
మెగాస్టార్ ఫ్యామిలీ 2024 సంక్రాంతి సంబరాలను బెంగళూరులోని చిరంజీవికి ఎంతో ఇష్టమైన తన సొంత ఫామ్‌హౌజ్‌లో జరుపుకున్నారు.

ఈ సంబరాల్లో చిరంజీవి, అల్లు అరవింద్, రామ్ చరణ్, అల్లు అర్జున్‌తో సహా వారి కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు.

ఇంతకు ఆ ఫామ్‌హౌజ్ ఎక్కడ ఉంది..? ఎవరిది..? దాని ఖరీదు ఎంత..? అనే విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

అసలు విషయం ఏమిటంటే ఆ ఫామ్‌హజ్ మెగాస్టార్ చిరంజీవికి సంబంధించినదే...

అది బెంగళూరుకు దాదాపు 30 కీమీ దూరంలో ఉన్న దేవనహళ్లిలో ఉంది.

వారి ఫామ్‌హౌజ్‌కు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కూడా దగ్గర్లోనే ఉంటుంది.

అయితే ఈ ఫామ్‌హౌజ్ ధర దాదాపు రూ.30 కోట్లకు పైమాటే ఉండవచ్చని తెలుస్తోంది.

అక్కడ ఆచార్య సినిమా షూట్ కూడా జరిగింది. మెగా కుటుంబానికి సంబంధించి చాలా వేడుకలు ఇక్కడే జరిగాయి.

ఇందులో భాగంగానే ఈ సంక్రాంతి వేడుకలు కూడా అక్కడ వారందరూ ఘనంగా జరుపుకున్నారు.


ఆ సమయంలో వారు గ్రూప్‌గా తీసుకున్న ఫోటోను చిరంజీవి తన అభిమానుల కోసం షేర్ చేసి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు.