
ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 289ఏడీ.

దిశాపటానీ కథానాయికగా నటిస్తోంది. ఇటీవల ఈ మూవీ చిత్రీకరణ ఇటలీలో జరిగింది. ప్రభాస్- దిశాలపై ఓ రొమాంటిక్ పాటను చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

తాజాగా దిశా పటానీ ఇటలీ షెడ్యూల్‌కు సంబంధించి కొన్ని ఫోటోలు, వీడియోలు షేర్ చేసింది. అందులో ప్రభాస్‌తో దిగిన సెల్ఫీ హైలైట్‌గా నిలిచింది.

ఇక సినిమా విషయానికి వస్తే.. ఆరువేల సంవత్సరాల టైమ్ లైన్‌తో సోషియో ఫ్యాంటసీ అండ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా కథ మహాభారతం కాలంలో మొదలై, 2898తో పూర్తవుతుంది. అందుకే ‘కల్కి 2898ఏడీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశాం అని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు.

ఈ మూవీని అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం మే 9న విడుదల కానుంది. కానీ వాయిదా పడే అవకాశాలున్నాయని ఫిలింనగర్ టాక్!


