Just In
Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1
Ad - Sakshi_Home_Sticky
-
జొకోవిచ్‌కు లారియస్ అవార్డు
పురుషుల టెన్నిస్ ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ ప్రతిష్టాత్మక లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ వార్షిక అవార్డుల్లో మెరిశాడు. 2023 సంవత్సరానికిగాను పురుషుల విభాగంలో ఈ సెర్బియా దిగ్గజం ‘ఉత్తమ క్రీడాకారుడు’ పురస్కారం గెల్చుకున్నాడు. జొకోవిచ్‌కు ఈ అవార్డు లభించడం ఇది ఐదోసారి. 2023లో జొకోవిచ్ ఆ్రస్టేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించడంతోపాటు వింబుల్డన్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. సీజన్‌ను టాప్ ర్యాంక్‌తో ముగించాడు. మహిళల విభాగంలో స్పెయిన్ ఫుట్‌బాల్ ప్లేయర్ బొన్మాటి ‘ఉత్తమ క్రీడాకారిణి’ అవార్డు అందుకుంది. -
తొలి రౌండ్లోనే రష్మిక పరాజయం
షార్లోట్స్విల్ డబ్ల్యూ–75 మహిళల టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో జరుగుతున్న ఈ టోర్నీలో సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో రష్మిక 2–6, 2–6తో గాబ్రియేలా ప్రైస్ (అమెరికా) చేతిలో ఓడిపోయింది. 84 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక తన సర్విస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. -
గుకేశ్ ‘భూకంపం’ తెచ్చాడు!
గ్యారీ కాస్పరోవ్ ప్రశంస టొరంటో: క్యాండిడేట్స్ టోర్నీలో విజేతగా నిలిచి వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ పోరుకు అర్హత సాధించిన భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్‌పై ‘ఆల్‌టైమ్ గ్రేట్’ గ్యారీ కాస్పరోవ్ ప్రశంసలు కురిపించాడు. ప్రపంచ చెస్‌లో కొత్త మార్పునకు ఇది సూచన అని ఈ మాజీ వరల్డ్ చాంపియన్ అభిప్రాయపడ్డాడు. ‘గుకేశ్‌కు అభినందనలు. టొరంటోలో ఒక భారతీయుడు భూకంపం సృష్టించాడు. 17 ఏళ్ల కుర్రాడు చైనా చాంపియన్ డింగ్ లిరెన్‌ను ఢీకొనబోతుండటం ప్రపంచ చెస్‌లో ఆధిక్యం ఒక దిక్కు నుంచి మరో దిక్కుకు మారిందనేదానికి సరైన సూచిక. విశ్వనాథన్ ఆనంద్ ‘పిల్లలు’ అన్ని చోట్లా దూకుడు ప్రదర్శిస్తున్నారు. గుకేశ్ మరింత పైకి ఎదుగుతాడు. చైనా, భారత్‌కు చెందిన కుర్రాళ్లు చెస్‌లో ఏదైనా సాధించే సంకల్పంతో దూసుకుపోతుంటే ఇంగ్లండ్, అమెరికా జూనియర్ ఆటగాళ్లు మాత్రం చూస్తూనే ఉండిపోతున్నారు’ అని కాస్పరోవ్ వ్యాఖ్యానించాడు. ఆదివారం ముగిసిన క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో ఓపెన్ విభాగంలో భారత్ నుంచి గుకేశ్, ప్రజ్ఞానంద, విదిత్ సంతోష్ గుజరాతి పోటీపడ్డారు. గుకేశ్ విజేతగా అవతరించగా... ప్రజ్ఞానంద ఐదో స్థానంలో, విదిత్ ఆరో ర్యాంక్‌లో నిలిచారు. ఇదే టోర్నీ మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి రన్నరప్‌గా నిలువగా, వైశాలికి నాలుగో స్థానం లభించింది. -
భారత నంబర్‌వన్‌గా శ్రీజ
న్యూఢిల్లీ: రెండుసార్లు జాతీయ చాంపియన్, తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) మహిళల సింగిల్స్ నంబర్‌వన్ ర్యాంకర్‌గా అవతరించింది. మంగళవారం విడుదల చేసిన అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) తాజా ర్యాంకింగ్స్‌లో శ్రీజ ఒక స్థానం మెరుగుపర్చుకొని 38వ ర్యాంక్‌లో నిలిచింది. ఇప్పటి వరకు భారత నంబర్‌వన్‌గా ఉన్న మనిక బత్రా రెండు స్థానాలు పడిపోయి 39వ ర్యాంక్‌కు చేరుకుంది. భారత్ నుంచి యశస్విని 99వ ర్యాంక్‌లో, అర్చన కామత్ 100వ ర్యాంక్‌లో ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఇండియా (ఆర్బీఐ)లో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న 25 ఏళ్ల శ్రీజ ఈ ఏడాది నిలకడగా రాణిస్తూ ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) సర్క్యూట్లో రెండు టైటిల్స్ సాధించింది. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో ఆచంట శరత్ కమల్‌తో కలిసి శ్రీజ మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో శరత్ కమల్ 37వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. సత్యన్ జ్ఞానశేఖరన్ 60వ స్థానంలో, మానవ్ ఠక్కర్ 61వ స్థానంలో, హర్మీత్ దేశాయ్ 64వ ర్యాంక్‌లో ఉన్నారు. హైదరాబాద్ ప్లేయర్ సూరావజ్జుల స్నేహిత్ 147వ ర్యాంక్‌లో నిలిచాడు. -
జ్యోతి సురేఖకు రెండో స్థానం
షాంఘై (చైనా): ప్రపంచ ఆర్చరీ కొత్త సీజన్లో భాగంగా ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీ క్వాలిఫయింగ్ రౌండ్లో భారత క్రీడాకారిణులు రాణించారు. మహిళల కాంపౌండ్ విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ 711 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. భారత్‌కే చెందిన అదితి 704 పాయింట్లతో 8వ స్థానంలో, పర్ణీత్ కౌర్ 703 పాయింట్లతో 14వ స్థానంలో నిలిచారు. జ్యోతి సురేఖ, అదితి, పర్ణీత్ స్కోర్లతో కలిపి భారత బృందం 2118 పాయింట్లతో టీమ్ విభాగంలో టాప్ ర్యాంక్‌ను పొంది నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు చేరింది.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Chekc 1234 off the field
Test article qid_23456x4
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 17 ఏళ్ల కెరీర్‌కు గుడ్ బై
ఎవరేశారో తెలుసుకోకుండా దోశలు తినేయడమేనా!!
స్టోయినిష్ అరుదైన రికార్డు.. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
విశ్వసనీయత లేని ప్రతిపక్షాన్ని తిరస్కరించాలి!
అభివృద్ధి బటన్ నొక్కిన సీఎం జగన్
దిక్కుతోచని కుటుంబం దిశ మారింది..!
సారా.. నారా అండతో దోపిడీకి C/O సీఎం రమేష్
ఛాంపియన్ దేశం
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019