
జీవితం ఎవరికీ పూలపాన్పు కాదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలిగిన మనీషా కొయిరాలాకు జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి.

ప్రపంచమే తన కాలికింద ఉందన్న అహంకారాన్ని, గర్వాన్ని పాతాళంలోకి తొక్కిపెట్టాయి.

ఈ సుందరి క్రిమినల్ మూవీతో తెలుగువారికి పరిచయమైనా ఒకే ఒక్కడు సినిమాలోని నెల్లూరి నెరజాణ.. పాటతో అందరి మనసులు దోచేసింది.

కెరీర్ టాప్‌లో ఉన్న సమయంలో నేపాల్‌కు చెందిన సమ్రాట్ దహల్‌తో 2010లో పెళ్లి జరిగింది.

పెళ్లయిన ఆరునెలలకే గొడవలు మొదలయ్యాయి.

ప్రేమంచిన భర్తే శత్రువుగా మారడంతో విడాకులు తీసుకోక తప్పలేదు.

వైవాహిక బంధంలో సంతోషంగా లేకపోతే విడిపోవడమే మంచిదని చెప్పిందంటే ఆమె ఎంత టార్చర్ అనుభవించిందో అర్థం చేసుకోవచ్చు.

అప్పటికే తాగుడుకు బానిసైన ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది.

దీనికి తోడు 2012లో అండాశయ క్యాన్సర్ బారిన పడింది. కీమోథెరపీ, సర్జరీల అనంతరం 2014లో క్యాన్సర్‌ను జయించి కొత్త జీవితం మొదలుపెట్టింది.

ఇటీవల హీరామండి అనే వెబ్ సిరీస్‌లో నటించడంతో ఒక్కసారిగా ఆమె పేరు వార్తల్లో మార్మోగిపోతోంది.







