
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొంత కాలం పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై మెరిసేందుకు అడుగులు వేస్తున్నారు.

చివరిగా బాలీవుడ్‌లో ఛత్రపతి సినిమాలో నటించిన ఆయన కొన్ని రోజుల క్రితం టైసన్ నాయుడు చిత్రాన్ని ప్రారంభించారు.

అయితే, తాజాగా #BSS11 పేరుతో మరో కొత్త ప్రాజెక్ట్‌ను ఆయన పట్టాలెక్కించారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ మరోసారి ఈ సినిమాలో జోడిగా కనిపించనున్నారు.















