

దుబాయ్‍లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఈ చిత్రంలో బన్నీ మేనరిజం అభిమానులను ఓ ఊపు ఊపేసింది. ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం కూడా అందుకున్నారు

వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్న బన్నీకి అరుదైన గౌరవం లభించింది

దుబాయ్‍లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు

స్వయంగా అల్లు అర్జున్ హాజరైన తన రూపాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు

అచ్చం పుష్ప స్టైల్లోనే విగ్రహాన్ని రూపొందించడం మరో విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది





















