Just In
Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1
Ad - Sakshi_Home_Sticky
-
సారా.. నారా అండతో దోపిడీకి C/O సీఎం రమేష్
దోచుకో.. పంచుకో.. సూత్రం సారా వ్యాపారంలో ఆరితేరిపోయిన సీఎం రమేష్‌ను చంద్రబాబు నాయుడుకు దగ్గర చేసింది. సారా వ్యాపారంతో మొదలైన ఆర్జన ఇరిగేషన్ కాంట్రాక్టుల వరకు వెళ్లింది. టీడీపీ ప్రభుత్వం ఉన్నంతకాలం ఈ అక్రమార్జనపరుడికి ఎదురే లేకుండా పోయింది. రిత్విక్ కన్స్ట్రక్షన్స్ పేరుతో హంద్రీ –నీవా, వెలిగొండ, తెలుగుగంగ,గుంతకల్లు బ్రాంచి కెనాల్, వంశధార.. ఒకటేమిటి.. అధికారంలో బాబు అండతో సీఎం రమేష్ అక్రమాల్లో చెలరేగిపోయారు. బాబు– సీఎం రమేష్లది ఆర్థిక రాజకీయ బంధం. ఈ బంధం ఫెవికాల్ అంతదృఢంగా పెనవేసుకుపోయింది. బాబుతో ముడిపడిన ఆర్థిక బంధం రెండు టర్మ్‌ల్లో సీఎం రమేష్‌ను రాజ్యసభ సభ్యుడిని చేసింది. రాజకీయ చక్రం బాగా తిప్పుతారని సదరు బాబు సూచనతో బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఇతనికి ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాలనిపించింది. స్థానికంగా అంత సీన్ లేనందున తన అక్రమాల నేపథ్యం తెలియని కోస్తాంధ్ర వైపు దృష్టి సారించారు. సాక్షి ప్రతినిధి, కడప : స్వయం కృషితో కష్టపడి ఉన్నత స్థాయికి చేరేవారు కొందరైతే, రాజకీయ అండ దొరకబుచ్చుకుని చెలరేగిపోయే వారు ఇంకొందరు. ఇందులో రెండో కోవకు చెందిన నేత చింతకుంట మునెయ్యగారి (సీఎం) రమేష్ నాయుడు. ఉరఫ్ సీఎం రమేష్. చిత్తూరు జిల్లా సారా వ్యాపారంలో చంద్రబాబుతో ఏర్పడ్డ సాన్నిహిత్యం ఉన్నత స్థాయికి ఎదిగేలా చేసింది. అదీ ఏ స్థాయిలో అంటే సొంత తమ్ముడు నారా రామ్మూర్తినాయుడినే బాబు పక్కన పెట్టే స్థాయిలో సంబంధాలు పెనువేసుకున్నాయని పరిశీలకుల అభిప్రాయం. విభజిత ఏపీలో సీఎం రమేష్‌నాయుడు కాంట్రాక్టు సంస్థ దినదినాభివృద్ధి చెందింది. చంద్రబాబు ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని అనేక అక్రమ కార్యకలాపాలను శరవేగంగా నడిపారు. ఎంతలా అంటే 2019 ఎన్నికల నోటిఫికేషన్‌కు కేవలం ఒక్క రోజు ముందే ఈయన కాంట్రాక్టు సంస్థకే ఇరిగేషన్ పనులు దక్కేలా చక్రం తిప్పారు. ఒక్కమాటలో చెప్పాలంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్నాళ్లూ సీఎం రమేష్ ఆర్థిక సామ్రాజ్యం విస్తరించింది. ఎవరీ సీఎం రమేష్‌నాయుడు? వైఎస్సార్ జిల్లా యర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామానికి చెందిన చింతకుంట మునెయ్యగారి (సీఎం) సుబ్బానాయుడు మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి అనుచరుడు. సారా వ్యాపారంలో రాణించారు. కడప జిల్లాలో పలుపాంత్రాల్లో ఈ వ్యాపారాన్ని విస్తరించారు. ఆయనకు నలుగురు కుమారులు. మునిస్వామినాయుడు, గోవర్ధన్‌నాయుడు, సత్యనారాయణనాయుడు, గోపాల్‌నాయుడు. తండ్రి సుబ్బానాయుడు వారసత్వంగా కుమారులు పలువ్యాపారాలను విస్తరించారు. ఈ క్రమంలో మునిస్వామినాయుడు సారా వ్యాపారాన్ని కొనసాగించారు. అప్పట్లో కడప జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న సారా కాంట్రాక్టును చిత్తూరు జిల్లాకు విస్తరించారు. ఈ జిల్లాలో సారా కాంట్రాక్టు కార్యకలాపాలను మునిస్వామినాయుడు కుమారుడు సీఎం రమేష్‌నాయుడు కొనసాగించారని ఈ వ్యవహారం మొత్తం తెలిసిన పలువురు వివరిస్తున్నారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలో అప్పటికే క్రియాశీలకంగా ఉన్న చంద్రబాబుతో సాన్నిహిత్యం కోసం తొలుత తమ్ముడు నారా రామ్మూర్తినాయుడితో సీఎం రమేష్ దోస్తీ చేశారు. క్రమంగా వీరి సాన్నిహిత్యం పెరిగి, తుదకు నారా రామ్మూర్తినాయుడినే చంద్రబాబు నుంచి దూరం పెట్టేలా చేసింది. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన యువతిని సీఎం రమేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దాంతో వెలమ సామాజిక వర్గానికి చెందిన సీఎం రమేష్ బాబుకు మరింత దగ్గరైనట్లు సమాచారం. అనంతరం 1994 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఆయనకు చంద్రగిరి, కుప్పం నియోజకవర్గాల సమన్వయ బాధ్యతలు అప్పగించినట్లు పలువురు చెబుతున్నారు. 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో సీఎం రమేష్ సారా వ్యాపార సామ్రాజ్యం వేగంగా విస్తరించినట్లు సమాచారం. అప్పటి సాన్నిహిత్యమే అంచెలంచెలుగా ఎదిగి టీడీపీ నుంచి రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యే స్థాయికి చేరుకుందని విశ్లేషకులు వివరిస్తున్నారు. టీడీపీ హయాంలో రూ.3,658 కోట్ల పనులు రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ అధికార పగ్గాలు చేపట్టింది. రిత్విక్ కన్స్ట్రక్షన్స్కు ఇదో వరంగా పరిణమించింది. అప్పటి వరకూ వివిధ రాష్ట్రాల్లో కాంట్రాక్టు పనులు చేస్తూ ఆర్థిక లోటుపాట్లతో ఇబ్బందులు పడుతున్న ఆ సంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదరించి అండగా నిలిచింది. ఈ క్రమంలో ఈ సంస్థకు కాంట్రాక్టు పనుల వరద పారిందని పలువురు వివరిస్తున్నారు. అందులో ప్రధానంగా కుప్పం బ్రాంచ్ కెనాల్ రూ.522 కోట్లు, హంద్రీ–నీవా సుజల స్రవంతి ఫేజ్–2 రూ.1000 కోట్లు, హెచ్ఎన్ఎస్ఎస్ విస్తరణ పనులు రూ.195 కోట్లు, హెచ్ఎన్ఎస్ఎస్ 34వ ప్యాకేజీ రూ.234 కోట్లు, జీఎన్ఎస్ఎస్ ప్రాజెక్టులో రూ.350 కోట్లు, వెలిగొండ టన్నెల్ రూ.270 కోట్లు, తెలుగుగంగ లైనింగ్ పనులు రూ.289 కోట్లు, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ రూ.172 కోట్లు, వంశధార ప్రాజెక్టు పనులు రూ.120 కోట్లు, ఆర్టీపీపీ 6వ ప్లాంటు నిర్మాణ పనులు రూ.400 కోట్లు, గండికోట ప్రాజెక్టు పునరావాస నిర్మాణం పనులు రూ.106 కోట్ల పనులు దక్కినట్లు పలు కాంట్రాక్టు సంస్థలు వెల్లడిస్తున్నాయి. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో దాదాపు రూ.3,658 కోట్ల పైబడిన కాంట్రాక్టులను ఆ సంస్థ కొనసాగిస్తున్నట్లు పలువురు కాంట్రాక్టర్ల విశ్వసనీయ సమాచారం. అదే విషయాన్ని ప్రొద్దుటూరు నియోజకవర్గ అప్పటి టీడీపీ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి (ప్రస్తుత టీడీపీ అభ్యర్థి) సైతం పలుమార్లు స్పష్టం చేశారు. ఎంపీ రమేష్‌నాయుడుకు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు. ఆర్టీపీపీలో అడ్డగోలు టీడీపీ ఎంపీ హోదాలో రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రమేష్ దందా నిర్వహిస్తే, సోదరుడు సీఎం సురేష్‌నాయుడు స్థానికంగా ఆర్టీపీపీ (రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్) కేంద్రంగా దోపిడీ చేశారు. ఇనుము (స్క్రాప్), సిమెంటు, కంకర యథేచ్ఛగా తరలించారు. తన దారికి అడ్డు లేకుండా మరో రహదారి (అనధికారిక గేట్) ఏర్పాటు చేసి మరీ తరలించారు. మూడేళ్ల పాటు జెన్కో డైరెక్టర్లు చోద్యం చూడటం మినహా కట్టడి చేయలేని దుస్థితి. ఆర్టీపీపీలో అధికారికంగా రెండుగేట్లు ఉన్నాయి. వాటి పరిధిలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు(ఎస్పీఎఫ్) బందోబస్తు ఉంటుంది. ప్రతిదీ అక్కడ రికార్డు అవుతుంది. ఈ క్రమంలో అనధికారికంగా మూడో గేటు వెలసింది. అందుకు అప్పటి సీఈ, ఓ డైరెక్టర్ స్థాయిలో సహకరించారు. 6వ యూనిట్ నిర్మాణ పనుల నేపథ్యంలో వాహనాల రాకపోకలకు మూడో గేట్ ఏర్పాటు చేసినట్లు యంత్రాంగం సమర్థించుకుంది. ఆ గేటులో ఎలాంటి సిబ్బంది లేకపోవటంతో అవినీతి అక్రమాలకు నిలయంగా మారింది. యథేచ్ఛగా ఈదారి గుండా వాహనాలు ఆర్టీపీపీలోకి వెళ్లడం, బయటికి రావడంతో అందులో ఉన్న కోట్లాది రూపాయల స్క్రాప్, కంకర, సిమెంటు బయటకు వెళ్లింది. విజిలెన్సు విభాగం యాజమాన్యానికి అప్పట్లో ఈ విషయమై నివేదించినా ఫలితం లేకపోయింది. చంద్రబాబు అండ చిత్తూరు జిల్లాలో సారా వ్యాపారంతో అరంగేట్రం చేసిన సీఎం రమేష్ కుటుంబానికి అప్పటి నుంచే చంద్రబాబునాయుడు అండగా నిలిచి ఆదరించారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో గుడిమల్లం దేవాలయ భూములు 303 ఎకరాలు వేలానికి వచ్చాయి. అప్పటి రాజకీయ సంబంధాల కారణంగా సీఎం రమేష్ కుటుంబం తక్కువ ధరలకు ఆ భూములను వేలంలో దక్కించుకున్నట్లు సమాచారం. ఆ భూముల ఆధారంగా 90వ దశకం చివర్లో అప్పటి రాజకీయ పలుకుబడితో బ్యాంకులో దాదాపు రూ.400 కోట్ల రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది. తర్వాత రిత్విక్ కన్స్ట్రక్షన్స్ సంస్థ కార్యకలాపాలు చురుగ్గా సాగినట్లు వాటి కార్యకలాపాలే చెబుతున్నాయి. వ్యక్తిపై దాడి కేసు అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న సీఎం రమేష్నాయుడుపై 2019 ఏప్రిల్ 11న వైఎస్సార్ కడప జిల్లా యర్రగుంట్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 2019 ఎన్నికల సమయంలో యర్రగుంట్లలోని ఓ ఎన్నికల బూత్‌లోకి నిబంధనలకు విరుద్ధంగా ఒకరికంటే ఎక్కువ మంది వెళ్లడంతోపాటు ఓ వ్యక్తిపై దాడి చేసి గాయపరిచారు. బాధితుడు పడిగపాటి వెంకటసుధాకర్ తండ్రి బాల సుబ్బిరెడ్డి ఇచి్చన లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు సీఎం రమేష్‌పై 100/2019 ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, ఐపీసీ సెక్షన్ 323, 324/ఆర్/డబ్లు 34 కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వ నిధులతో భూములకు ప్రొటెక్షన్ వాల్ అపోట్లదుర్తి గ్రామంలో నీరు–చెట్టు పథకం కింద ఫ్లడ్ ప్రొటెక్షన్ బ్యాంక్స్ ఏర్పాటు చేసేందుకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ జీఓ జారీ చేసింది. జీఓ ఆర్టీ నంబర్ 74 ను 2019 జనవరి, 29న జారీ చేశారు. ఆ మేరకు నీరు–చెట్టు పథకం కింద ఫ్లడ్ ప్రొటెక్షన్ బ్యాంక్స్ నిర్మించేందుకు ఫిబ్రవరి 1న ఈ–ప్రొక్యూర్మెంట్ టెండర్లను ఆ శాఖ ఎస్ఈ ఆహా్వనించారు. అంటే విషయం గ్రహించేలోపు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యేలా వ్యవహరించారు. ఎన్నికల కోడ్‌కు ముందే టెండర్లకు పిలిచిన నేపథ్యంలో ఫిబ్రవరి 19న టెండర్లు ఫైనల్ చేశారు. పలు కాంట్రాక్టు సంస్థలు పోటీపడ్డా ఆయా సంస్థలను డిస్క్వాలిఫై చేసి రిత్విక్ సంస్థకు మాత్రమే టెండర్‌ను 4 శాతం ఎక్సెస్ రేట్లకు ఖరారు చేశారు. అవే పనులను రూ.3.08 కోట్లతో రమేష్‌నాయుడు కుటుంబ సభ్యుల స్వా«దీనంలో ఉన్న ప్రభుత్వ భూమి చుట్టూ నిరి్మంచడం విశేషం. అఇకోస్తాంధ్రలోనే ఎందుకంటే.. సీఎం రమేష్‌నాయుడు ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నా, రాయలసీమలో అందునా కడప జిల్లాలో రాజకీయంగా గ్రామానికి ఎక్కువ, మండలానికి తక్కువ స్థాయి. అదే విషయాన్ని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అనేక పర్యాయాలు చెప్పుకొచ్చారు. అలాంటి స్థాయిలేని నాయకుడికి అనధికారికంగా జిల్లా బాధ్యతలు అప్పగించి ప్రజాధనం దోపీడీకి పాల్పడుతున్నారని అప్పట్లో తీవ్రంగా ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రజాబలం లేని కడప నుంచి పోటీ చేయలేక, కోస్తాంధ్రలోని అనకాపల్లి బీజేపీ అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. ఎన్నికల్లో ఖర్చు చేయగల సామర్థ్యం, పైగా టీడీపీ అధినేత చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం వల్లే అక్కడ పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. -
No Headline
ఒంటిమిట్ట: లోక కళ్యాణార్థం జగమేలే వైకుంఠరాముని జగత్ కళ్యాణం ఆంధ్రభద్రాద్రి ఏకశిలానగరి ఒంటిమిట్టలోని జగదభిరాముడి దివ్యక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి వైభవంగా జరిగింది. కోదండ రామయ్య సీతమ్మవారిని పరిణయమాడిన వేళ శిల్పకళాశోభితమైన కళ్యాణ మండపం వైకుంఠాన్ని తలపించింది. ఒంటిమిట్ట కోదండ రాముడి కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం తరపున సతీసమేతంగా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలోని మూల మూర్తులకు రాష్ట్ర స్పెషల్ సీఎస్ కరికలవల్లన్ కల్యాణ వేదిక వద్ద ఉన్న కల్యాణ దంపతులైన సీతారాములకు ముత్యాలతలంబ్రాలు, పట్టువస్త్రాలు సంప్రదాయం ప్రకారం స్వామి వారికి సమర్పించారు. సంప్రదాయం.. ఎదుర్కోలు ఉత్సవం ఒంటిమిట్ట కోదండ రామాలయంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు సీతారామచ్రందులకు నిర్వహించిన ఎదుర్కోలు ఉత్సవం సంప్రదాయబద్ధంగా సాగింది. ఉత్సవ వరులను పల్లకీపై కొలువు తీర్చి ప్రధాన ఆలయం నుంచి మంగళవాయిద్యాల మధ్య భక్తుల జయజయ ధ్వనాలతో శిల్పకళా శోభితమైన కళ్యాణ మండపం వద్దకు తీసుకు వచ్చారు. వేదిక పైన రంజిత సింహాసనంపై కళ్యాణ మూర్తులను ఆశీనులు చేశారు. అనంతరం పూజా సామగ్రిని సంప్రోక్షణ జరిపి ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా విశ్వక్షేన పూజ నిర్వహించారు. ‘కర్మణ్యేపుణ్యాహవచనం’ అనే మంత్రంతో మండప శుద్ధి జరిపి కళ్యాణ తంతుకు శ్రీకారం చుట్టారు. ముంజానకీ ప్రథమం అనే మంత్రం జపిస్తూ వేద పండితులు స్వామి వారికి ఎదురుగా సీతమ్మను కూర్చో పెట్టి కన్యావరణ జరిపించారు. మోక్ష బంధనం, ప్రతిసర బంధనం, ద్వితీయ సువర్ణ యజ్ఞోప వీత ధారణం చేశారు. అనంతరం ఆశీర్వచనం, పాద ప్రక్షాళనం, పుష్పోదకస్నానం నిర్వహించి, వర పూజ చేశారు. బంగారు ఆభరణాలను సీతమ్మకు అలంకరించి సకలోపచారాలు చేశారు. మధుపర్కపాసన అనంతరం పెరుగు, తేనె కలిపిన మిశ్రమాన్ని స్వామి వారికి నివేదించగా నును సిగ్గుల మొలకై న సీతమ్మ నోసటన కళ్యాణ బొట్టును, బుగ్గన కాసింత దిష్టిచుక్క పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం తరుపున స్పెషల్ సీఎస్ కరికాలవలవన్ సమర్పించిన ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను ధరించి పెళ్లికూతురిగా ముస్తాబైంది. అమెకు ఏ మాత్రం తీసిపోని విధంగా శివధనుస్సు విరిచిన శ్రీరామచంద్రమూర్తి అదే రీతిలో సర్వాభరణ భూషితుడై సీతమ్మ ఎదుట కూర్చున్నాడు. తరువాత లోక క్షేమం కోసం మహా సంకల్పం పఠించి కణ్యాదానం, గోదానం చేశారు. సీతమ్మకు రామయ్యకు చెరో 8 శ్లోకాలతో మంగళకాష్టం చదివారు. మంగళవాయిద్యాలు, వేద పండితుల చతుర్వేద పఠనం భక్తుల రామనామ ధ్వనుల మధ్య హస్త నక్షత్రయుక్త శుభలగ్నంలో సీతారాముల శిరస్సులపై జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని ఉంచారు. అనంతరం గౌరిదేవి, సరస్వతి దేవి, మహాలక్ష్మీ అమ్మవార్లను ఆహ్వానించి సకల మంగళాలకు ఆలవాలమైన మంగళసూత్రానికి పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు వీణారాఘవాచార్యులు ఆధ్వర్యంలో పాంచరాత్ర ఆగమశాస్త్ర వేదపండితులు మంగళసూత్రాన్ని భక్తులకు చూపించి సాక్షాత్తూ లక్ష్మీనారాయణుడైన శ్రీరామ చంద్రమూర్తి చేత, శ్రీ మహాలక్ష్మీ స్వరూపినీ సీతాదేవికి శాస్త్రోక్తంగా మంగళసూత్రాధారణ నిర్వహించారు. ప్రభుత్వం తెచ్చిన ముత్యాల తలంబ్రాలు కళ్యాణమూర్తుల శిరస్సుపై వేసి కనుల పండువగా కళ్యాణం జరిపారు. అనంతరం నివేదన ఇచ్చి బ్రహ్మముడి వేశాక మహాదాశీర్వచనం నిర్వహించి హారతి ఇవ్వడంతో కళ్యాణ క్రతువు ముగిసింది. ● స్వామి వారి కల్యాణాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఎస్ రావత్, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి సత్యనారాయణ, టీటీడీ ఈఓ ధర్మారెడ్డి, జేఈఓలు వీరబ్రహ్మం, గౌతమి, జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్‌తోపాటు టీటీడీ యంత్రాంగం, జిల్లా ఉన్నతాధికారులు, ప్రముఖులు, లక్షలాది మంది భక్త జనం వీక్షించారు. భక్తుల రామనామ సంకీర్తనలు.. పండితుల చతుర్వేద పఠనం..మంగళవాయిద్యాల నడుమ.. సోమవారం సాయంత్రం 6:30 గంటల నుంచి 8:30 గంటల వరకు హస్త నక్షత్రయుక్త శుభలగ్నంలో దశరథ మహారాజు తనయుడు శ్రీ రామచంద్రమూర్తి , జనకుని గారాల పట్టి.. నునుసిగ్గుల మొలక సీతమ్మను పరిణయమాడాడు. కమనీయం..రమణీయమైన ఈ సుందర దృశ్యాన్ని తిలకించిన భక్తులు భక్తి పారవశ్యంలో తడిసిముద్దయ్యారు. కమనీయం..దాశరథి కల్యాణం ఏకశిలానగరిలో పండు వెన్నెలలో రాములోరి కల్యాణం కనులారా వీక్షించిన చంద్రుడు పోటెత్తిన భక్తజనం మార్మోగిన రామనామం -
No Headline
ఎయిడెడ్ 768 650 84.64 బీసీవెల్పేర్ 210 208 99.05 ప్రభుత్వ 707 590 83.45 కేజీబీవీ 613 593 96.74 మున్సిపాలిటీ 1776 1425 80.24 మోడల్‌స్కూల్స్ 254 253 99.61 ఏపీ రెసిడెన్షియల్ 156 154 98.72 సోసియల్ వెల్ఫేర్ 839 816 97.26 ట్రైబల్ వెల్ఫేర్ 99 93 93.94 జెడ్పీ 9389 8147 86.77 ప్రైవేటు 12918 12609 97.61 -
●గజేంద్రుడిపై జగదభిరాముడు
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలోని వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణం తర్వాత స్వామివారు గజవాహనంపై విహరించారు.అంతకు ముందు ఉదయం 7 నుంచి 9గంటల వరకు శివధనుర్భంగాలంకారంలో రాములోరు భక్తులకు దర్శనం ఇచ్చారు. చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఆలయంలో స్నపన తిరుమంజనం జరిగింది.బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు రథారోహణం, 10:15 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రథోత్సవం నిర్వహిస్తారు. -
నాలుగోరోజు నామినేషన్ల జోరు
కడప సెవెన్‌రోడ్స్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నాల్గవరోజైన సోమవారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 44 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో కడప లోక్‌సభ స్థానానికి ఆరు నామినేషన్లు రాగా, ఏడు అసెంబ్లీ స్థానాలకు 38 నామినేషన్లు దాఖలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. కడప లోక్‌సభ: కడప లోక్‌భ స్థానానికి కుంచెం వెంకట సుబ్బారెడ్డి రాయలసీమ రాష్ట్ర సమితి అభ్యర్థిగా ఒకటి, ఇండిపెండెంట్‌గా ఒక నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా షర్మిల తరఫున మూడు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ తరఫున వేణుగోపాల్ ఒకటి, ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఖాజా హుసేన్ ఒకటి, ఇండిపెంట్ అభ్యర్థిగా వెంకట సుబ్బారెడ్డి రెండు నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీలకు... బద్వేలు: కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్డీ విజయజ్యోతి ఒక సెట్, వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా దాసరి సుధ ఒక సెట్, సమాజ్ వాది పార్టీ అభ్యర్థిగా వెంకట సుబ్బరాయుడు ఒకటి, బీజేపీ అభ్యర్థిగా రోశన్న ఒకటి, బీజేపీ అభ్యర్థిగా అరుణరాజి ఒకటి, ఇండిపెండెంట్‌గా మల్లికార్జున ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. కడప: రీఫార్మ్స్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా సుబ్రమణ్యం ఒకటి, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అభ్యర్థిగా అలీషేర్ ఒకటి, నేషనల్ మహా సభ అభ్యర్థిగా పట్టుపోగుల పవన్‌కుమార్ ఒకటి, జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ అభ్యర్థిగా అవ్వారు మల్లికార్జున నామినేషన్ దాఖలు చేశారు. పులివెందుల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి తరఫున ఒకటి, జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థిగా దాసరి రవిశంకర్ ఒకటి, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా గవిరెడ్డి రామేశ్వర్‌రెడ్డి ఒకటి, బహుజన సమాజ్ పార్టీ తరఫున బెల్లం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఒక నామినేషన్ దాఖలు చేశారు. కమలాపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పి.రవీంద్రనాథ్‌రెడ్డి రెండు సెట్లు, ఇండిపెండెంట్‌గా నర్రెడ్డి కిశోర్‌రెడ్డి ఒకటి, సీపీఐ తరఫున గాలి చంద్ర ఒకటి, కాంగ్రెస్ అభ్యర్థిగా పాముల బ్రహ్మానందరెడ్డి ఒకటి దాఖలు చేశారు. జమ్మలమడుగు: ఇండిపెండెంట్‌గా రామేశ్వర్‌రెడ్డి ఒకటి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ మూలె సుధీర్‌రెడ్డి రెండు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా క్రాంతి ప్రియ ఒకటి, ఇండిపెండెంట్‌గా ప్రమోద్‌కుమార్‌రెడ్డి ఒకటి, ఇండిపెండెంట్‌గా రామాంజనమ్మ ఒకటి, ఇండిపెండెంట్‌గా వెంకట సుబ్బారెడ్డి ఒక నామినేషన్ దాఖలు చేశారు. ప్రొద్దుటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాచమల్లు శివస్రాద్రెడ్డి ఒకటి, బీఎస్పీ అభ్యర్థిగా సుబ్బరాయుడు ఒకటి, కాంగ్రెస్ అభ్యర్థిగా మహమ్మద్ నజీర్ ఒకటి, జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ అభ్యర్థిగా సురేష్‌బాబు ఒక నామినేషన్ దాఖలు చేశారు. మైదుకూరు: తెలుగుదేశం పార్టీ తరఫున పుట్టా సుధాకర్ ఒకటి, పుట్టా రవికుమార్ యాదవ్ ఒకటి, వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురామిరెడ్డి ఒకటి, బీఎస్పీ తరఫున డీఎస్ జయరాం ఒకటి, ఇండిపెండెంట్‌గా ఆవుల వెంకట రమణ ఒకటి, బీఎస్పీ అభ్యర్థిగా డీఎస్ కల్యాణ్ ఒకటి, కాంగ్రెస్ అభ్యర్థిగా గుండ్లకుంట శ్రీరాములు ఒకటి, జయభారత్ నేషనల్ పార్టీ అభ్యర్థిగా లెక్కల శ్రీనివాసులురెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం 44 నామినేషన్లు దాఖలు
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Chekc 1234 off the field
Test article qid_23456x4
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 17 ఏళ్ల కెరీర్‌కు గుడ్ బై
ఎవరేశారో తెలుసుకోకుండా దోశలు తినేయడమేనా!!
స్టోయినిష్ అరుదైన రికార్డు.. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
విశ్వసనీయత లేని ప్రతిపక్షాన్ని తిరస్కరించాలి!
అభివృద్ధి బటన్ నొక్కిన సీఎం జగన్
దిక్కుతోచని కుటుంబం దిశ మారింది..!
సారా.. నారా అండతో దోపిడీకి C/O సీఎం రమేష్
ఛాంపియన్ దేశం
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019