TS Lok Sabha Polling 2024 Updates: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ అప్‌డేట్స్‌.. | Telangana Lok Sabha Elections 2024 Voting Live Updates And Highlights In Telugu | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

Live Updates

Cricker

TS Lok Sabha Polling 2024 Updates: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ అప్‌డేట్స్‌..

గతసారి కంటే ఈసారి తెలంగాణలో పెరిగిన పోలింగ్ శాతం

ఐదు పార్లమెంట్ నియోజకవర్గం 70 శాతం దాటిన పోలింగ్
భువనగిరి, ఖమ్మం, మెదక్, నల్గొండ, జహీరాబాద్ లో 70 శాతం దాటిన పోలింగ్
60 శాతానికి పైగా నమోదైన 7 పార్లమెంటు సెగ్మెంట్లు
ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, నిజామాబాద్ వరంగల్ లలో 60శాతం పోలింగ్
చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్లో 53% పోలింగ్ నమోదు
తక్కువ శాతం నమోదైన మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లు

2024-05-13 18:02:15

తెలంగాణలోని 13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్

  • ముగిసిన నియోజకవర్గాల్లో సాయంత్రం మూడు గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం
  • సిర్పూర్ - 61.16
  • ఆసిఫాబాద్:- 65.5
  • చెన్నూర్:- 58.65
  • బెల్లంపల్లి :- 63
  • మంచిర్యాల్:- 52.97
  • మంథని:- 56.2
  • భూపాలపల్లి:- 58
  • ములుగు:- 61.23
  • పినపాక:- 60.68
  • ఇల్లందు:- 61.86
  • భద్రాచలం:- 60.58
  • కొత్తగూడెం:- 60.92
     
2024-05-13 16:12:58

మధ్యాహ్నం 3 గంటల వరకు 52 శాతం పోలింగ్‌ నమోదు

  • తెలంగాణలో లోక్‌సభ నాలుగో విడత పోలింగ్‌ కొనసాగుతోంది
  • మధ్యాహ్నం 3 గంటల వరకు 52 శాతం పోలింగ్‌ నమోదైంది
2024-05-13 15:39:04

జగిత్యాల జిల్లాలో ఉద్రిక్తత

జగిత్యాల జిల్లా:

మేడిపల్లి (భీమారం) మండలంలోని గోవిందరం బూత్ నెంబర్ 43లో ఉద్రిక్తత

బూత్ ఇంచార్జిగా నియమించిన కారోబర్ ఇతర పార్టీలకు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నాడని కాంగ్రెస్ నాయకుల ఆరోపణ

వెంటనే తనను విధుల నుంచి తొలగించాలని కాంగ్రెస్ శ్రేణుల నిరసన

అతనిపై యాక్షన్ తీసుకుంటామని రిటర్నింగ్ అధికారికి పిర్యాదు చేసిన అధికారులు

2024-05-13 15:18:33

హైదరాబాద్‌లో గడప దాటని ఓటర్లు

  • హైదరాబాద్‌లోని మూడు లోక్‌సభ స్థానాల్లో అత్యల్ప ఓటింగ్‌ శాతం నమోదు
  • మధ్యాహ్నం 1 గంటవరకు హైదరాబాద్‌లో 19.37 శాతం పోలింగ్‌ మాత్రమే నమోదు.
  • సికింద్రాబాద్‌లో 24.91 శాతం
  • మల్కాజ్‌గిరిలో 27.69 శాతం నమోదు
2024-05-13 14:49:14

కేటీఆర్‌పై ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు

  • బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్.
  • ఓటు వేసిన తర్వాత మీడియాను అడ్రస్ చేస్తూ తెలంగాణ తెచ్చిన నేతకు ఓటు వేయాలని చెప్పిన కేటీఆర్.
  • కేటీఆర్ వ్యాఖ్యలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్.
2024-05-13 14:35:58

2019తో పోల్చితే ఈసారి పోల్ శాతం బాగానే ఉంది: సీఈవో వికాస్‌ రాజ్‌

  • మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40శాతం దాటింది: సీఈఓ వికాస్ రాజ్
  • హైదరాబాద్‌లో  20 శాతం ఉంది. మరింత పెరుగుతుందని ఆశిస్తున్నాం
  • 2019తో పోల్చితే ఈ సమయానికి పోల్ శాతం బాగానే ఉంది.
  • పలు సెగ్మెంట్లలో 50 శాతం దాటింది.
  • పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది.
  • ఫిర్యాదులు వస్తున్నాయి. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ అభ్యర్థి కేసు నమోదు అయింది.
  • ఓటర్ స్లీప్‌లు  పరిశీలన చెయ్యడం కోడ్ ఉల్లంఘనే.
  • జహీరాబాద్ , నిజామాబాద్ లో కేసులు వచ్చాయి.
  • వచ్చే ఫిర్యాదులపై విచారణ చేస్తున్నాం.
  • సీఎం రేవంత్ రెడ్డి పై వచ్చిన కంప్లైంట్స్ పై విచారణ చేస్తాం.
2024-05-13 14:33:07

తెలంగాణలో మధ్యాహ్నం 1 గంట వరకు 40.38 శాతం పోలింగ్‌ నమోదు

తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న పోలింగ్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం 1 గంట వరకు 40.38 శాతం పోలింగ్‌ నమోదు

  • అదిలాబాద్- 50.18 శాతం
  • భువనగిరి -46.49 శాతం
  • చేవెళ్ల-34.56 శాతం
  • హైద్రాబాద్ -19.37 శాతం
  • కరీంనగర్-45.11 శాతం
  • ఖమ్మం-50.63 శాతం
  • మహబూబాబాద్-48.81 శాతం
  • మహబూబ్నగర్-45.84 శాతం
  • మల్కాజిగిరి-27.69 శాతం
  • మెదక్-46.72 శాతం
  • నాగర్ కర్నూల్ -45.88 శాతం
  • నల్గొండ-48.48 శాతం
  • నిజామాబాద్-45.67 శాతం
  • పెద్దపల్లి-44.87 శాతం
  • సికింద్రబాద్-24.91 శాతం
  • వరంగల్-41.23 శాతం
  • జహీరాబాద్-50.71 శాతం
  • సికింద్రాబాద్ కంటోన్మెంట్-29.03 శాతం

 

2024-05-13 13:42:08

బీజేపీ అభ్యర్థి మాధవీలతపై జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ సీరియస్

  • హైదరాబాద్ పార్లమెంటు బీజేపీ అబీజేపీ అభ్యర్థి మాధవీలతపై జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ సీరియస్
  • ముస్లిం మహిళల నకాబ్ తొలగించి పరిశీలించినందుకు ఎన్నికల అధికారి ఆగ్రహం.
  • ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులకు ఆదేశం.
2024-05-13 13:37:45

సీఎం రేవంత్ రెడ్డిపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

  • సీఎం రేవంత్ రెడ్డిపై ఎలక్షన్ కమిషన్‌కు  ఫిర్యాదు చేసిన బీజేపీ.
  • కొడంగల్ సమావేశంలో బీజేపీ నిరాధారమైన విమర్శలు చేసినందుకు ఫిర్యాుదు.
  • రేవంత్ రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో డిమాండ్ చేసిన బీజేపీ
2024-05-13 13:34:46

ఈ ఎన్నికలు మా వందరోజుల పాలనకు రెఫరెండం: సీఎం రేవంత్‌

  • కొడంగల్‌లో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 33.5 శాతం ఓట్లు వచ్చాయి.. ఈ ఎన్నికల్లో అంతకు మించి వస్తాయి
  • ఈ ఎన్నికలు మా వందరోజుల పాలనకు రెఫరెండం.
  • బీజేపీ కూడా ఈ ఎన్నికలు మోదీ పాలనకు రెఫరెండం అని చెబుతోంది..
  • సెప్టెంబర్ 17, 2025తో మోదీకి 75 ఏళ్లు నిండుతాయి.
  • ఏజ్ లిమిట్ అమలు చేస్తే ఎవరు ప్రధాని అనేది బీజేపీ తేల్చుకోవాలి.
  • దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వం  ఏర్పాటు చేయడం ఖాయం.
  • మ్యాజిక్ ఫిగర్ రాకపోతే బీజేపీ, ఎన్డీఏకు దేశంలో మద్దతు ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరు.
  • బీజేపీ 336 సీట్లలో మాత్రమే పోటీ చేస్తోంది.. 400 సీట్లు ఎట్లా సాధ్యం?
  • 13 ఏళ్లు సీఎంగా, 10ఏళ్లు పీఎంగా పని చేసిన మోదీ.. మన రాజ్యాంగాన్ని పూర్తిగా అర్ధం చేసుకోలేదు.
  • దేశంలో మతపరమైన రిజర్వేషన్లు లేవు
  • సామాజికంగా వెనుకబడిన వారికి మాత్రమే దేశంలో రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి.
  • ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఏపీలో ఎన్డీఏ కూటమి ఎందుకు చెప్పడంలేదు.
  • దేశ ప్రజలకు మోదీ మాయమాటలు చెబుతున్నారు.
  • ఇండియా కూటమి పేరుతో మేం ప్రజలను ఓట్లు అడుగుతోంటే.. మోదీ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోంది.
  • ఎవరు నామ్ దార్.. ఎవరు కామ్ దార్ దీన్నిబట్టి తెలుస్తోంది.
  • ఎవరు అట్టడుగు వర్గాల ప్రజల కోసం పని చేస్తున్నారో చర్చకు సిద్ధం.
  • దేశంలో మోదీ వ్యతిరేక వేవ్ నడుస్తోంది.
  • మోదీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడినా చర్యలు లేవు.
  • నవనీత్ కౌర్ 15సెకన్ల కామెంట్స్‌పై చర్యలు లేవు.
  • బీజేపీ నేతలపై  ఎంహెచ్ఏ కంప్లైంట్ చేయదు..
  • కానీ ఒక వీడియో వైరల్ కేసులో మాపై ఎంహెచ్ఏ రంగంలోకి దిగింది..
  • ఏజెన్సీలను బీజేపీ దుర్వినియోగం చేస్తుందనడానికి ఇది నిదర్శనం..
  • బీజేపీ వాషింగ్ మెషిన్‌లో  చేరగానే కొందరు నాయకుల అవినీతి మరకలు తొలగిపోయాయా?
  • కాంగ్రెస్‌కు  ఆదానీ, అంబానీ డబ్బులు ఇస్తున్నారన్న మోదీని ఒక్కటే అడుగుతున్నా.
  • ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను పంపి ఆదానీ, అంబానీల ఆఫీసులపై, ఇళ్లల్లో సోదాలు నిర్వహించండి.
  • మోదీ ఆరోపణలు నిజమైతే ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదు..
  • రైతు బంధు ఎలా ఇచ్చామో.. పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేసి తీరుతాం..
  • రుణమాఫీ ఏమీ అసాధ్యమైన టాస్క్  కాదు..
  • పార్లమెంట్ ఎన్నికలు మా వంద రోజుల పాలనకు రెఫరెండం..
  • రాష్ట్రంలో శాంతిభద్రతలను దెబ్బతీసి  పెట్టుబడులు గుజరాత్‌కు  తరలించుకుపోవాలని బీజేపీ కుట్ర చేస్తోంది..
  • యూపీ పరిస్థితిని తెలంగాణలో తీసుకురావాలని ప్రయత్నిస్తోంది..
  • కేసీఆర్‌పై నాకు సానుభూతి ఉంది..
  • మానసిక ఒత్తిడితో, నిరాశతో భావోద్వేగంతో ఆయన ప్రకటనలు చేస్తున్నారు.
2024-05-13 13:29:20

షేక్ పేట్ డివిజన్‌లో 3వేల ఓట్లను డిలీట్ చేశారు: కిషన్ రెడ్డి

  • షేక్‌పేటలో  ఓట్లు గల్లంతైన పోలింగ్  కేంద్రాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • తమ ఓట్లు గల్లంతు కావడంతో ఆందోళనకు దిగిన ఓటర్లు
  • షేక్ పేట్ డివిజన్‌లో దాదాపు 3వేల ఓట్లను డిలీట్ చేశారు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
  • గత అసెంబ్లీ ఎన్నికల్లోనే వారంతా ఓటు వేశారు, ఇప్పుడేమో డిలీట్ అయ్యాయని చెప్తున్నారు
  • బీజేపీకి వ్యతిరేకంగా అధికారులు ఓట్లను తొలగించారు.
  • కేవలం ఒక వర్గానికి చెందిన వారి ఓట్లను మాత్రమే డిలీట్ చేశారు.
  • వారం కిందట ఓటర్ స్లిప్లను పంచారుఇప్పుడు లిస్ట్ లో ఓటర్ల పేర్లు డిలీట్ అయ్యాయి
  • అధికారులు కావాలనే ఓట్లను డిలీట్ చేశారు,దీనిపై పోరాడుతాం.
  • ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాను దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు.
  • రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయబోతున్నాం.
2024-05-13 13:17:42

నిజామాబాద్‌లో కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం

నిజామాబాద్ జిల్లా:

  • మోపాల్ మండలంలోని బైరాపూర్‌లో కాంగ్రెస్,బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం.. తోపులాట..
  • అరగంట పాటు నిలిచిన పోలింగ్
  • బీజేపీ కార్యకర్తలు ఓట్లు వేసేందుకు వచ్చి పోలింగ్ కేంద్రం దగ్గరే ఎక్కువ సేపటి నుంచి ఉంటున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకుల నిరసన
2024-05-13 12:35:32

ఓటు వేసిన మంత్రి దామోదర రాజనర్సింహ

సంగారెడ్డి:

  • జోగిపేట మార్కెట్ యార్డు లోని 196 పోలింగ్ బూత్ లో తన కూతురుతో కలిసి  ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి దామోదర రాజనర్సింహ
     
2024-05-13 12:32:09

ఎన్నికలవేళ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన కేటీఆర్

  • గతంలో ఇంతకంటే అనేక సవాల్ తో కూడుకున్న ఎన్నికలలో విజయం సాధించింది బిఆర్ఎస్ పార్టీ
  • గత ఎన్నికలు సాధించిన సీట్ల కన్నా ఎక్కువ సాధిస్తామని నమ్మకం ఉంది
  • ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిపార్టీ తామే గెలుస్తామంటుంది కానీ ప్రజలు నిర్ణయిస్తారు
  • జగన్‌మోహన్‌రెడ్డి నాకు సోదరుడి లాంటివాడు..
  • ఆంధ్రప్రదేశ్‌లోనూ నాకు అనేకమంది మిత్రులు ఉన్నారు
  • ఈ ఎన్నికల్లో ఆయన మంచి ఫలితాలు సాధిస్తారనే నమ్మకం ఉంది
  • పోలింగ్ స్టేషన్లో దగ్గర కరెంటు కోతలు లేకుండా జనరేటర్లు పెట్టి ముగ్గురు ముగ్గురు అధికారులతోని తెలంగాణ ప్రభుత్వం కష్టపడుతుంది
  • ఆరు గ్యారంటీలో ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఒక గ్యారెంటీని సగం సగం అమలు చేసింది
  • తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తాను ముఖ్యమంత్రిని గుర్తించాలి
  • ఆయన ప్రభుత్వ పనితీరు పైన దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నను
  • కరెంటు కోతలు నీటి కొరతల వంటి అసలైన సమస్యల పైన రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను
  • రాజకీయాలను పక్కనపెట్టి ప్రజా సమస్యల పైన ప్రభుత్వం పని చేసేలా చర్యలు తీసుకోవాలి
  • నరేంద్ర మోడీ శ్రీరామచంద్ర ప్రభువుకు చెప్పినట్టు రాజా ధర్మాన్ని పాటించాలి
  • అన్ని రాష్ట్రాల మధ్యన ఎలాంటి వివక్ష లేకుండా నిధులను కేటాయించడం లేదా ప్రాజెక్టులు కేటాయించడం చేయలేదు
  • భారతదేశం మొత్తం ప్రజలు మార్పును కోరుకుంటున్నారు
  • ప్రజలు ఎవరికి ఓటేస్తారో నాలుగో తేదీన తేలుతుంది
  • పది సంవత్సరాల నుంచి నరేంద్ర మోీదీ ప్రజలని మోసం చేస్తుంటే.. వందరోజుల నుంచి ఇక్కడ రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారు
  • ఈరోజు కరెంటు కోతల పైన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇచ్చినట్టుగా ఉంది
  • కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు.. ఇన్వర్టర్లు జనరేటర్లు, క్యాండిల్స్, పవర్ బ్యాంకులు, చార్జింగ్ లైట్, ఇవే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు
  • నంది నగర్ లోని జిహెచ్ఎంసి కమ్యూనిటీ హాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్న కేటీఆర్ కుటుంబం
  • ఐదేళ్లకోసారి ప్రభుత్వాలని ఎన్నుకునే అరుదైన అవకాశం ఎన్నికలు
  • ఎలాంటి ప్రభుత్వం కావాలో రాజ్యాంగం ఇచ్చిన గొప్ప అవకాశం
  • మన ప్రభుత్వాలని మనం నిర్ణయించే అధికారం ప్రజల చేతుల్లోనే ఉన్నప్పుడు ఈరోజు ఓటు వేయకుండా తర్వాత నిందిస్తే లాభం లేదు
  • దయచేసి అందరూ బయటకు వచ్చి ఓటు వేయండి
  • మంచి ప్రభుత్వాలను మంచి నాయకులను మీ సమస్యలకు ప్రాతినిధ్యం వహించే వారికి ఓటు వేయండి
  • తెలంగాణ తెచ్చిన నాయకుడు తెలంగాణ తెచ్చిన పార్టీకి నాయకుడు కేసీఆర్
  • తెలంగాణ కోసం తెలంగాణ భవిష్యత్తు కోసం నేను ఓటు వేశాను
2024-05-13 12:27:35

పోలింగ్‌ విధుల్లో అపశృతి.. సీనియర్‌ అసిస్టెంట్‌ మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

  • అశ్వరావుపేటలోని నెహ్రూ నగర్  165 పోలింగ్ బూత్‌లో విధులు నిర్వహిస్తున్న శ్రీ కృష్ణ అనే ఉద్యోగి గుండెపోటుతో మృతి
  • మృతుడు కొత్తగూడెం జిల్లా చుంచుపల్లిలో సీనియర్ అసిస్టెంట్
     
2024-05-13 12:19:37

ఓటు హక్కు వినియోగించుకున్న హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ

హైదరాబాద్‌:

  • రాంనగర్‌ కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

 

కరీంనగర్ జిల్లా:

  • చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి
     
2024-05-13 12:08:34

ఉదయం 11 గంటల వరకు 23.10 శాతం పోలింగ్‌ నమోదు

  • సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఉదయం 11.00 గంటలకు సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా సగటున పోలింగ్‌ శాతం 23.10 నమోదైంది.
  •  ఉదయం 11.00 గంటలకు దేశవ్యాప్తంగా 24.87  శాతం  నమోదైంది.
2024-05-13 12:03:59

ఓటు వేసిన ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

రాజన్న సిరిసిల్ల జిల్లా:

  • రుద్రంగి మండలం కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

జగిత్యాల జిల్లా:

  • జగిత్యాల పట్టణంలోని పురాణిపేట స్కూల్ లో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్సీ ఎల్ రమణ

 

2024-05-13 12:00:46

ఓటు వేసిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌

రాజన్న సిరిసిల్ల జిల్లా

  • బోయినపల్లి మండలం కొదురుపాకలో ఓటు హక్కు వినియోగించుకున్న రాజ్యసభ సభ్యులు జోగిని పెల్లి సంతోష్ కుమార్

జగిత్యాల జిల్లా

  • రాయికల్ పట్టణంలోని పలు బూత్‌లను సందర్శించిన బీఆర్ఎస్ అభ్యర్థి బాజీరెడ్డి గోవర్థన్
     
2024-05-13 11:57:33

ఓటు వేసిన మాజీ సీఎం కేసీఆర్‌ దంపతులు

సిద్దిపేట జిల్లా:

  • కేసీఆర్ స్వగ్రామం చింత మడకలో కేవీఆర్ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనీ 13వ పోలింగ్ కేంద్రంలో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న కేసీఆర్, శోభమ్మ.

కేసీఆర్ కామెంట్స్

  • రాష్ట్రంలో మంచి పోలింగ్ జరుగుతుంది 65 శాతం ఓటింగ్ కు మించి పెరిగే అవకాశం ఇది మంచి పరిణామం
  • ఈ ఎన్నికలల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలు
  • కీలక పాత్ర పోషించే అవకాశం వుంది
2024-05-13 11:42:11

ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

కొడంగల్‌: 

  • సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు
2024-05-13 11:34:59

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే తలసాని

  • వెస్ట్ మారేడ్ పల్లి లోని కస్తూర్బా గాంధీ గర్ల్స్ కాలేజీలో ఓటు హక్కు వినియోగించుకున్న తలసాని
  • ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం: మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
  • ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు.. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి
  • విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయండి
  • మనకు అన్ని విధాలుగా అండగా ఉండే వ్యక్తులనే ఎన్నుకోవాలి
  • ఎవరికి ఓటు వేస్తే మేలు జరుగుతుందో గుర్తించి ఓటు వేయాలి
2024-05-13 11:29:34

నంది నగర్‌లో ఓటు వేసిన కేటీఆర్ కుటుంబం

నంది నగర్‌లోని జిహెచ్ఎంసి కమ్యూనిటీ హాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్న కేటీఆర్ కుటుంబం

  • ఐదేళ్లకోసారి ప్రభుత్వాలని ఎన్నుకునే అరుదైన అవకాశం ఎన్నికలు
  • ఎలాంటి ప్రభుత్వం కావాలో రాజ్యాంగం ఇచ్చిన గొప్ప అవకాశం
  • మన ప్రభుత్వాలని మనం నిర్ణయించే అధికారం ప్రజల చేతుల్లోనే ఉన్నప్పుడు ఈరోజు ఓటు వేయకుండా తర్వాత నిందిస్తే లాభం లేదు
  • దయచేసి అందరూ బయటకు వచ్చి ఓటు వేయండి
  • మంచి ప్రభుత్వాలను మంచి నాయకులను మీ సమస్యలకు ప్రాతినిధ్యం వహించే వారికి ఓటు వేయండి
  • పోలింగ్ స్టేషన్లో దగ్గర కరెంటు కోతలు లేకుండా జనరేటర్లు పెట్టి ముగ్గురు ముగ్గురు అధికారులతోని తెలంగాణ ప్రభుత్వం కష్టపడుతుంది
  • తెలంగాణ తెచ్చిన నాయకుడు తెలంగాణ తెచ్చిన పార్టీ నాయకుడు కేసీఆర్
  • తెలంగాణ కోసం తెలంగాణ భవిష్యత్తు కోసం నేను ఓటు వేశాను
2024-05-13 11:25:06

ఓటేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మధిరలోని సుందరయ్య నగర్ లోని ప్రాథమిక పాఠశాలలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.

2024-05-13 11:11:23

పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతోంది: సీఈవో వికాస్‌ రాజ్‌

  • తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది: సీఈవో వికాస్‌ రాజ్‌.
  • అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ స్టార్ట్ అయింది ఎక్కడ ఎలాంటి సమస్యలు లేవు.
  • ఇప్పటి వరకి రాష్ట్రవ్యాప్తంగా 9.51 పోలింగ్ శాతం నమోదయింది.
  • కొన్ని చోట్ల వర్షాల వల్ల నిర్మల్ , ఆదిలాబాద్ , ఆసిఫాబాద్ లో ఇబ్బందులు వచ్చాయి.
  • 1-2%  ఈవీఎంలు ఆలస్యంగా వెళ్లాయి.
  • రాష్ట్రవ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి అంత అదుపులో ఉంది.
  • ఈవీఎంలు కొన్ని చోట్ల మొరాయించాయి.. రీప్లేస్ చేశాం.
  • పొలిటికల్ ఫిర్యాదులు అన్ని చెక్ చేసి చర్యలు తీసుకుంటాం.
2024-05-13 11:07:28

జగిత్యాల పురానీపేట పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత..

  • జగిత్యాల జిల్లా: జగిత్యాల పురానీపేట పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత..
  • నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జగిత్యాల్లో కాషాయ కండువాతో పోలింగ్ బూతులోకి వచ్చిన ఆముద రాజు అనే ఓటర్..
  • అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు..
  • ఇరువురిని సముదాయించి గొడవ సద్దుమణిగేలా చేసిన పోలీసులు..
  • పోలింగ్ బూత్ లో ఎందరో కాంగ్రెస్ కండువాలు కప్పుకుని నిల్చున్నా మాట్లాడని పోలీసులు.. తాను కాషాయ కండువాతో వెళ్లితే అడ్డుకోవడం ఏంటంటూ వాదనకు దిగిన రాజు.
2024-05-13 11:04:59

ఓటేసిన మంచు మనోష్‌, కోట శ్రీనివాసరావు

  • జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్లో  మంచు మనోజ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆనంద్ దేవరకొండ, ఆయన తల్లి
  •  మొండా మార్కెట్‌లోని  ఇస్లామీయ హై  స్కూల్లో  కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న సికింద్రాబాద్ పార్లమెంట్  బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్.
2024-05-13 11:04:59

తెలంగాణ లోక్‌ సభ ఎన్నికలు.. ఓటింగ్‌శాతం ఎంతంటే..

తెలంగాణలో ఇప్పటి వరకు 9.51శాతం పోలింగ్‌ నమోదు
 

  • ఆదిలాబాద్‌ 13.22 శాతం
  • భువనగిరి 10.54
  • చేవెళ్ల 8.29,
  • హైదరబాద్‌ 5.6 
  • కరీంనగర్‌ 10.23 శాతం
  • ఖమ్మం 12.24శాతం పోలింగ్‌
  • మహబూబాబాద్‌ 11.94 శాతం, 
  • మహబూబ్‌నగర్‌​10.33 శాతం
  • మల్కాజ్‌గిరి 6.20 శాతం, 
  • మెదక్‌ 10.99 శాతం పోలింగ్‌ 
  • నాగర్‌ కర్నూల్‌ 9.81శాతం
  • నల్లగొండ 12.8శాతం
  • నిజామాబాద్‌ 10.91 శాతం
  • పెద్దపల్లి 9.53శాతం.
  • సికింద్రబాబాద్‌ 5.4 శాతం.
  • వరంగల్‌ 8.97 శాతం
  • జహీరాబాద్‌లో 12.88 శాతం.
  • కంటోన్మెంట్‌  అసెంబ్లీ ఉప ఎన్నకలో 6.28 శాతం పోలింగ్‌.
2024-05-13 10:51:19

ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్‌

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకుమేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఓటర్లు పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.

  • సిద్దిపేట జిల్లా:  హుస్నాబాద్ లో కుటుంబ సమేతంగా ఆర్టీసీ బస్సులో పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌.
  • ఎన్నికల కమిషన్ చెప్పినట్టుగా భారత పౌరుడిగా  ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి తన ఓటు హక్కును వినియోగింన్నా: పొన్నం ప్రభాకర్‌.
  • ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి.
  • ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలంటే మతతత్వానికో, ప్రాంతీయతత్వానికో, కులతత్వానికో, ఇతరాత్ర ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి.
  • ప్రతి పౌరుడు ఎన్ని పనులు ఉన్న బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నా.
  • పెద్దపల్లి జిల్లా: గోదావరిఖని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఓటు హక్కును వినియోగించుకున్న బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆయన సతీమణి స్నేహలత

 

  • మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ.
  • ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లను కోరిన వంశీకృష్ణ.
  • జగిత్యాల జిల్లా: మెట్ పల్లి పట్టణంలోని 212 పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కుని వినియోగించుకున్న కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
  • పెద్దపల్లి జిల్లా:
  • ఎలిగేడు మండలం శివపల్లి లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే  విజయరమణారావు.
  • హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్ లో కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్న సీఈవో వికాస్ రాజ్
  • వనపర్తి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల 119 పోలింగ్ స్టేషన్లో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

 

  • జగిత్యాల జిల్లా: జగిత్యాల గర్ల్స్ జూనియర్ కాలేజ్ లో ఓటుహక్కు వినియోగించుకున్న నిజామాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి.
  • జాతి ఐక్యత, సమగ్రతకు ఈ ఎన్నికలు జరున్నాయి. సింగిరెడ్డి
  • ఈ ఎలక్షన్స్ దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది
  • కొన్ని పార్టీలు సమాజాన్ని మతం పేరుతో లబ్ధి పొందాలన్నాయి.
  • బీజేపికిి మ్యానిఫెస్టోలో లేదు.
  • కాంగ్రెస్ పార్టీ వ్యవసాయానికి పెట్టుబడి కల్పిస్తామని, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తమని, రైతాంగానికి అండగా ఉంటామని హామీ ఇస్తాం.
  • మహిళల ప్రోత్సాహం కోసం ముందుకు సాగుతుంది.
  • బీజేపీ పెట్టుబడి దారులకు అండగా ఉంటున్నది
  • దేశ ఐక్యతకు, సమగ్రతకు ప్రాణాలు అర్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ది.
  • ఎన్నికల్లో గెలవటం, ఒడటం సహజం,, ప్రజల్లో ఉండడం ముఖ్యం.
  • ఆత్మీయతకు, అహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు.
  • జీవన్ రెడ్డి ఆత్మీయత కలిగిన వ్యక్తి.
  • మెట్ పల్లి పట్టణంలోని 212 పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కుని వినియోగించుకున్న కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకున్న  జిల్లా ఎస్పీ.

కొత్తగూడెం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని త్రీ ఇంక్లైన్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

2024-05-13 10:35:24

ఓటేసిన కీరవాణి, రాజమౌళి

  • హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌లో సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.
  • ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, ఆయన కుమారుడు కార్తీకేయ ఓటుహక్కు వినియోగించుకున్నారు.
    తన కుటంబ సభ్యులతో కలిసి కరీంనగర్‌ ఎంపీ అభ్యర్ధి బండి సంజయ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • జూబ్లీహిల్స్‌లోని పోలింగ్‌ బూత్‌లో నటుడు శ్రీకాంత​ ఓటు హక్కు వినియోగించుకున్నారు
  • బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కే లక్ష్మణ్‌ హైదరాబాద్‌లో ఓటేశారు.

 

2024-05-13 10:09:09

తెలంగాణలోని పలు జిల్లాల్లో మందకోడిగా సాగుతున్న పోలింగ్

  • తెలంగాణలోని పలు జిల్లాల్లో మందకోడిగా సాగుతున్న పోలింగ్.
  • ఉదయం పది కావస్తున్న ఇంకా బయటకు రాని ఓటర్లు.
  • అత్యల్పంగా హైదరాబాద్ సికింద్రాబాద్ మల్కాజిగిరి పార్లమెంట్లో ఓటింగ్ శాతం నమోదు.
  • హైదరాబాద్ 5.06, సికింద్రాబాద్ 5.40, మల్కాజ్‌గిరి 6.20 పోలింగ్ శాతం నమోదు.
  • సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నిక మందకోడిగా పోలింగ్.
  • ఇప్పటివరకు 6.28 పోలింగ్ శాతం నమోదు.
2024-05-13 09:56:04

షేక్‌పేట్‌లో ఓట్ల గల్లంతుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీరియస్

  • షేక్‌పేట్‌లోని బూత్ నెంబరు15లో కొత్త ఓటరు జాబితాలో పలు ఓట్ల గల్లంతుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీరియస్.
  • రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్‌తో మాట్లాడి ఫిర్యాదు చేసిన కేంద్రమంత్రి
  • నగరంలోని పలు ప్రాంతాల్లో పోల్ స్లిప్స్ చిన్న ప్రింటర్లను పోలీసులు సీజ్ చేయడంపై మండిపడ్డ కిషన్ రెడ్డి
  • ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు.
  • డీసీపీతో మాట్లాడి ఆ ప్రింటింగ్ మిషన్లను తిరిగి పోలింగ్ కేంద్రాలకు చేరేలా చొరవతీసుకున్న కిషన్ రెడ్డి
2024-05-13 09:56:04

మెదక్‌ జిల్లా నారాయణఖేడ్‌లో ఉద్రికత్త

  • మెదక్‌ జిల్లా నారాయణఖేడ్‌లో ఉద్రికత్త
  • నారాయణఖేడ్ పట్టణంలోని 175 పోలింగ్ భుత్  వద్ద కాంగ్రెస్ బీజేపీ నాయకులు మధ్య ఘర్షణ
  • కాంగ్రెస్ అభ్యర్ధి సురేష్ షెట్కార్ తమ్ముడు నగేష్ షెట్కార్ బిజెపి నాయకులు పై దా
  • బీజేపీ కార్యకర్తను కాలితో తన్నిన కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్ధి సురేష్‌ షెట్కార్‌ సోదరుడు
2024-05-13 09:33:05

ఉదయం 9 గంటల వరకు 9.48 శాతం పోలింగ్‌ నమోదు

  • తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పోలింగ్
  • ఉదయం 9 గంటల వరకు 9.48 శాతం నమోదు
2024-05-13 09:29:08

జూబ్లీహిల్స్‌లో ఓటు వేసిన చిరంజీవి దంపతులు

  • తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌
  • జూబ్లీహిల్స్‌లో ఓటు వేసిన చిరంజీవి దంపతులు
  • జూబ్లీహిల్స్‌లో ఓటు వేసిన చిరంజీవి.
  • భార్య సురేఖ, కుమార్తె సుష్మితతతో కలిసి పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన చిరంజీవి.
  • ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోండి: చిరంజీవి
  • ఎవరి వల్ల రాష్టం, దేశం అభివృద్ధి చెందుతుంది అనుకుంటే వారిని ఎన్నుకోండి
  • ఓటు మీ భాధ్యత, మీ హక్కు
2024-05-13 09:09:17

ఓటేసిన బీజేపీ అభ్యర్ధి మాధవీలత

మల్కాజిగిరిలో ఓటు వేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత

  •  హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో 40 ఏళ్లుగా అభివృద్ధి లేదు: మాధవీలత 
  • హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో మహిళలకు ఆడపిల్లలకు రక్షణ లేదు.
  • హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో దేశభక్తి అనే మాటే వినపడకూడదు.
  • హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఏ దేవాలయాన్ని ఎప్పుడు ఆక్రమిస్తారో తెలియదు.
  • భయంకరమైన స్థితి బురదలో కూరుకుపోయిన హైదరాబాద్ పార్లమెంటును కాపాడాలి.
  • బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలి అని కోరుకుంటున్నా.

2024-05-13 08:56:16

ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయండి: బండి సంజయ్‌

కరీంనగర్ జిల్లా: కరీంనగర్ జ్యోతినగర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్

  • అమ్మవారి దయవల్ల దేవుడు దయవల్ల వాతావరణం చల్లగా ఉంది: బండి సంజయ్‌
  • ప్రజలందరు ఓటు హక్కును వినియోగించుకోవాలి.
  • దేశ ధర్మ రక్షణ కోసం జరుగుతున్న ఎన్నికలు.
  • కొందరు ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారు.
  • ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయండి.
  • ప్రజలంతా పోలింగ్‌లో పాల్గొనాలి.
  • ఓటు వేయడంతోపాటు పది మందితో ఓటు వేయించాలి.
  • ఓటర్లకు డబ్బులు మద్యం పంచి ఓట్లు వేయించుకోవడం మంచిది కాదు.
  • స్వేచ్చగా ఓటు వేయండి.
2024-05-13 08:38:03

కొనసాగుతున్న పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

  • తెలంగాణ రాష్ట్ర   వ్యాప్తంగా  కొనసాగుతున్న పోలింగ్‌.

  • ఉదయం 7 గంటల నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు.

 

  • మహబూబ్ నగర్: 113 పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ అభ్యర్ది డీకే అరుణ, కాంగ్రేస్ అభ్యర్ది చల్లా వంశీచంద్ రెడ్డి

  • జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

  • సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య స్కూల్లో బూతు నెంబర్ 95లో తమ ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ మంత్రి సూర్యపేట శాసనసభ్యులు జీ జగదీశ్ రెడ్డి

  • సూర్యాపేటలో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి.

 

  • కరీంనగర్ ఉర్దూమీడియం ప్రభుత్వ పాఠశాలలో కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్.

  • వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు.

  • నల్లగొండ జిల్లా: చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న నల్లగొండ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి

  • నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం వాసవి కాలేజీలో ఉన్న పోలింగ్ బూత్ లో తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారు.

  • మిర్యాలగూడలో డౌహిల్ స్కూల్లోని బూత్ నెంబర్ 101లో కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు.

2024-05-13 08:09:58

పలుచోట్ల ఈవీఎంల మొరాయింపు

  • మెదక్ టెక్మల్ పోలింగ్ బూత్‌లో  ఈవీఎంల మెరాయింపు.
  • సరి చేసేందుకు గంట పడుతుందని చెప్పడంతో వెనుదిరిగిన ఓటర్లు

 

  • జగిత్యాల జిల్లా : జగిత్యాల నియోజకవర్గంలో ప్రారంభమైన పోలింగ్‌.
  • జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

 

  • రాయికల్ మండలంలో ప్రారంభమైన పోలింగ్
  • మూటపల్లి గ్రామంలో 11వ పోలింగ్ బూత్ ఈవీఎం బటన్లపై అభ్యంతరం తెలిపిన  ఏజెంట్లు
  • సాంకేతిక నిపుణులతో మారుస్తున్న అధికారులు.
  • నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం మైలారంలో ఎన్నికలు బహిష్కరించిన గ్రామ ప్రజలు.

 

  • ఏజెంట్స్ లేక వెలవెలబోతున్న 179 వ పోలింగ్ కేంద్రం
  • పోలింగ్ కేంద్రం వద్ద కనిపించని ఓటర్లు
  • జూబ్లీహిల్స్ క్లబ్  పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి వచ్చిన సుమంత్
2024-05-13 07:41:46

ఓటేసిన జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, డైరెక్టర్‌ తేజ

  • ఓబుల్‌ రెడ్డి పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసిన జూనియర్‌ ఎన్టీఆర్‌, వెంకయ్యనాయుడు.
  • జూబ్లీహిల్స్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌లో ఓటు హక్కు వినయోగించుకున్న అల్లు అర్జున్‌, డైరెక్టర్‌ తేజ
  • హైదరాబాద్ మాదాపూర్‌లో  సతీసమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్న హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్‌.

2024-05-13 07:27:25

ప్రారంభమైన తెలంగాణ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌

  • తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన పోలింగ్.
  • సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న పోలింగ్.
  • మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ స్థానాలకు 4 గంటల వరకు మాత్రమే పోలింగ్‌కు అవకాశం.

 

  • తెలంగాణలోని పలుచోట్ల మోక్ పోలింగ్ లో EVMల మొరాయింపు
  • ఏడు గంటలకు పలు చోట్ల ప్రారంభం కానీ పోలింగ్
  • హైదరాబాద్, ఖమ్మంలోని పలు బూత్‌లలో  EVMల మొరాయింపు
2024-05-13 07:14:16

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం

సార్వత్రిక ఎన్నికల నాలుగో దశలో భాగంగా తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో నేడు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని 3.2 కోట్ల మంది ఓటర్ల తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.  లోక్‌సభ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం తెలంగాణలో 35,809 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. పోలింగ్ సాఫీగా సాగడం కోసం.. 175 కంపెనీల కేంద్ర బలగాలతోపాటు తెలంగాణ పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 

లోక్ సభ ఎన్నికలతోపాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఉపఎన్నిక సైతం నేడు జరగనుంది. ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన లాస్య నందిత ఫిబ్రవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో కంటోన్మెంట్ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. 

సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానం నుంచి.. బీఆర్ఎస్ నుంచి లాస్య నందిత సోదరి నివేదిత పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ గణేశ్, బీజేపీ నుంచి వంశీ తిలక్ బరిలో ఉన్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో 16 సీట్లు సాధించాలని టార్గెట్‌గా పెట్టుకున్న బీఆర్ఎస్ 9 సీట్లకే పరిమితమైంది. బీజేపీ అనూహ్యంగా 4 చోట్ల విజయం సాధించగా.. కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లో, ఎంఐఎం ఒక చోట గెలుపొందాయి.

2024-05-13 07:06:57
Advertisement
Advertisement
 
Advertisement
Advertisement