
ప్రముఖ సీరియల్ నటి సుజిత ఎవరో తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.

ఎందుకంటే 'వదినమ్మ' లాంటి సీరియల్‌తో మనోళ్లకు బాగా దగ్గరైపోయింది.

ఇప్పుడంటే సీరియల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది కానీ అప్పట్లో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది.

చిరంజీవి 'పసివాడి ప్రాణం' మూవీలో చిన్నపాప ఈమెనే. పోలికలు చూడండి మీకే అర్థమవుతుంది.

1998 నుంచి సుజిత.. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోని పలు సీరియల్స్ చేసింది. ఇప్పటికీ చేస్తోంది.

పలు రియాలిటీ షోల్లోనూ జడ్జి, హోస్ట్, కంటెస్టెంట్, గెస్ట్‌గా ఎంటర్‌టైన్ చేసింది.

1993 నుంచి చైల్డ్ ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు, తమిళ, మలయాళంలో పలు సినిమాలు చేసింది.

ఈమె అన్నయ్య పేరు సూర్య కిరణ్. తెలుగులో 'సత్య' మూవీ తీసింది ఈయనే. తెలుగు బిగ్‌బాస్ షోలోనూ పాల్గొన్నారు.

ఇకపోతే ధనుష్ అనే దర్శకుడిని సుజిత్ చాలా ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఓ కొడుకు కూడా ఉన్నాడు.
















