
హీరో అల్లు అర్జున్.. 13 పెళ్లి వార్షికోత్సవం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించి ఇన్ స్టాలో క్యూట్ స్టోరీ పెట్టాడు.

ఇకపోతే 2011 మార్చి 6న స్నేహారెడ్డిని బన్నీ పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు అయాన్, అర్హ అని ఇద్దరు పిల్లలు ఉన్నారు.

తన 13వ పెళ్లి వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహాని అల్లు అర్జున్ తెగ పొగిడేశాడు.

'మన పెళ్లయి 13 ఏళ్లయిపోయింది. నేను ఇలా ఉండటానికి నీతో బంధమే కారణం.

నీ ప్రశాంతత నుంచి నాకు బోలెడంత శక్తిని ఇచ్చావ్. మరెన్నో వార్షికోత్సవాలు ఇలానే జరుపుకోవాలని కోరుకుంటున్నా

అల్లు అర్జున్, భార్యతో కలిసున్న ఫొటో పోస్ట్ చేసి క్యూట్ ఇన్ స్టా స్టోరీ పోస్ట్ చేశాడు.






















