
వింగ్స్ ఇండియా–2024 రెండో రోజూ విమాన విన్యాసాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఊపిరి బిగపెట్టుకుని కళ్లార్పకుండా విన్యాసాలు వీక్షించారు

పొగలు కక్కుకుంటూ ఆకాశంలోకి దూసుకుపోతున్నట్లుగా అనిపించేంతలో.. అమాంతం కిందపడుతుందేమోనని భయంతో చూసేవారికి ముచ్చెమటలు పట్టేస్తున్నాయి.

ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే విన్యాసాలు సాగాయి

మరోవైపు వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు ఎగ్జిబిషన్‌లో తమ ఉత్పత్తుల స్టాల్స్‌ను ప్రదర్శించారు.

ఏవియేషన్ షోకే ప్రత్యేక హైలైట్‌గా నిలుస్తోన్న బోయింగ్, ఎయిర్‌బస్‌ను చూసేందుకే సందర్శకులు మక్కువ కనబరుస్తున్నారు. క్యూలో నిల్చుని మరీ ఆయా విమానాల్లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు.

బోయింగ్ విమానంలో ఎక్కేముందు సందర్శకుల పేర్లు వివరాలను నోట్‌బుక్‌లో రాయించుకుని మరీ అనుమతిస్తున్నారు.









































