
రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "పురుషోత్తముడు". ఈ చిత్రంతో హాసిని సుధీర్ హీరోయిన్ గా పరిచయమవుతున్నారు. "ఆకతాయి", "హమ్ తుమ్" చిత్రాలతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ భీమన "పురుషోత్తముడు" సినిమాను రూపొందిస్తున్నారు. రేపు(జులై 26) ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరోయిన్ హాసినీ సుధీర్ మీడియాతో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

నేను మహారాష్ట్ర అమ్మాయిని. హీరోయిన్ కావాలనేది నా చిన్నప్పటి కల. ముంబైలో మోడలింగ్ చేశాను. తెలుగు సినిమాలు బాగా చూస్తూ పెరిగాను. అలా తెలుగు నేర్చుకున్నాను. నాని నా ఫేవరేట్ యాక్టర్. డైరెక్టర్ రామ్ భీమన గారు పురుషోత్తముడు సినిమా ఆడిషన్ కు పిలిచారు. ఆడిషన్ తర్వాత నన్ను సెలెక్ట్ చేశారు. ఈ సినిమాలో సెలెక్ట్ అయ్యాక ఏడాది పాటు వర్క్ షాప్ లో పాల్గొన్నాను.

పురుషోత్తముడు చిత్రంలో నేను అమ్ములు అనే క్యారెక్టర్ చేశాను. అంతా అమ్ము అని పిలుస్తారు. తనొక బబ్లీ గర్ల్. అందరితో పని చేయిస్తుంటుంది. హీరోతో కూడా పని చేయిస్తుంది. ఈ క్యారెక్టర్ లో నటించడాన్ని ఎంజాయ్ చేశాను. నాకు తెలుగు మాట్లాడటం వచ్చినా చదవడం రాదు. రాజమండ్రి షెడ్యూల్ కోసం వెళ్లి ఫస్ట్ డే షూట్ లో పాల్గొన్పప్పుడు ఇబ్బంది పడ్డాను. సినిమాలో అంతా సీనియర్స్ కాబట్టి సపోర్ట్ చేశారు.

రాజ్ తరుణ్ తో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. సెట్స్ లో తన సపోర్ట్ అందించేవారు. మా డైరెక్టర్ రామ్ భీమన గారికి థ్యాంక్స్ చెబుతున్నా. మా ప్రొడ్యూసర్స్ మమ్మల్ని అందరినీ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లా చూసుకున్నారు.

నా మొదటి చిత్రంలోనే చాలా మంది పెద్ద ఆర్టిస్టులతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ లాంటి స్టార్స్ కళ్లతోనే నటిస్తారు. నేనూ అలా నటించాలని అనుకునేదాన్ని.

పురుషోత్తముడు సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. మీరంతా కుటుంబతో వెళ్లి చూడండి. ఈ సినిమాను ఒక ఆడియెన్ గా చూసినప్పుడు హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనే ఫీల్ కలిగింది.

తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్స్ తక్కువ మంది ఉన్నారు. తెలుగమ్మాయిని కాకున్నా తెలుగు మాట్లాడుతున్నందువల్ల నన్ను ఇక్కడి అమ్మాయిలాగే చూస్తున్నారు. తెలుగు సినిమాల్లో హీరోయిన్స్ ను అందంగా చూపిస్తారు. అందుకే నాకు తెలుగు సినిమాలంటే ఇష్టం.


లవ్ స్టోరీస్ తో పాటు యాక్షన్ మూవీస్ కూడా చేయాలని ఉంది. ప్రస్తుతం కొన్ని సినిమాల ఆఫర్స్ వస్తున్నాయి. మీ అందరి సపోర్ట్ నాకూ, మా పురుషోత్తముడు సినిమాకు అందిస్తారని కోరుకుంటున్నా.




