Just In
Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1
Ad - Sakshi_Home_Sticky
-
UPSC Results 2024: టాపర్స్
ఆకాశంలో సగం అని చాటడం వేరు.. నిరూపించడం వేరు. నేటి అమ్మాయిలు చదువులో, మేధలో, సమర్థమైన అవకాశాలు అందుకోవడంలో తమ ఆకాశం సగం అని నిరూపిస్తున్నారు. యు.పి.ఎస్.సి. 2023 టాప్ 25 ర్యాంకుల్లో 10 మంది అమ్మాయిలు ఉన్నారు. మన తెలుగు అమ్మాయి అనన్య (3), రుహానీ (5), సృష్టి (6), అన్ మోల్ రాథోడ్ (7), నౌషీన్ (9), ఐశ్వర్యం ప్రజాపతి (10), మేధా ఆనంద్ (13), స్వాతి శర్మ (17), వార్దా ఖాన్ (18), రితికా వర్మ (25). వీరిలో అనన్య, సృష్టి, వార్దా ఖాన్ల కథనాలు ఇప్పటికే అందించాం. మిగిలిన ఏడుగురు ప్రతిభా పరిచయాల గురించిన ఈ కథనం. ‘స్వయం సమృద్ధి, ‘ఆర్థిక స్వాతంత్య్రం’, ‘నిర్ణయాత్మక అధికారిక పాత్ర’, ‘పరిపాలనా రంగాల ద్వారా జనావళికి సేవ’, ‘సామర్థ్యాలకు తగిన స్థానం’, ‘లక్ష్యాలకు తగిన సామర్థ్యం’... ఇవీ నేటి యువతుల విశిష్ట ఆకాంక్షలు, అభిలాషలు, లక్ష్యాలు. అందుకే దేశంలో అత్యంత క్లిష్టతరమైన సివిల్స్ ప్రవేశ పరీక్షల్లో వీరు తలపడుతున్నారు. గెలుస్తున్నారు. నిలుస్తున్నారు. యు.పి.ఎస్.సి. 2023 ఫలితాల్లో టాప్ 25లో పది ర్యాంకులు అమ్మాయిలు సాధించడం గర్వపడాల్సిన విషయం. మొత్తం 1016 మంది అభ్యర్థులు ఎంపిక కాగా వీరిలో అమ్మాయిలు 352 మంది ఉండటం ముందంజను సూచిస్తోంది. తల్లిదండ్రులకు భారం కాకుండా ఒకవైపు ఉద్యోగాలు చేస్తూ లేదా ఇంటి దగ్గర చదువుకుంటూ వీరిలో చాలామంది ర్యాంకులు సాధించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన అనన్య రెడ్డి టాప్ 3 ర్యాంక్ సాధించి తెలుగు కీర్తి రెపరెపలాడించింది. కోచింగ్ సెంటర్ల మీద ఆధారపడకుండా సొంతగా చదువుకోవడం ఒక విశేషమైతే, మొదటి అటెంప్ట్‌లోనే ఆమె భారీ ర్యాంక్ సాధించడం మరో విశేషం. అలాగే ఢిల్లీకి చెందిన సృష్టి దమాస్ 6వ ర్యాంక్, వార్దా ఖాన్ 18వ ర్యాంక్ సాధించి స్ఫూర్తిగా నిలిచారు. మిగిలిన ఏడుగురు విజేతల వివరాలు. రుహానీ (5వ ర్యాంకు) హర్యానాకు చెందిన రుహానీ హర్యానాలోని గుర్గావ్లోనూ ఢిల్లీలోనూ చదువుకుంది. తల్లిదండ్రులు ఇద్దరూ లెక్చరర్లు. ఎకనమిక్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన రుహానీ ‘ఇగ్నో’ నుంచి ΄ోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. 2020లో ఇండియన్ ఎకనామిక్ సర్వీస్‌కు ఎంపికయ్యి నీతి ఆయోగ్‌లో మూడేళ్లు పని చేసింది. కాని ఐ.ఏ.ఎస్ కావడం ఆమె లక్ష్యం. మరో అటెంప్ట్‌లో ఆమె ఐ.పి.ఎస్.కు ఎంపికయ్యింది. హైదరాబాద్‌లో శిక్షణ ΄÷ందుతూ ఆఖరుసారిగా 6వ అటెంప్ట్‌లో టాప్ ర్యాంక్ సాధించింది. పేద వర్గాల ఆర్థిక స్థితిని మెరుగు పర్చడం తన లక్ష్యం అంటోంది రుహానీ. అన్మోల్ రాథోడ్ (7వ ర్యాంకు) జమ్ము నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉండే ఉద్రానా అనే మారుమూల పల్లె అన్మోల్ది. తండ్రి బ్యాంక్ మేనేజర్, తల్లి ప్రిన్సిపాల్. ఇంటర్ వరకూ జమ్ములో చదువుకున్నా గాంధీనగర్‌లో బి.ఏ.ఎల్.ఎల్.బి. చేసింది. 2021లో చదువు పూర్తయితే అదే సంవత్సరం సివిల్స్ రాసింది. కాని ప్రిలిమ్స్ దాటలేక΄ోయింది. 2022లో మళ్లీ ప్రయత్నిస్తే 2 మార్కుల్లో ఇంటర్వ్యూ వరకూ వెళ్లే అవకాశం ΄ోయింది. 2023లో మూడవసారి రాసి 7వ ర్యాంక్ ΄÷ందింది. అయితే ఈలోపు ఆమె ‘జమ్ము కశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్’ ΄ోటీ పరీక్ష రాసి ఉద్యోగానికి ఎంపికైంది. ఆ ఉద్యోగ శిక్షణ తీసుకుంటూనే సివిల్స్ సాధించింది.‘రోజుకు ఎనిమిది గంటలు చదివాను. చిన్నప్పటి నుంచి నాకు తగాదాలు తీర్చడం అలవాటు. రేపు కలెక్టర్‌ను అయ్యాక ప్రజల సమస్యలను తీరుస్తాను’ అంటోందామె. నౌషీన్ (9వ ర్యాంకు) ‘మాది ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్. కాని ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకోవడం వల్ల అక్కడి విద్యార్థుల రాజకీయ, సామాజిక అవగాహన స్థాయి నన్ను ఆశ్చర్యపరిచి సివిల్స్ రాసేలా పురిగొల్పింది. 2020 నుంచి ప్రయత్నించి నాలుగో అటెంప్ట్‌లో 9వ ర్యాంక్ సాధించాను. చరిత్రలో ఈ రెండు ఘటనలు జరగక΄ోయి ఉంటే బాగుండేదని వేటి గురించి అనుకుంటావ్ అంటూ నన్ను ఇంటర్వ్యూలో అడిగారు– రెండు ప్రపంచ యుద్ధాలు జరక్క΄ోయి ఉంటే బాగుండేదని, ఆసియా–ఆఫ్రికా దేశాలు వలసవాద పాలన కిందకు రాకుండా ఉంటే బాగుండేదని చె΄్పాను. నా జవాబులు బోర్డ్‌కు నచ్చాయి’ అని తెలిపింది నౌషీన్. ‘ఐ.ఏ.ఎస్. ఆఫీసర్‌గా పని చేయడం గొప్ప బాధ్యత. చాలా మంది జీవితాల్లో మార్పు తేవచ్చు’ అందామె. ఐశ్వర్యం ప్రజాపతి (10వ ర్యాంకు) లక్నోకు చెందిన ఐశ్వర్యం ప్రజాపతి రెండో అటెంప్ట్‌లో 10వ ర్యాంక్ సాధించింది. ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఉత్తరాఖండ్’లో చదువుకున్న ఐశ్వర్యం ఒక సంవత్సరం పాటు విశాఖపట్నం ఎల్ అండ్ టిలో ట్రయినీగా పని చేసింది. ‘నేను ఇన్ని గంటలు చదవాలి అని లెక్కపెట్టుకోని చదవలేదు. చదివినంత సేపు నాణ్యంగా చదవాలి అనుకున్నాను. నన్ను కలెక్టర్‌గా చూడాలన్నది మా అమ్మానాన్నల కల. సాధిస్తానని తెలుసుకాని ఇంత మంచి ర్యాంక్ వస్తుందనుకోలేదు. ఎవరైనా సరే తమకు ఏది నచ్చుతుందో ఆ దారిలో వెళ్లినప్పుడే సాధించాలన్న మోటివేషన్ వస్తుంది’ అని తెలిపిందామె. మేధా ఆనంద్ (13వ ర్యాంకు) ‘మా అమ్మ ఆగ్రాలో బ్యాంక్ ఉద్యోగం చేస్తుంది. కలెక్టర్ ఆఫీసు మీదుగా వెళ్లినప్పుడల్లా నా కూతురు కూడా ఒకరోజు కలెక్టర్ అవుతుంది అనుకునేది. నాతో అనేది. నా లక్ష్యం కూడా అదే. కాలేజీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పటి నుంచి సివిల్స్ రాయాలని తర్ఫీదు అయ్యాను. సెకండ్ అటెంప్ట్‌లో 311వ ర్యాంక్ వచ్చింది. కాని నేను సంతృప్తి చెందలేదు. ప్రస్తుతం నేను నార్త్ రైల్వేస్‌లో పని చేస్తున్నాను. పని చేస్తూనే 50 లోపు ర్యాంక్ కోసం కష్టపడ్డాను. కాని 13వ ర్యాంక్ వచ్చింది. నేటి మహిళల్లోని సామర్థ్యాలు పూర్తిగా సమాజానికి ఉపయోగపడటం లేదు. వారికి ఎన్నో అడ్డంకులున్నాయి. వాటిని దాటి వారు ముందుకు రావాలి. కలెక్టర్ అయ్యాక నేను స్త్రీలు ముఖ్యభూమికగా ఆర్థిక వికాసం కోసం కృషి చేస్తాను’ అని తెలిపింది మీరట్‌కు చెందిన మేధా ఆనంద్. స్వాతి శర్మ (17వ ర్యాంకు) జెంషడ్‌పూర్‌కు చెందిన స్వాతి శర్మ తను సాధించిన 17 ర్యాంక్‌తో జార్ఖండ్‌లో చాలామంది ఆడపిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తానని భావిస్తోంది. ‘మా రాష్ట్రంలో అమ్మాయిలకు ఇంకా అవకాశాలు దొరకాల్సి ఉంది’ అంటుందామె. అంతేకాదు కలెక్టరయ్యి దిగువ, గిరిజన వర్గాల మహిళల అభ్యున్నతికి పని చేయాలనుకుంటోంది. ‘ఎం.ఏ. ΄÷లిటికల్ సైన్స్ చదివాను. ఆ చదువే ఐ.ఏ.ఎస్. చదవమని ఉత్సాహపరిచింది. ఢిల్లీలో సంవత్సరం ఆరు నెలలు కోచింగ్ తీసుకున్నాను. రెండు మూడుసార్లు విఫలమయ్యి నాకు నేనే తర్ఫీదు అయ్యి ఇప్పుడు 17వ ర్యాంక్ సాధించాను. మా నాన్న రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, అమ్మ గృహిణి. బాగా చదువుకుని అనుకున్న లక్ష్యాన్ని సాధించడమే పిల్లలు తల్లిదండ్రులకిచ్చే కానుక’ అంది స్వాతి శర్మ. రితికా వర్మ (25వ ర్యాంకు) ‘ఎన్నో సమస్యలున్న బిహార్ రాష్ట్రం కోసం పని చేయాల్సింది చాలా ఉంది. మాది పాట్నా. మా నాన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో మేనేజర్. ప్రస్తుతం మేము గుంటూరులో ఉంటున్నాం. ఢిల్లీలో బిఎస్సీ మేథ్స్ చదివిన నేను సివిల్స్ ద్వారా పేదల కోసం పని చేయాలని నిశ్చయించుకున్నాను. నాకు సాహిత్యం అంటే ఆసక్తి ఉంది. బిహార్‌లో పేదలకు భూమి సమస్య, పని సమస్య ఉన్నాయి. తక్కువ వేతనాల వల్ల పల్లెల నుంచి నిరవధికంగా వలస సాగుతోంది. కలెక్టర్‌గా నేను వీరి కోసం పని చేయాలనుకుంటున్నాను’ అని తెలిపింది రితికా వర్మ. -
Wardah Khan: ఇంట్లో ప్రిపేరయ్యి విజేతల వీడియోలు చూసి
యు.పి.ఎస్.సి. 2023 ఫలితాల్లో టాప్ 25 ర్యాంకుల్లో 10 మంది మహిళా అభ్యర్థులున్నారు. భిన్న జీవనస్థాయుల నుంచి వీరంతా మొక్కవోని పట్టుదలతో పోరాడి ఇండియన్ సివిల్ సర్వీసుల్లో సేవలు అందించేందుకు ఎంపికయ్యారు. 18వ ర్యాంకు సాధించిన 23 ఏళ్ల వార్దా ఖాన్ సివిల్స్ కల కోసం కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి పెట్టింది. సొంతగా ఇంట్లో ప్రిపేర్ అవుతూ గతంలో ర్యాంక్ సాధించిన విజేతలతో స్ఫూర్తిపొందింది. నోయిడాలోని ఆమె ఇలాకా ఇప్పుడు సంతోషంతో మిఠాయిలు పంచుతోంది. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతుండగా వార్దా ఖాన్‌ను ‘మాక్ ఇంటర్వ్యూ’లో ఒక ప్రశ్న అడిగారు– ‘నువ్వు సోషియాలజీ చదివావు కదా. సమాజంలో మూడు మార్పులు తేవాలనుకుంటే ఏమేమి తెస్తావు’ అని. దానికి వార్దా ఖాన్ సమాధానం 1.స్త్రీల పట్ల సమాజానికి ఉన్న మూస అభి్రపాయం మారాలి. వారికి అన్ని విధాల ముందుకెళ్లడానికి సమానమైన అవకాశాలు కల్పించగల దృష్టి అలవడాలి. 2. దేశ అభివృద్ధిలో గిరిజనులకు అన్యాయం జరిగింది. వారి సంస్కృతిని గౌరవిస్తూనే వారిని అభివృద్ధిలోకి తీసుకురావాలి. 3. దేశానికి ప్రమాదకరంగా మారగల మత వైషమ్యాలను నివారించాలి. ‘నా మెయిన్ ఇంటర్వ్యూ కూడా ఇంతే ఆసక్తికరంగా సాగింది’ అంటుంది వార్దా. నోయిడాకు చెందిన వార్దా ఖాన్ రెండో అటెంప్ట్‌లోనే సివిల్స్‌ను సాధించింది. 18వ ర్యాంక్ సాధించి సగర్వంగా నిలుచుంది. ఇంటి నుంచి చదువుకుని వార్దాఖాన్ది నోయిడాలోని వివేక్ విహార్. తండ్రి తొమ్మిదేళ్ల క్రితం చనిపోయాడు. చిన్నప్పటి నుంచి చదువులో చాలా ప్రతిభ చూపిన వార్దా వక్తృత్వ పోటీల్లో మంచి ప్రతిభ చూపేది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది. ఆ వెంటనే కార్పొరేట్ సంస్థలో ఉద్యోగానికి చేరినా ఆమెకు అది సంతృప్తి ఇవ్వలేదు. ప్రజారంగంలో పని చేసి వారికి సేవలు అందించడంలో ఒక తృప్తి ఉంటుందని భావించి సివిల్స్‌కు ప్రిపేర్ అవసాగింది. అయితే అందుకు నేరుగా కోచింగ్ తీసుకోలేదు. కొన్ని ఆన్లైన్ క్లాసులు, ఆ తర్వాత సొంత తర్ఫీదు మీద ఆధారపడింది. అన్నింటికంటే ముఖ్యం గతంలో ర్యాంకులు సాధించిన విజేతల వీడియోలు, వారి సూచనలు వింటూ ప్రిపేర్ అయ్యింది. ‘సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆందోళన, అపనమ్మకం ఉంటాయి. విజేతల మాటలు వింటే వారిని కూడా అవి వేధించాయని, వారూ మనలాంటి వారేనని తెలుస్తుంది. కనుక ధైర్యం వస్తుంది’ అని తెలిపింది వార్దాఖాన్. ఏకాంతంలో ఉంటూ ‘సివిల్స్‌కి ప్రిపేర్ అవ్వాలంటే మనం లోకంతో మన సంబంధాలు కట్ చేసుకోవాలి. నాకు నలుగురితో కలవడం, మాట్లాడటం ఇష్టం. కాని దానివల్ల సమయం వృథా అవుతుంది. సివిల్స్‌కు ప్రిపేర్ అయినన్నాళ్లు ఇతరులతో కలవడం, సోషల్ మీడియాలో ఉండటం అన్నీ మానేశాను. అయితే మరీ బోర్ కొట్టినప్పుడు ఈ సిలబస్ ఇన్నిగంటల్లో పూర్తి చేయగలిగితే అరగంట సేపు ఎవరైనా ఫ్రెండ్‌ని కలవొచ్చు అని నాకు నేనే లంచం ఇచ్చుకునేదాన్ని. అలా చదివాను’ అని తెలిపిందామె. పది లక్షల మందిలో 2023 యు.పి.ఎస్.సి పరీక్షల కోసం 10,16,850 మంది అభ్యర్థులు అప్లై చేస్తే వారిలో 5,92,141 మంది ప్రిలిమ్స్ రాశారు. 14,624 మంది మెయిన్స్‌లో క్వాలిఫై అయ్యారు. 2,855 మంది ఇంటర్వ్యూ వరకూ వచ్చారు. 1,016 మంది ఎంపికయ్యారు. వీరిలో 664 మంది పురుషులు 352 మంది స్త్రీలు. ఇంత పోటీని దాటుకుని వార్దా ఖాన్ 18 వ ర్యాంకును సాధించిందంటే ఆమె మీద ఆమెకున్న ఆత్మవిశ్వాసమే కారణం. ‘మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా కష్టపడితే కచ్చితంగా సివిల్స్ సాధించవచ్చు’ అని తెలుపుతోందామె. ఆమె ఐ.ఎఫ్.ఎస్ (ఇండియన్ ఫారిన్ సర్వీసెస్)ను తన మొదటి ్రపాధాన్యంగా ఎంపిక చేసుకుంది. ‘గ్లోబల్ వేదిక మీద భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తెలియచేసి దౌత్య సంబంధాల మెరుగులో కీలక పాత్ర పోషించడమే నా లక్ష్యం’ అంటోంది వార్దా. -
‘ఐఎస్బీ’లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే
రాయదుర్గం: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ)లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ (పీజీపీ) క్లాస్–2024, డాక్టోరల్ ప్రోగ్రామ్ ఫెల్లో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ (ఎఫ్‌పీఎం), ఎగ్జిక్యూటివ్ ఫెల్లో ప్రొగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్(ఈఎఫ్‌పీఎం) కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా 617 మంది విద్యార్థులు, వారిలో 593 మంది పీజీపీ క్లాస్–2024, 19 మంది ఈఎఫ్‌పీఎం విద్యార్థులకు, ఐదుగురు ఎఫ్‌పీఎం విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెడల్స్‌ను ప్రదానం చేశారు. ఐఎస్బీ డీన్ ప్రొఫెసర్ మదన్ పిల్లుట్ల అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సెబీ చైర్మన్ మధబి పూరి బుచ్ హాజరయ్యారు. ఐఎస్బీ చైర్మన్ హరీష్ మన్వాని, పలువురు ప్రొఫెసర్లు, అధికారులు, పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి, డీన్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు, మెడల్స్‌ను ప్రదానం చేశారు. అంకితభావం, నిబద్దత ప్రశంసనీయం : సెబీ చైర్మన్ మధబిపూరిబుచ్ నేటి తరం విద్యార్థుల అంకిత భావం, నిబద్దత ప్రశంసనీయమని సెబి చైర్మన్ మధబిపూరిబుచ్ అన్నారు. నేటి డిజిటల్ యుగంలో ప్రపంచ చిన్నదిగా భావించినప్పుడు సమృద్ధిగా అవకాశాలను అందిస్తూ కాలం వేగంగా కదులుతున్నట్లు కనిపిస్తుందన్నారు. పని–జీవితం, కుటుంబం మధ్య సమతుల్యతను కొనసాగిస్తూ, కార్పొరేట్, ప్రభుత్వ పాత్రలను అన్వేషించడానికి, బ్యాలెన్స్ చేయడానికి అనేక రకాల కెరీర్ ఎంపికలు ఉన్నాయన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం సమయాన్ని వెచ్చించాలని సూచించారు. ఇటీవలే యువతిని కలిశానని ఆమె పలు దేశాల్లో 32 స్టార్టప్‌లను నిర్వహిస్తున్నట్లు తెలుసుకుని ఆశ్చర్య పోయానన్నారు. ఐఎస్బీ చైర్మన్ హరీష్ మన్వాని మాట్లాడుతూ ఐఎస్బీలో చదివినవారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయన్నారు. ఐఎస్బీ డీన్ ప్రొఫెసర్ మదన్ పిల్లుట్ల మాట్లాడుతూ ప్రతి విద్యార్థి జీవితంలో గ్రాడ్యుయేషన్ డే ఎంతో విలువైనదని, భవిష్యత్తు ఎంతో చక్కగా ఉంటుందని భావిస్తూ ముందుకు సాగే రోజు వచ్చిందన్నారు. కార్యక్రమంలో పలువురు ఐఎస్బీ ప్రొఫెసర్లు, ఫ్యాకల్టీ, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, కుటుంబసభ్యులు, అధికారులు పాల్గొన్నారు. -
పది పరీక్ష రాశారా? మా కాలేజీలో చేరండి
‘హలో.. నమస్కారమండి.. మీ పాప/బాబు పదో తరగతి అయిపోయింది కదండి.. ఇంటర్‌కు ఏం ప్లాన్ చేస్తున్నారు.. మాది కార్పొరేట్ కాలేజ్. ఐఐటీ.. మెయిన్స్.. అడ్వాన్స్.. ఏసీ.. నాన్ ఏసీ స్పెషల్ బ్యాచ్‌లున్నాయి. ఇప్పుడు జాయిన్ అయితే డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం.. రిజల్ట్స్ వచ్చాక సీట్లు ఉండవు. ఫీజులు పెరుగుతాయి.. మీ ఇష్టం.. ఆలోచించుకొండి..’ ఇది జిల్లాలో పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు రోజూ వస్తున్న ఫోన్‌కాల్స్. ఇలా ఇంటర్ కాలేజీల యాజమాన్యాలు ప్రత్యేకంగా పీఆర్వోలను నియమించుకొని ప్రవేశాల కోసం గాలం వేస్తున్నాయి. ఆదిలాబాద్‌టౌన్: తాము పడ్డ కష్టాలు తమ పిల్లలు పడకూడదని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. కూలీ నాలి చేసైనా మంచి కళాశాలలో చదివించాలనే ఆ లోచనలో ఉన్నారు. దీనిని ఆసరాగా చేసుకొని అందినకాడికి దోచుకునేందుకు కార్పొరేట్ కళాశాలలు సిద్ధమవుతున్నాయి. అందించేది అరకొర విద్యే అ యినప్పటికీ.. ఆకట్టుకునేలా బ్యాచ్‌కో పేరు పెట్టి.. రంగురంగుల బ్రౌచర్లు చూపి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. వీరి మాయమాటలు నమ్మి చాలా మంది తల్లిదండ్రులు స్థిరాస్తులు సైతం అమ్ముకొని పిల్లలను చదివిస్తున్నారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్ష ఫలితాలు రాక ముందే నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్ల వేట ప్రారంభించాయి. బంపర్ ఆఫర్లతో ఆకట్టుకునేలా.. ఆయా కళాశాలలు నియమించుకున్న పీఆర్వోలు వి ద్యార్థుల ఇళ్ల వద్దకు క్యూ కడుతున్నారు. మూడు నెలల ముందు నుంచే ఈ తతంగం మొదలైంది. వీరు పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల వివరాలు, ఫోన్ నంబర్లు, చిరునామా ఇప్పటికే సేకరించారు. వివరాలు ఇచ్చినందుకు ఆయా పాఠశాలల యాజ మాన్యాలకు విందులు, నజరానాలు సమకూర్చుతున్నారు. నిబంధన ప్రకారం విద్యార్థుల వివరాలు ఎవరికీ ఇవ్వరాదు. కానీకాసులకు కక్కుర్తిపడి కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఈవిధంగా వ్యవహరిస్తున్నా యి. హైదరాబాద్‌కు చెందిన పలు కళాశాలల వారు జిల్లాలో 50 మంది వరకు పీఆర్వోలను నియమించుకున్నారు. వారు ఉదయం నుంచి రాత్రి వరకు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి బ్రోచర్లు ఇవ్వడం, వారి కళా శాలల్లో ఇచ్చే బోధన, వసతులు, ఏసీ క్యాంపస్‌లు, తదితర విషయాలను వివరిస్తూ వారిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. టార్గెట్ పెడుతూ.. కొన్ని యాజమాన్యాలు పీఆర్వోలను ప్రత్యేకంగా ని యమించుకొని ఏడాది పాటు వేతనాలు ఇస్తున్నా యి. అడ్మిషన్లు ఎక్కువగా చేసిన వారికి ఇన్సెంటీవ్లు సైతం అందజేస్తున్నాయి. మరోవైపు సంబంధి త కళాశాలలో పనిచేస్తున్న బోధన, బోధనేతర అ ధ్యాపకులు, సిబ్బంది తప్పకుండా ప్రతి ఒక్కరు 25 చొప్పున ఆ కళాశాలలో అడ్మిషన్లు తీసుకురావాలని టార్గెట్లు పెట్టారు. వేసవిలో తరగతులు ఉండకపోవడంతో వారికి సగం వేతనమే చెల్లిస్తున్నారు. ప్రవేశాలు చేసిన వారికి మాత్రం ఇన్సెంటీవ్, కొంత కమీ షన్ ఇస్తున్నారు. లెక్చరర్లు, ఇతరులు ఎవరైనా అడ్మిషన్లు చేస్తే సాధారణ కళాశాలకు రూ.వెయ్యి, కార్పొరేట్ కళాశాలకు రూ.5వేల వరకు, హాస్టల్ క్యాంపస్ ఉన్న కళాశాలల్లో చేర్పిస్తే రూ.2500 అందజేస్తున్నా రు. కాగా, ఈ డబ్బంతా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్నది కావడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా.. పదో తరగతి పరీక్షల ఫలితాలు వెలువడిన తర్వాత మే, జూన్‌లో అడ్మిషన్లు ప్రారంభించాలి. అయితే నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తున్నా విద్యా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. జిల్లాలో.. జిల్లాలో ప్రభుత్వ కళాశాలలు 13 మోడల్, సోషల్, ట్రైబల్ వెల్ఫేర్, కేజీబీవీలు, మహాత్మా జ్యోతిబాపూలే, ప్రభుత్వ యాజమాన్య కళాశాలలు 45 ప్రైవేట్ కళాశాలలు 14 భారీగా ఫీజులు.. హైదరాబాద్‌లోని కార్పొరేట్‌కు సంబంధించి జిల్లా నుంచి ఏటా వెయ్యి నుంచి 2వేల మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందుతున్నారు. ఐఐటీ, నీట్, ఏసీ సౌకర్యాలు ఉన్న కళాశాలల్లో ఏడాదికి రూ.3లక్షలు, సాధారణ చదువుకు రూ.1లక్ష 50వేల వరకు వసూలు చేస్తున్నారు. జిల్లాలోని కొన్ని కార్పొరేట్ కళాశాలలు సైతం రూ.లక్షకు పైగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించండి ప్రభుత్వ కళాశాలల్లో అనుభవజ్ఞులైన లెక్చరర్ల ఆధ్వర్యంలో నాణ్యమైన విద్య అందిస్తున్నాం. తల్లిదండ్రులు ఆలోచించి తమ పిల్లలను సర్కారు కళాశాలల్లో చేర్పించాలి. అడ్మిషన్‌తో పాటు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు సైతం ఉచితంగా అందిస్తున్నాం. స్కాలర్షిప్ కూడా పొందవచ్చు. – రవీంద్రకుమార్, డీఐఈవో -
వేమన వెలుగుల్లో.. విద్యా పరిమళాలు
వైవీయూ : యోగివేమన నీకు వందనం.. విశ్వకవితాత్వికా నీకు వందనం.. అన్న విశ్వవిద్యాలయ గీతంతో ఉత్తేజితులవుతూ.. సామాజిక స్పృహ కల్పించిన ప్రజాకవి పేరుతో ఏర్పాటైన యోగివేమన విశ్వవిద్యాలయం 18వ వ్యవస్థాపక, వార్షికోత్సవ వేడుకలకు సిద్ధమైంది. 2006 మార్చి 9వ తేదీన పీజీ కేంద్రం నుంచి విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెంది నేడు 27 కోర్సులతో విలసిల్లుతోంది. దాదాపు 1500 మంది విద్యార్థులు, 100 మంది అధ్యాపక బృందం, 300 మంది దాకా బోధనేతర సిబ్బంది, 100 మంది దాకా పరిశోధక విద్యార్థులతో ప్రగతి పథంలో దూసుకువెళ్తోంది. 1977 నవంబర్ 20వ తేదీన తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం కడప నగర సమీపంలో పీజీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2006లో 652 ఎకరాల్లో విశ్వవిద్యాలయంగా రూపుదిద్దుకుంది. అభివృద్ధికి అడుగులు.. ఇలా... యోగివేమన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విశ్వవిద్యాలయానికి నిధుల వరద పారించారు. వైవీయూకు 2012లో 12బీ గుర్తింపు సైతం లభించడంతోపాటు పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, ప్రపంచ పరిశోధకుల జాబితాల్లో స్థానం, పలు రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డులను విశ్వవిద్యాలయ అధ్యాపక బృందం సొంతం చేసుకున్నారు. అదే విధంగా 2022 నవంబర్‌లో విశ్వవిద్యాలయం న్యాక్ ఏ గ్రేడ్ సాధించి సత్తా చాటింది. విశ్వవిద్యాలయం 2023 జూన్‌లో విడుదల చేసిన ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో దేశంలోని అత్యుత్తమ విద్యాలయాల్లో 151 నుంచి 200 లోపు స్థానం సాధించింది. వీటితోపాటు పలు అవార్డులు, పలు ప్రొజెక్టులు సొంతం చేసుకుని అభివృద్ధి బాటలో పయనిస్తోంది. గ్రంథాలయ ప్రాంగణంలో.. న్యాక్ ఏ గ్రేడ్ సాధించిన తర్వాత సరికొత్త హంగులతో విలసిల్లుతున్న విశ్వవిద్యాలయంలో శనివారం ఉదయం 10.00 గంటలకు వైవీయూలోని ఏపీజే అబ్దుల్‌కలాం కేంద్ర గ్రంథాలయ ప్రాంగణంలో 18వ వ్యవస్థాపక, కళాశాల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. వాస్తవానికి మార్చి 9వ తేదీన వ్యవస్థాపక దినోత్సవం రోజునే వేడుకలు నిర్వహించడం అనవాయితీ కాగా, వరుసగా సెలవులు రావడంతో విద్యార్థులు అందుబాటులో లేకపోవడంతో 23వ తేదీ శనివారం నిర్వహిస్తున్నారు. విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ఆచార్య చింతా సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఆచార్య వి.శ్రీకాంత్‌రెడ్డి, డాక్టర్ వైఎస్ఆర్ ఏఎఫ్‌యూ వైస్ చాన్సలర్ ఆచార్య బి.ఆంజనేయప్రసాద్, న్యూఢిల్లీకి చెందిన ఎస్ఆర్ఎఫ్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ వై.సురేష్‌రెడ్డి విచ్చేయనున్నారు
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Chekc 1234 off the field
Test article qid_23456x4
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 17 ఏళ్ల కెరీర్‌కు గుడ్ బై
ఎవరేశారో తెలుసుకోకుండా దోశలు తినేయడమేనా!!
స్టోయినిష్ అరుదైన రికార్డు.. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
విశ్వసనీయత లేని ప్రతిపక్షాన్ని తిరస్కరించాలి!
అభివృద్ధి బటన్ నొక్కిన సీఎం జగన్
దిక్కుతోచని కుటుంబం దిశ మారింది..!
సారా.. నారా అండతో దోపిడీకి C/O సీఎం రమేష్
ఛాంపియన్ దేశం
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019