
నిజామాబాద్: ఇందూరు ఊర పండుగ.. గత 76 ఏళ్లుగా నగరంలోని అన్ని కులాల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తోంది

ఎనిమిది దశాబ్దాల క్రితం ప్లేగు వ్యాధి ప్రబలిన సమయంలో ఈ నగరంలో ప్రారంభమైన ఊర పండుగ (పెద్ద పండుగ)కు నగర ప్రజలు ఎనలేని ప్రాధాన్యత ఇస్తారు

ఈ నెల 28న ఊర పండుగను ఘనంగా నిర్వహించేందుకు సర్వసమాజ్ కమిటీ రంగం సిద్ధం చేసింది

నగరంలోని 12 చోట్ల కొలువై ఉన్న గ్రామ దేవతల గుడులలో అన్ని కులాల్లోని అన్ని కుటుంబాలు అత్యంత భక్తి శ్రద్థలతో పూజలు చేస్తారు

నగరంలో అత్యధిక జనాభా పాల్గొనే ఈ పండుగ ప్రారంభ, ముగింపు ఉత్సవాలు, ఊరేగింపులు భారీ ఎత్తున జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది

14 గ్రామ దేవతల గుడులకు సంబంధించిన ఊరేగింపు ఖిల్లా శారదాంబ గద్దె నుంచి మొదలవుతుంది

పండుగ సన్నాహక క్రతువులో భాగంగా ఈ నెల 23న బండారు పోశారు

ఊర పండుగ నేపథ్యంలో భారీ ఊరేగింపు పెద్దబజార్ చౌరస్తా వద్ద దుబ్బ, వినాయక్‌నగర్, సిర్నాపల్లి గడి రోడ్ అనే విభాగాలుగా విడిపోతాయి

తరువాత 14 గ్రామ దేవతల గుడులకు తీసుకెళ్లి విగ్రహాలను ప్రతిష్టిస్తారు

గాజుల్‌పేటలోని వివేకానంద చౌరస్తా వద్ద భారీ పోలీసు బందోబస్తు మధ్య సరి (ఇంటిపై చల్లుకునే పదార్థం) చల్లుతారు

ఊరేగింపు రోజు తెల్లవారుజాము 2 గంటల నుంచే కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి




