
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ముంబైకు చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్‌దేవ్ తో కలిసి ఆమె ఏడడుగులు నడిచింది.

థాయ్‌లాండ్ వేదికగా జులై 2న వీరి వివాహం ఘనంగా జరిగింది. టాలీవుడ్, కోలీవుడ్ కు చెందిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వరలక్ష్మి వివాహ వేడుకలో పాల్గొన్నారు.

ఇక పెళ్లికి రాని వారి కోసం చెన్నైలోని తాజ్ హోటల్ లో ఘనంగా రిసెప్షన్ కార్యక్రమాన్ని జరిపించారు. ఈ వేడుకకు తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియా వైరల్‌గా మారాయి.

అయితే పెళ్లి ఫోటోలు మాత్రం వరలక్ష్మీతో పాటు శరత్ కుమార్ ప్యామిలీ సభ్యులెవరు సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. దీంతో పెళ్లి జరిగిన వారం రోజుల తర్వాత వరలక్ష్మీ పెళ్లి ఫోటోలు నెట్టింట్లో దర్శనం ఇచ్చాయి.





ప్రస్తుతం వరలక్ష్మి- నికోలాయ్ సచ్‌దేవ్‌ల పెళ్లి ఫోటోలు వైరల్ గా మారడంతో నూతనవధూవరలకు నెటిజన్లు కూడా తమ బెస్ట్ విషెస్ ని తెలియజేస్తున్నారు.





