

పెళ్లీడు రాగానే ఆ తంతు పూర్తి చేయాలని పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ 30 ఏళ్లు దాటినా కొందరు పెళ్లి గురించి ఆలోచించడమే లేదు.

ఈ లిస్టులో హీరో, హీరోయిన్సే కాదు యాంకర్స్ కూడా ఉన్నారు. యాంకర్ రష్మి ఈ నెల 27వ తారీఖు వస్తే 36వ పడిలోకి అడుగుపెడుతుంది.

కానీ ఇప్పటికీ అత్తారింటికి వెళ్లాలన్న ధ్యాసే లేదు.

తాజాగా ఓ షోలో ఆమె మాట్లాడుతూ.. తనకు కాబోయే భర్త చెప్పించే చేయాలని.. చేసిందే చెప్పాలంటూ ఓపెన్ అయింది.

అలాంటి వ్యక్తినే పెళ్లాడుతానంది. ఇప్పటికే టీవీ షోల్లో రష్మికి అనేకసార్లు పెళ్లి చేసేశారు.

మరి రియల్ లైఫ్‌లో ఎప్పుడు పెళ్లిపీటలెక్కుతుందో చూడాలి! ఇకపోతే జబర్దస్త్ షో ద్వారా ఫేమస్ అయిన రష్మి హీరోయిన్‌గా కూడా సినిమాలు చేసింది.

కానీ వెండితెర కంటే బుల్లితెర ద్వారానే ఎక్కువమంది అభిమానులను సంపాదించుకుంది.























