Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

కొనసాగుతున్న నామినేషన్ల పర్వం

Published Sat, Apr 20 2024 1:25 AM

- - Sakshi

మహబూబాబాద్‌: మానుకోట పార్లమెంట్‌ నియోజ కవర్గానికి రెండో రోజు నాలుగు నామినేషన్లు దాఖ లు అయినట్లు అధికారులు వెల్లడించారు. ములు గు నియోజకవర్గం మదనపల్లి గ్రామానికి చెందిన పోరిక బలరాంనాయక్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయ న వెంట ప్రభుత్వ విప్‌ రామచంద్రునాయక్‌, ఎమ్మెల్యేలు భూక్య మురళీనాయక్‌, కోరం కనక య్య, పాయం వెంకటేశ్వర్లు, నాయకులు వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, ఘనపురపు అంజయ్య, నూనావత్‌ రాధ, ఎడ్ల రమేష్‌ ఉన్నారు. బలరాంనాయక్‌ నాయక్‌ రెండు సెట్లు దాఖలు చేశారు. పినపాక నియోజకవర్గం మణుగూరుకు చెందిన పాల్వంచ దుర్గ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ చేశారు. వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం ముదిగొండ గ్రామానికి చెందిన జాటోత్‌ రఘునాయక్‌ ఆధార్‌ పార్టీ నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. నర్సంపేట ని యోజకవర్గం ఇటుకాలపల్లి గ్రామం ఏనుగుల తండాకు చెందిన బోడ అనిల్‌ నాయక్‌ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. రెండు రోజుల్లో ఐదు నా మినేషన్‌లు, ఆరు సెట్లు పత్రాలు అందినట్లు అధికా రులు తెలిపారు. నామినేషన్‌ల ప్రక్రియలో కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌ సింగ్‌, అదనపు కలెక్టర్లు, సహాయ రిటర్నింగ్‌ అధికారులు లెనిన్‌ వత్సల్‌ టొప్పో, డేవిడ్‌, ఆర్డీఓలు అలివేలు, నర్సింహరావు, తహసీల్దార్లు భగవాన్‌రెడ్డి, దామోదర్‌, శ్వేత, సునీల్‌రెడ్డి, పర్యవేక్షణ అధికారి పవన్‌కుమార్‌ పాల్గొన్నారు.

వరంగల్‌లో ముగ్గురి నామినేషన్‌

కాళోజీ సెంటర్‌ : వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ స్థానానికి శుక్రవారం రెండో రోజు ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీఎస్పీ అభ్యర్థిగా పంజా కల్పన, స్వతంత్ర అభ్యర్థిగా పేరంబుదూరి కృష్ణసాగర్‌, మన తెలంగాణ రాష్ట్ర సమైక్య పార్టీ అభ్యర్థిగా ఏఆర్‌ సేనా ప్రేమ్‌రెడ్డి రిపిక, స్వతంత్ర అభ్యర్థిగా (1) సెట్‌ మొత్తం 2 సెట్‌ల నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి, వరంగల్‌ కలెక్టర్‌ ప్రావీణ్యకు అందజేశారు. ఇప్పటి వరకు మొత్తం ఆరుగురు అభ్యర్థులు ఏడు నామినేషన్లు పత్రాలు సమర్పించారు. ఇందులో ఏఆర్‌ సేనా ప్రేమ్‌రెడ్డి రిపిక రెండు సెట్‌ల నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు.

నామినేషన్‌ దాఖలు చేసిన మహబూబాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాంనాయక్‌

Advertisement

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250