
జూలై 11, 1980లో డెన్మార్క్‌లో జన్మించాడు మథియస్ బో. 1998లో అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో అడుగుపెట్టాడు.

అనతి కాలంలోనే డబుల్స్ విభాగంలో వరల్డ్ నంబర్ వన్ స్థాయికి చేరుకున్నాడు.

యూరోపియన్ చాంపియన్‌షిప్స్-2006లో పురుషుల డబుల్స్ విభాగంలో రజతం గెలిచిన మథియస్ బో.. 2010లో డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లునెగ్గాడు.

2011లో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లోనూ చాంపియన్‌గా అవతరించాడు.

ఈ ఆ తర్వాత సహచర ఆటగాడు కార్‌స్టన్ మొగెన్సన్‌తో కలిసి మెన్స్ డబుల్స్ విభాగంలో 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచాడు.

చైనాలోనూ ఇదే ఫలితాన్ని పునరావృతం చేస్తూ.. 2013 వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లోనూ సిల్వర్ మెడల్ అందుకుంది ఈ జోడీ.

ఇక 2015లో యూరోపియన్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన మథియస్ బో.. 2012, 2017లో యూరోపియన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ విజేతగానూ నిలిచాడు.

దాదాపు రెండు దశాబ్దాల పాటు విజయవంతమైన ఆటగాడిగా కొనసాగిన మథియస్ బో.. 2020లో రిటైర్మెంట్ ప్రకటించాడు.

ఈ క్రమంలో భారత బ్యాడ్మింటన్ స్టార్ చిరాగ్ శెట్టి అభ్యర్థన మేరకు కోచ్‌గా అవతారమెత్తాడు.

2021 నుంచి చిరాగ్ శెట్టి- ఆంధ్రప్రదేశ్ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి సహా భారత బ్యాడ్మింటన్ డబుల్స్ టీమ్‌కు మార్గదర్శనం చేస్తున్నాడు మథియస్ బో. చిరాగ్- సాత్విక్ వరల్డ్ నంబర్ వన్ జోడీగా ఎదగడంలో కీలక పాత్ర పోషించాడు.

తమ విజయాలకు మథియస్‌కే క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుందని ఈ ఇద్దరు ప్లేయర్లు ఓ సందర్భంలో పేర్కొన్నారు కూడా! ఇక ప్రస్తుతం మథియస్ బో చిరాగ్- సాత్విక్‌ను 2024 ప్యారిస్ ఒలింపిక్స్‌కు సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు సమాచారం.





