1/9
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ చాలామంది స్మార్ట్ మొబైల్ ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. అలాంటి వారికోసం బేసిక్ ఫీచర్ మొబైళ్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. దాంతోపాటు కొన్ని కంపెనీలు తమ సంస్థ పరిసరాల్లో స్మార్ట్‌ఫోన్ల వాడకాన్ని నిషేధించాయి. వాటిలో పనిచేస్తున్న ఉద్యోగులు బ్రేక్ సమయంలోనో లేదా ఏదైనా అత్యవసర సమయాల్లోనూ తమవారికి సమాచారం చేరవేయాలంటే కష్టం అవుతుంది. కాబట్టి అలాంటి ఉద్యోగులకు ఈ ఫీచర్ ఫోన్లు బాగా ఉపయోగపడుతాయి. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న కొన్ని ప్రముఖ కంపెనీలకు చెందిన బేసిక్ ఫోన్ల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. (కింద తెలిపిన ధరల్లో మార్పులు ఉండొచ్చు. గమనించగలరు)
2/9
జియో భారత్ కే1 కార్బన్ - వీజీఏ ప్రాథమిక కెమెరా, 1.77 అంగుళాల స్క్రీన్, 1000 mAh బ్యాటరీ, UPI చెల్లింపు సౌకర్యం, ధర: రూ.999.
3/9
నోకియా 105 క్లాసిక్ (2023) - 4ఎంబీ ర్యామ్, 1.77 అంగుళాల డిస్ప్లే, Li-Ion 800 mAh బ్యాటరీ, వైర్‌లెస్ ఎఫ్‌ఎం రేడియో, ధర: రూ.1,149.
4/9
శామ్‌సంగ్ గురు 1200 - 1.5 అంగుళాల డిస్‌ప్లే, టార్చ్‌లైట్, 1800 mAh బ్యాటరీ, ధర: రూ.1,299.
5/9
ఐటెల్ పవర్ 900 - 0.3 ఎంపీ ప్రాథమిక కెమెరా, 2.8 అంగుళాల డిస్‌ప్లే, ధర: రూ.1,699.
6/9
శామ్‌సంగ్ మెట్రో B313 - 2.0 అంగుళాల డిస్‌ప్లే, రికార్డింగ్‌తో ఎఫ్‌ఎం రేడియో, MP3 ప్లేయర్, 800 mAh బ్యాటరీ, ధర: రూ.1,990.
7/9
నోకియా 150 (2020) - 2.4 అంగుళాల డిస్‌ప్లే, వీజీఏ కెమెరా, వైర్‌లెస్ ఎఫ్‌ఎం రేడియో, MP3 ప్లేయర్, ధర: రూ.2,499.
8/9
నోకియా 150 (2023) - 4 ఎంబీ ఇంటర్నల్ స్టోరేజీ, 2.4 అంగుళాల డిస్ప్లే, 1450 mAh బ్యాటరీ, రూ.3,099.
9/9
నోకియా 5310 - 16 MB / 8 MB ర్యామ్, 0.3 MP ప్రాథమిక కెమెరా, 2.4 అంగుళాల డిస్ప్లే, 1200 mAh బ్యాటరీ, ధర: రూ.3,324.