Just In
Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1
Ad - Sakshi_Home_Sticky
-
కృష్ణబిలాల అన్వేషణలో
‘టైమ్’ మేగజీన్ 2024 సంవత్సరానికి గాను ‘100 మంది ప్రభావపూరిత వ్యక్తుల’ జాబితా ప్రకటించింది. ప్రపంచవ్యాప్త ఉద్దండులతో పాటు భారతీయులు కూడా ఈ ఎంపికైన వారిలో ఉన్నారు. వారిలో ఒకరు ఆస్ట్రోఫిజిసిస్ట్ ప్రియంవద రంగరాజన్. కృష్ణబిలాలను లోతుగా అధ్యయనం చేయడం ద్వారా సృష్టి పుట్టుకను విశదం చేయగల మర్మాన్ని ఈమె విప్పుతున్న తీరు అసామాన్యమని ‘టైమ్’ భావించింది. కోయంబత్తూరులో జన్మించి అమెరికాలో స్థిరపడ్డ ప్రియంవద పరిచయం. మన పాలపుంతలో ఎన్ని కృష్ణ బిలాలు (బ్లాక్ హోల్స్) ఉంటాయో తెలుసా? కనీసం కోటి నుంచి నూరు కోట్ల వరకు. అంతరిక్షంలో కృష్ణ బిలాలు ఒక నిగూఢ రహస్యం. ఐన్‌స్టీన్ వీటిని ఊహించాడుగాని ఆయన జీవించి ఉన్నంత కాలం వాటి ఉనికిపై వాస్తవిక ఆధారాలు వెల్లడి కాలేదు. 1967లో జాన్ వీలర్ అనే ఫిజిసిస్ట్ ‘బ్లాక్ హోల్’ పదం వాడినప్పటి నుంచి వీటిపై చర్చలు కొనసాగాయి. ఆ తర్వాతి కాలంలో ఉనికి గురించిన ఆధారాలు దొరికాయి. కృష్ణ బిలాలు కాంతిని కూడా మింగేసేంత శక్తిమంతమైనవి. చిన్న చిన్న బ్లాక్‌హోల్స్ నుంచి అతి భారీ (సూపర్ మాస్) బ్లాక్ హోల్స్ వరకూ మన పాలపుంతలో ఉన్నాయి. ఒక తార తన గురుత్వాకర్షణలో తానే పతనం అయినప్పుడు బ్లాక్ హోల్స్ ఏర్పడతాయనేది ఒక సిద్ధాంతమైతే ఇవి విశ్వం ఏర్పడే సమయంలోనే అంతరిక్ష ధూళిమేఘాలు తమపై తాము పతనవడం వల్ల ఏర్పడ్డాయని మరో సిద్ధాంతం. ఈ మరో సిద్ధాంతానికి ఊతం ఇస్తూ ప్రియంవద రంగరాజన్ సాగిస్తున్న పరిశోధనల వల్లే ఆమె తాజాగా ‘టైమ్’ మేగజీన్‌లో ‘హండ్రెడ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షల్ పీపుల్’లో ఒకరుగా నిలిచారు. ఆమె పరిశోధన ప్రియంవద కృష్ణబిలాల పరిశోధనలో ప్రత్యేక కృషి చేశారు. గురుత్వాకర్షణ లెన్సింగ్ పద్ధతి ద్వారా నక్షత్ర మండలాల ఆవిర్భావాన్ని, వాటి పరిణామాలను, అనేక నక్షత్ర మండలాల మధ్య అంతర్గత సంబంధాలపై అధ్యయనం చేశారు. నక్షత్ర మండల సమూహాల గతిశీలతను అధ్యయనం చేయడానికి లెన్సింగ్, ఎక్స్–రే, సున్యావ్–జెల్డోవిక్ డేటాను ఉపయోగించారు. అంతే కాదు ఒక నక్షత్రం, కృష్ణబిలం కలయిక ద్వారా ఏర్పడే విద్యుదయస్కాంత, గురుత్వాకర్షణ తరంగాలపై కూడా అధ్యయనం చేశారు. ఆమెను ఎన్నో అవార్డులు వరించాయి. ప్రతిష్టాత్మక లిబర్టీ సైన్స్ సెంటర్ వారి ‘జీనియస్ అవార్డు’ కూడా దక్కింది. ఈ విశ్వం ఎలా పరిణామం చెందిందో తెలుసుకోవడానికి ప్రియంవద సాగిస్తున్న కృష్ణబిలాల అన్వేషణ చాలా కీలకంగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కోయంబత్తూరులో జన్మించి... ప్రియంవద రంజరాజన్ కోయంబత్తూరులో జన్మించారు. తండ్రి ఉద్యోగం రీత్యా ఇంటర్ వరకూ ఢిల్లీలో చదువుకున్నారు. ఆమె అండర్ గ్రాడ్యుయేషన్ ‘మసాచుసెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’లో జరిగింది. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ నుంచి పిహెచ్డి చేశారు. ప్రస్తుతం అమెరికాలోని యేల్ యూనివర్సిటీలోప్రోఫెసర్గా పని చేస్తున్నారు. ‘మ్యాపింగ్ ది హెవెన్స్: ది రాడికల్ సైంటిఫిక్ ఐడియాస్ దట్ రివీల్ ది కాస్మోస్‘ అనే ముఖ్యమైన గ్రంథాన్ని రచించారు. -
దాల్చిన చెక్కతో ఊబకాయం, బెల్లీ ఫ్యాట్ నిజంగా తగ్గుతుందా?
సకల రోగాలకు మూలం ఒబెసిటీ. ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువుంటే అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అందుకే అధిక బరువును తగ్గించుకునేందుకు చాలామంది నానా కష్టాలు పడుతూ ఉంటారు. జీవనశైలి మార్పులు, ఆహారఅలవాట్లుమార్చుకోవడంతోపాటు, కొన్ని ప్రత్యేక పదార్థాలను కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వాటిల్లో బాగా వినిపిస్తున్నది దాల్చిన చెక్క. శరీరంలో కొవ్వును కరిగించడానికి దాల్చిన చెక్క నీరు, కషాయం, టీ బాగా ఎఫెక్టీవ్‌గా పని చేస్తుందని నమ్ముతారు. దాల్చిన చెక్క ఆకలిని నియంత్రిస్తుంది. జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే హార్మోన్ ఇన్సులిన్కుసరిగ్గా పనిచేసేలా చేస్తుంది. కొన్ని అధ్యయనాలు దాల్చినచెక్కను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని కూడా సూచిస్తున్నాయి. దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. ముఖ్యంగా దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీంలోని మలినాలను బయటకు పంపుతాయి. దాల్చిన నీరు తాగడం వల్ల శరీరం మెటబాలిజం పెరుగుతుంది. దీంతో వెయిట్ లాస్ అయ్యేందుకు చక్కగా పని చేస్తుంది. ప్రతి రోజూ ఉదయం దాల్చిన చెక్క నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గొచ్చు.శరీరంలో చెడు కొలెస్ట్రాల్ త్వరగా కరుతుంది. ఫలితంగా స్థూలకాయం, అధిక బరువును తగ్గించుకోవచ్చు. ఈ వాటర్ తాగడం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. దాల్చిన చెక్కలో అనేక యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు వాపు తగ్గించడం ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు సహాయపడుతుంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. సాధారణ జలుబు, ఫ్లూ, వార్మ్ ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ వంటి ఇన్ఫెక్షన్లను నిర్వహించడంలోసహాయపడుతుంది. గవద జ్వరం వంటి అలర్జీ సమస్యల నివారణలో దాల్చిన చెక్క ఉపయోగ పడుతుంది. పురుషులలో అంగస్తంభన సమస్యతోపాటు, స్పెర్మ్ కౌంట్ పెంచుతుంది. మహిళల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యకు పని చేస్తుంది. నోట్: అందరికీ ఈ చిట్కా మనచేస్తుందని చెప్పలేం. కానీ కచ్చితంగా కొన్ని ప్రయోజనాలు న్నాయి. అయితే ఆరోగ్యకరమైన జీవన శైలి, క్రమం తప్పని, వ్యాయామం బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయిని మాత్రం మర్చిపోకూడదు. -
నూడుల్స్‌లో డైమండ్స్ : ఏం తెలివితేటలు రా అయ్యా!
బంగారం, విలువైన వజ్రాలను అక్రమంగా రవాణా చేసేందుకు కేటుగాళ్లు అనుసరిస్తున్న పద్దతులు అధికారులను సైతం విస్మయపరుస్తున్నాయి. కానీ చివరకుఅధికారుల తనిఖీల్లో అడ్డంగా దొరికి పోతున్నారు. తాజాగా ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ డిపార్ట్మెంట్ కోట్లరూపాయల విలువైన వజ్రాలను, బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. ముఖ్యంగా నూడుల్స్ ప్యాకెట్లలో డైమండ్స్ దాచిన తీరు హాట్ టాపిక్‌గా నిలిచింది. ముంబైనుంచి బ్యాంకాక్‌కు వెళ్తున్న భారతీయుడు ట్రాలీ బ్యాగ్‌లో నూడుల్స్ ప్యాకెట్లో డైమండ్లను తరలిస్తూ గుట్టుగా అధికారుల కన్నుగప్పాలని చేశాడు. కానీ తనిఖీల్లో అడ్డంగా బుక్కయ్యాడు. రూ.2.02 కోట్ల విలువైన 254.71 క్యారెట్ల నేచురల్ లూజ్ డైమండ్, 977.98 క్యారెట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్ లభ్యమయ్యాయి. మరో ఘటనలో కొలంబో నుండి ముంబైకి ప్రయాణిస్తున్న ఒక విదేశీ మహిళను తనిఖీ చేయగా ఆమె లోదుస్తుల లోపల దాచిన 24 క్యారెట్ల గోల్డ్ బిస్కట్లు కనుగొన్నారు. వీటి మొత్తం బరువు 321గ్రాములు. మరో వైపు ఫేస్ మాస్క్‌లోనూ డైమండ్స్ తరలిస్తున్నట్లు గుర్తించారు. దుబాయ్ నుంచి ఇద్దరు, అబుదాబి ఇద్దరు, బహ్రెయిన్ ఇద్దరు, దోహానుఎంచి ఇద్దరు రియాద్ ఇద్దరు మస్కట్ బ్యాంకాక్ ,సింగపూర్ నుంచి ఒక్కొక్కరు చొప్పున 10 మంది అనుమానితులను తనిఖీ చేయగా, రెక్టమ్, ఇతర శరీర భాగాల్లో దాచిన రూ.4.04 కోట్ల విలువైన 6.199 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మొత్తం గా 13 వేర్వేరు కేసుల్లో రూ.6.46 కోట్ల విలువైన అక్రమ రవాణా బంగారం, డైమండ్స్,తదితరాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేశారు. During 19-21 April, 2024, Airport Commissionerate, Mumbai Customs Zone-III seized over 6.815 Kg Gold valued at Rs. 4.44 Cr & Diamonds valued at Rs. 2.02 Cr total amounting to Rs. 6.46 Cr across 13 cases. Diamonds were found concealed in noodle packets. Four pax were arrested. pic.twitter.com/j5wAPV5jAk — Mumbai Customs-III (@mumbaicus3) April 22, 2024 #WATCH | Maharashtra: During 19-21 April, 2024, Mumbai Customs seized over 6.815 Kg of gold valued at Rs 4.44 crores and diamonds valued at Rs 2.02 crores, total amounting to Rs 6.46 crores across 13 cases. Diamonds were found concealed in noodle packets. Four Passengers were… pic.twitter.com/02LzDS1aDZ — ANI (@ANI) April 22, 2024 -
యూఎస్‌లో బర్డ్ ఫ్లూ కలకలం.. గుడ్లు, పాలు తీసుకోవచ్చా..!
ఆవు పాలల్లో బర్డ్ ఫ్లూ (H5N1) వైరస్ అధిక సాంద్రతలో గుర్తించడం తీవ్ర ఆందోళన రేపింది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా స్పందించింది. అమెరికాలోని ఆవు పాలలో హెచ్5ఎన్1 వైరస్ అధిక సాంద్రతల్లో ఉండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. అయితే పచ్చి పాలలో మాత్రమే ఈ వైరస్ ఉందనీ, పాలను వేడి చేసినప్పుడు ఈ వైరస్ నాశనమవుతోందని నిపుణులు అంటున్నారు. అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఇటీవల ఈ నెల ప్రారంభంలోనే అమెరికాలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం ఆరు రాష్ట్రాల్లో కనీసం 13 మందలను ప్రభావితం చేసింది. ఈ నేపథ్యంలో పచ్చి పాలు, గుడ్లు, చికెన్ తినడం ఎంతవరకు సురిక్షతం అని ప్రజల్లో తీవ్ర ఆందోళనలు రేకెత్తుతున్నాయి. ఇంతకీ తినొచ్చా? తినకూడదా? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు అంటే..! ఈ బర్డ్ ఫ్లూ వైరస్‌ని ఏవియన్ఇన్ఫ్లెఎంజా అని కూడా పిలుస్తారు. ఇది ఒకరకమైన జూనోటిక్ ఇన్ఫ్లు ఎంజా. అడవి పఓలు, పౌల్ట్రీ, ఇతర జంతువులను ప్రభావితం చేస్తుంది. ఇది వైరస్ ఉక రకాల ఏ(హెచ్5ఎన్1), ఏ(హెచ్9ఎన్2) వల్ల వస్తుంది. ఈ హెచ్5ఎన్1 వైరస్ సోకిన ప్రతి వందమంది రోగులలో దాదాపు 52 మంది మరణించారని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఇలా బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందుతున్నప్పుడూ.. పాలు తాగడం, గుడ్లు, మాసం తినడం ఎంతవరకు సురక్షితం అని ప్రజల్లో తీవ్ర ఆందోళనలు పెరుగుతున్నాయి.అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం..బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందుతున్నప్పుడు ఆయా ఆహార పదార్థాలను మంచి ఉడకించి తింటే ఎలాంటి ప్రమాదం ఉండదని పేర్కొంది. గుడ్లు.. గుడ్లు మంచిగా ఉడికించి తిన్నంత వరకు ఎలాంటి ప్రమాదం ఉండదని చెబుతోంది. గుడ్డులోపలి పచ్చసొన, తెలుపు రెండు గట్టిగా ఉండే వరకు పూర్తిగా ఉడికించి తినమని చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రత వద్ద ఆ బ్యాక్టీరియా చనిపోతుంది. ఇలా చేస్తే వైరస్ వ్యాప్తి ప్రమాదాన్ని నివారించొచ్చు. అలాగే గుడ్లను మంచి విశ్వనీయమైన చోటే కొనుగోలు చేస్తున్నారా లేదా అని నిర్థారించుకోవడం కూడా ముఖ్యమే అని చెబుతున్నారు నిపుణులు. పాలు.. ఇక పాల వద్దకు వస్తే పాశ్చరైజ్డ్ మిల్క్ తాగడం క్షేమమని నిపుణులు అంటున్నారు. పాశ్చరైజేషన్ ప్రక్రియలో, పాలు చాలా అధిక ఉష్ణోగ్రతకు వేడి చేయడం జరుగుతుంది. ఈ ఉష్ణోగ్రత వ్యాధికారక క్రిములను చంపడానికి సరిపోతుంది. బర్డ్ ఫ్లూ వంటి వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా, వైరస్‌లను నిర్మూలించడంలో ఈ ప్రక్రియ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. చికెన్ ఈ వైరస్ కోళ్లతో సహా పక్షులను ప్రభావితం చేస్తుంది. అందువల్ల చికెన్‌ను సరిగా వండుకుని తినడం అనేది అత్యంత ముఖ్యం. పౌల్ట్రీని 165°F (74°C) ఉష్ణోగ్రత వద్ద ఉడికించడం వల్ల బర్డ్ ఫ్లూ వైరస్‌తో సహా ఇతర వైరస్లు నశించడం జరుగుతుంది. అలా చికెన్ కొనుగోలు చేసే చోటు పరిశుభ్రత ఉందా లేదా అన్నది కూడా ముఖ్యమే చివరిగా బర్డ్ ఫ్లూ సోకినట్లయితే ఈ కింది లక్షణాల ద్వారా గుర్తించి వెంటనే అప్రమత్తమవ్వండి. ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే.. జ్వరం: అధిక ఉష్ణోగ్రత తరచుగా మొదటి సంకేతం, సాధారణంగా 38°C (100.4°F) కంటే ఎక్కువగా ఉంటుంది. దగ్గు: ప్రారంభంలో, పొడి దగ్గు కాలక్రమేణా మరింత తీవ్రమవుతుంది. గొంతు నొప్పి: గొంతు ప్రాంతంలో అసౌకర్యం లేదా నొప్పి, మింగడం కష్టతరం చేస్తుంది. కండరాల నొప్పులు: శరీర నొప్పులు తలనొప్పి: ఇది తేలికపాటి నుండి తీవ్రమైన వరకు ఉంటుంది. శ్వాసకోశ లక్షణాలు: ప్రారంభ దశల్లో తేలికపాటి శ్వాసకోశ సమస్యలు ఉండవచ్చు, ఇవి వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఈ వ్యాధి తీవ్రమైతే కనిపించే లక్షణాలు.. న్యుమోనియా: ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వేగవంతమైన శ్వాస లేదా శ్వాసలోపం ద్వారా సూచించబడుతుంది. అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ARDS): శ్వాసకోశ వైఫల్యం అతిసారం: సాధారణ ఇన్ఫ్లుఎంజాలా కాకుండా, H5N1 జీర్ణశయాంతర లక్షణాలను కలిగిస్తుంది. వాంతులు: ఇది ఇతర జీర్ణశయాంతర లక్షణాలతో కలిపి సంభవించవచ్చు. ముక్కు,చిగుళ్ళ నుంచి రక్తస్రావం: ఇది సాధారణంగా తీవ్రమైన సందర్భాల్లో జరుగుతుంది. నాడీ సంబంధిత మార్పులు: అరుదుగా, ఎన్సెఫాలిటిస్ (మెదడు వాపు) సంభవించవచ్చు. ఒక్కోసారిమూర్ఛలు లేదా మానసిక స్థితిlr ప్రభావితం చెయ్యొచ్చు. (చదవండి: మానసిక ఆరోగ్యంపై అలియా ఆసక్తికర వ్యాఖ్యలు! అందుకే థెరపీ..!) -
సరికొత్త వంటకాలను కోరుకుంటున్నారా? వీటిని ట్రై చేయండి!
ప్రతీరోజూ తిన్న వంటకాలని మళ్లీ మళ్లీ తినాలంటే.. చాలా మంది ముఖం తిప్పేసుకుంటారు. కొంచెం కారంగానో, తీయగానో కావాలని కోరుకుంటారు. విశ్రాంతి సమయంలో ఏదో ఒకటి నమిలేవరకూ వారికి పొద్దేపోదు. మరి అలాంటి వారి కోసం ఈ వెరైటీ వంటలు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో చూద్దాం. పుట్టగొడుగు లాలీపాప్స్.. కావలసినవి: పుట్టగొడుగులు – 15 లేదా 20 (వేడి నీళ్లతో శుభ్రం చేసుకుని పక్కనపెట్టుకోవాలి), మైదాపిండి – 1 కప్పు, ధనియాల పొడి, పసుపు – పావు టేబుల్ స్పూన్, కారం, చాట్ మసాలా, మిరియాల పొడి – అర టేబుల్ స్పూన్ చొప్పున, కార్న్‌ఫ్లేక్ మిక్సర్ – 1 కప్పు (కవర్లో వేసి.. చపాతీ కర్రతో అటు ఇటు నొక్కి పొడిపొడిగా చేసుకోవాలి), బ్రెడ్ పౌడర్, ఓట్స్ పౌడర్ – అర కప్పు చొప్పున, అల్లం పేస్ట్ – 1 టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – సరిపడా, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ.. ముందుగా పెద్ద బౌల్ తీసుకుని అందులో మైదాపిండి, ధనియాల పొడి, పసుపు, కారం, చాట్ మసాలా, మిరియాల పొడి, అల్లం పేస్ట్, తగినంత ఉప్పు వేసుకుని.. కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పేస్ట్‌లా చేసుకోవాలి. అనంతరం మరో బౌల్ తీసుకుని కార్న్‌ఫ్లేక్ మిక్సర్, బ్రెడ్ పౌడర్, ఓట్స్ పౌడర్ ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. అనంతరం ప్రతి పుట్టగొడుగుకు పుల్ల గుచ్చి.. ఒక్కోదాన్ని మొదట మైదా మిశ్రమంలో తర్వాత బ్రెడ్ పౌడర్ మిశ్రమంలో ముంచి.. మిశ్రమాన్ని బాగా పట్టించి.. నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీల్మేకర్ – టొమాటో గారెలు.. కావలసినవి: మీల్మేకర్ – 1 కప్పు (పదిహేను నిమిషాల పాటు వేడి నీళ్లలో నానబెట్టి, తురుముకోవాలి), టొమాటో – 3 (మెత్తగా మిక్సీ పట్టుకుని.. జ్యూస్‌లా చేసుకోవాలి), ఉల్లిపాయ తరుగు – పావు కప్పు పచ్చిమిర్చి ముక్కలు – 2 టీ స్పూన్లు, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, ఓట్స్ పౌడర్ – 1 కప్పు చొప్పున, మినుముల పిండి – 2 కప్పులు (మినుములు నానబెట్టి గ్రైండ్ చేసుకోవాలి), జీలకర్ర – 1 టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు – తగినంత, నీళ్లు – సరిపడా తయారీ.. ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో మినుముల పిండి, మీల్ మేకర్ తురుము, మొక్కజొన్న పిండి, బియ్యప్పిండి, జీలకర్ర, ఉప్పు, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి ముక్కలు అన్ని వేసుకుని టొమాటో జ్యూస్ కొద్దికొద్దిగా వేసుకుంటూ గారెల పిండిలా చేసుకోవాలి. అనంతరం కొద్దికొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకుని.. గారెల్లా ఒత్తుకుని, కాగుతున్న నూనెలో దోరగా వేయించుకోవాలి. వాటిపై మజ్జిగ ఆవడ వేసుకుని, నానబెట్టి తింటే భలే బాగుంటాయి. మీల్మేకర్ – టొమాటో, గారెలు చెర్రీ హల్వా.. చెర్రీ హల్వా.. కావలసినవి: చెర్రీస్ – రెండున్నర కప్పులు (గింజలు తీసి శుభ్రం చేసుకోవాలి) యాలకుల పొడి – పావు టీ స్పూన్ మొక్కజొన్న పిండి – రెండుంపావు కప్పులు పంచదార – 1 కప్పు, నట్స్ – కావాల్సినన్ని నెయ్యి – అర కప్పు, నీళ్లు – 3 టేబుల్ స్పూన్లు డ్రైఫ్రూట్స్ – అభిరుచిని బట్టి తయారీ.. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, కళాయిలో కొద్దిగా నెయ్యి వేడి చేసి.. అందులో జీడిపప్పు దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అనంతరం చెర్రీస్ వేసుకుని గరిటెతో తిప్పుతూ మగ్గేవరకు చిన్న మంట మీద ఉడికించాలి. అనంతరం 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, పంచదార వేసుకుని తిప్పుతూ ఉండాలి. పంచదార కరిగిన తర్వాత.. మొక్కజొన్న పిండిలో నీళ్లు పోసుకుని బాగా కలిపి.. ఆ మిశ్రమాన్ని చెర్రీస్ మిశ్రమంలో వేసుకోవాలి. కాసేపటికి మరోసారి కొద్దిగా నెయ్యి వేసుకుని తిప్పాలి. దగ్గరపడుతున్న సమయంలో జీడిపప్పు, మిగిలిన నెయ్యి వేసుకుని బాగా కలిపి చల్లారాక.. మరిన్ని డ్రైఫ్రూట్స్ తురుముతో సర్వ్ చేసుకోవాలి. ఇవి చదవండి: సమ్మర్లో పిల్లలకు ఇలా చేసి పెడితే, ఇష్టంగా తింటారు, బలం కూడా!
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Chekc 1234 off the field
Test article qid_23456x4
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 17 ఏళ్ల కెరీర్‌కు గుడ్ బై
ఎవరేశారో తెలుసుకోకుండా దోశలు తినేయడమేనా!!
స్టోయినిష్ అరుదైన రికార్డు.. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
విశ్వసనీయత లేని ప్రతిపక్షాన్ని తిరస్కరించాలి!
అభివృద్ధి బటన్ నొక్కిన సీఎం జగన్
దిక్కుతోచని కుటుంబం దిశ మారింది..!
సారా.. నారా అండతో దోపిడీకి C/O సీఎం రమేష్
ఛాంపియన్ దేశం
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019