Just In
Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1
Ad - Sakshi_Home_Sticky
-
మార్వెల్ యూనివర్స్ నుంచి మరో సినిమా.. ట్రైలర్ అదుర్స్
మార్వెల్ యూనివర్స్ నుంచి వచ్చిన డెడ్‌పూబ్లా సినిమాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా ఈ సిరీస్ నుంచి మరో సినిమా రాబోతుంది. మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న తాజా చిత్రం ‘డెడ్‌పూల్ & వోల్వారిన్’. ఈ సినిమాలో ర్యాన్ రేనాల్డ్స్, హ్యూగ్ జాక్మాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. షాన్ లెవీ దర్శకత్వం వహిస్తున్నాడు. మార్వెల్ స్టూడియోస్, 21 ల్యాప్స్ ఎంటర్టైనమెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి స్పందన లభించింది. తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేసింది. ఫుల్ యాక్షన్ అడ్వెంచర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. డెడ్‌పూల్‌గా ర్యాన్ రేనాల్డ్స్ మరోసారి ఎంటర్టైన్ చేయడానికి సిద్దమయినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ఎమ్మా కొరిన్, మోరెనా బక్కరిన్, రాబ్ డెలానీ, లెస్లీ ఉగ్గమ్స్, కరణ్ సోని, మాథ్యూ మక్‌ఫాడియన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. -
Monkey Man In OTT: నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మరో క్రేజీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. హనుమంతుడి స్ఫూర్తితో తీసిన ఈ హాలీవుడ్ చిత్రం.. గత నెలలోనే ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. కావాల్సింది. కానీ సెన్సార్ ఇబ్బందుల వల్ల భారత్ తప్ప అన్నిచోట్ల కూడా విడుదలైంది. హిట్ టాక్ తెచ్చుకుంది. మనోళ్లు ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తుండగా.. సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన విషయం సర్ప్రైజ్ చేసింది. కాకపోతే ఇక్కడే చిన్న తిరకాసు ఉంది. 'స్లమ్ డాగ్ మిలియనీర్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దేవ్ పటేల్.. ఆ తర్వాత హాలీవుడ్లో ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇతడే 'మంకీ మ్యాన్' మూవీతో దర్శకుడిగానూ మారాడు. ఇందులో హీరోగానూ చేశాడు. హనుమంతుడి స్ఫూర్తితో తీసిన ఈ మూవీని పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్గా తీశాడు. ఫైట్స్ లాంటివి ఇష్టపడే ఆడియెన్స్ ఈ చిత్రాన్ని చూడొచ్చు. (ఇదీ చదవండి: పెళ్లి న్యూస్‌తో షాకిచ్చిన యంగ్ హీరోయిన్.. హల్దీ వీడియో వైరల్) ఇకపోతే సెన్సార్ ఇబ్బందుల వల్ల 'మంకీ మ్యాన్' మూవీ మన దేశంలో రిలీజ్ కాలేదు. ఇంకెప్పుడు అవుతుందా అని ఎదురుచూస్తున్న టైంలో అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ఓటీటీల్లో అందుబాటులోకి వచ్చేసింది. ఈ క్రమంలోనే భారతీయ ప్రేక్షకులు తెగ ఎగ్జైట్ అవుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతానికైతే రెంట్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. 'మంకీ మ్యాన్' కథ విషయానికొస్తే.. ముంబైని పోలినట్లు యాతనా అనే సిటీ ఉంటుంది. ఇక్కడ ఉండే హీరో.. రాత్రిపూట కోతి మాస్క్ వేసుకుని మల్లయుద్ధ పోటీల్లో పాల్గొంటూ ఉంటాడు. ఇతడికి ప్రత్యేకంగా పేరేం ఉండదు. ఇతడు.. ఓ అమ్మాయిని వ్యభిచారం నుంచి రక్షించేందుకు క్రూరుడైన పోలీస్ అధికారిని ఎదుర్కొంటాడు. హీరోకి పోలీస్ ఆఫీసర్‌కి గతంలో ఉన్న సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ. ఇందులో తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ల కూడా నటించింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ రెండు కాస్త స్పెషల్) -
హిందీ వార్‌లో హాలీవుడ్ యాక్షన్
బాలీవుడ్ ‘వార్ 2’లో హాలీవుడ్ తరహా యాక్షన్ కనిపించనుంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్‌లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘వార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తారట. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ ముంబైలోని ఓ స్టూడియోలో జరిగింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారట మేకర్స్. ఈ పోరాట దృశ్యాలను హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ స్పిరో రజాటోస్ డిజైన్ చేశారని బాలీవుడ్ సమాచారం. ఇక ‘కెప్టెన్ అమెరికా: ది సివిల్ వార్’, ‘కెప్టెన్ అమెరికా: ది ఫస్ట్ సోల్జర్’ ‘ఫాస్ట్ ఎక్స్’ వంటి హాలీవుడ్ చిత్రాలకు యాక్షన్ డిజైన్ చేశారు స్పిరో. కాగా స్పై జానర్లో ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్న ‘వార్ 2’ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 14న రిలీజ్ కానుంది. -
రష్యా ప్రతినిధులతో మెగాస్టార్ భేటి.. ఎందుకంటే?
ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న మెగాస్టార్ రష్యా ప్రతినిధులతో సమావేశమయ్యారు. మాస్కో నుంచి వచ్చిన రష్యా బృందం నేరుగా హైదరాబాద్‌లోని చిరంజీవికి ఇంటికి వెళ్లి కలిశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు సహకారంపై వారితో చర్చించారు. రష్యాలో తెలుగు చిత్రాల షూటింగ్‌తో సహా తదితర అంశాలపై వారితో మాట్లాడారు. రష్యాలో తెలుగు సినిమాల షూటింగ్‌ను ప్రమోట్ చేయడానికి వారు ఆసక్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. భారతీయ, తెలుగు చలనచిత్ర పరిశ్రమ, రష్యా మధ్య సృజనాత్మక సహకారాలపై ప్రతినిధి బృందం చిరంజీవితో మాట్లాడారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటో, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. మెగాస్టార్‌ను కలిసిన వారిలో మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధి బృందంలోని సినిమా సలహాదారు జూలియా గోలుబెవా, క్రియేటివ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ సెంటర్ హెడ్ ఎకటెరినా చెర్కెజ్ జాడే, ఫెడరల్ ఏజెన్సీ ఫర్ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ మాస్కో, యూనివర్సల్ యూనివర్శిటీ డైరెక్టర్ మరియా సిట్కోవ్స్కాయా ఉన్నారు. కాగా.. భోళాశంకర్ తర్వాత మెగాస్టార్ నటిస్తోన్న సోషియో-ఫాంటసీ చిత్రం విశ్వంభర. బింబిసార డైరెక్టర్ వశిష్ట ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం వచ్చేఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10, 2025న విడుదల కానుంది. A high level delegation of the Ministry Of Culture - Moscow has met #Chiranjeevi garu at his residence today Boss @KChiruTweets#MegastarChiranjeevi pic.twitter.com/NPLmjrUo1q — Chiranjeevi Army (@chiranjeeviarmy) April 18, 2024 -
Quentin Tarantino: చివరి సినిమా ఆగిపోయింది!
డైరెక్టర్ క్వెంటిన్ టరంటినో సినిమా అనగానే స్టయిలిష్ వయొలెన్స్, లెంగ్తీ డైలాగ్స్ కామన్ అని హాలీవుడ్ ప్రేక్షకులు అంటుంటారు. దర్శకుడిగా చాలా పాపులార్టీ సంపాదించుకున్న ఆయన తన రెండో చిత్రం ‘పల్ప్ ఫిక్షన్’ (1994)కే బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లేకి ఆస్కార్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత క్వెంటిన్ దర్శకత్వం వహించిన వాటిలో ‘ఇన్ గ్లోరియస్ బాస్టర్డ్స్, జాంగో అన్చైన్డ్, ది హేట్‌ఫుల్ ఎయిట్, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్’ చిత్రాలకు వివిధ విభాగాల్లో ఆస్కార్ అవార్డులు దక్కాయి. నటుడిగానూ పలు చిత్రాల్లో నటించారు. ఇప్పటివరకూ తొమ్మిది చిత్రాలకు దర్శకత్వం వహించిన క్వెంటిన్ తన పదో చిత్రంగా ‘ది మూవీ క్రిటిక్’ని ప్రకటించారు. ఇదే తనకు చివరి చిత్రం అన్నట్లుగా కూడా పేర్కొన్నారు. 1977లో దక్షిణ కాలిఫోర్నియాకి చెందిన ఓ పత్రికకు సినిమా రివ్యూలు అందించిన ఓ క్రిటిక్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించాలనుకున్నారు. తాను యుక్త వయసులో ఉన్నప్పుడు ఆ జర్నలిస్ట్ రాసిన రివ్యూలు చదివి చాలా ఘాటుగా ఉన్నట్లు భావించానని, అదే విధంగా కామెడీగా కూడా అనిపించిందని ఓ సందర్భంలో క్వెంటిన్ పేర్కొన్నారు కూడా. అందుకే అతని జీవితంతో సినిమా తీయాలనుకుని, 2023 జూన్‌లో ప్రీ ప్రొడక్షన్ పనులు ఆరంభించారు. తన గత చిత్రం ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్’లో నటించిన బ్రాడ్ పిట్‌ని ‘ది మూవీ క్రిటిక్’లో హీరోగా ఎంపిక చేసుకున్నారని కూడా వార్త ప్రచారమైంది. అయితే హఠాత్తుగా ఏమైందో ఏమో కానీ ‘ది మూవీ క్రిటిక్’ని తెరకెక్కించాలనే ఆలోచనను క్వెంటిన్ విరమించుకున్నారట. ఇప్పుడు హాలీవుడ్లో ఇది హాట్ టాపిక్ అయింది. మరి... 61 ఏళ్ల క్వెంటిన్ చివరి చిత్రం ‘ది మూవీ క్రిటిక్’ కాక΄ోతే వేరే ఏ చిత్రం అవుతుందనే చర్చ జరుగుతోంది.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Chekc 1234 off the field
Test article qid_23456x4
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 17 ఏళ్ల కెరీర్‌కు గుడ్ బై
ఎవరేశారో తెలుసుకోకుండా దోశలు తినేయడమేనా!!
స్టోయినిష్ అరుదైన రికార్డు.. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
విశ్వసనీయత లేని ప్రతిపక్షాన్ని తిరస్కరించాలి!
అభివృద్ధి బటన్ నొక్కిన సీఎం జగన్
దిక్కుతోచని కుటుంబం దిశ మారింది..!
సారా.. నారా అండతో దోపిడీకి C/O సీఎం రమేష్
ఛాంపియన్ దేశం
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019