాక రాకేశ్ జీవితంలో, ఆలోచనలో కొత్త మార్పులు వచ్చాయి.

సుజాత.. రాకేశ్‌ను ప్రేమించింది. అతడి ప్రేమనూ పొందింది. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. త్వరలో పేరెంట్స్‌గానూ ప్రమోషన్ పొందనున్నారు.

ఇకపోతే కొన్నినెలలుగా తను సోషల్ మీడియాలో పెట్టే రీల్స్, వీడియోలు చూసి సుజాత ప్రెగ్నెంటా? అని ఫ్యాన్స్ అనుమానాలు వ్యక్తం చేశారు.

కానీ ఆమె ఏనాడూ దానికి సమాధానమివ్వలేదు. పైగా సీమంతం వేడుకలను కూడా సీక్రెట్‌గానే ఉంచింది.

ఇన్నాళ్లకు తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భవతి అని పేర్కొంది. రాకేశ్‌తో కలిసి మెటర్నటీ షూట్ చేసింది.

అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి.





