Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

నాలుగోరోజు నామినేషన్ల జోరు

Published Tue, Apr 23 2024 8:35 AM

- - Sakshi

కడప సెవెన్‌రోడ్స్‌: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నాల్గవరోజైన సోమవారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 44 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో కడప లోక్‌సభ స్థానానికి ఆరు నామినేషన్లు రాగా, ఏడు అసెంబ్లీ స్థానాలకు 38 నామినేషన్లు దాఖలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.

కడప లోక్‌సభ: కడప లోక్‌భ స్థానానికి కుంచెం వెంకట సుబ్బారెడ్డి రాయలసీమ రాష్ట్ర సమితి అభ్యర్థిగా ఒకటి, ఇండిపెండెంట్‌గా ఒక నామినేషన్‌ దాఖలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా షర్మిల తరఫున మూడు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ తరఫున వేణుగోపాల్‌ ఒకటి, ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా ఖాజా హుసేన్‌ ఒకటి, ఇండిపెంట్‌ అభ్యర్థిగా వెంకట సుబ్బారెడ్డి రెండు నామినేషన్లు దాఖలు చేశారు.

అసెంబ్లీలకు...

బద్వేలు: కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎన్‌డీ విజయజ్యోతి ఒక సెట్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా దాసరి సుధ ఒక సెట్‌, సమాజ్‌ వాది పార్టీ అభ్యర్థిగా వెంకట సుబ్బరాయుడు ఒకటి, బీజేపీ అభ్యర్థిగా రోశన్న ఒకటి, బీజేపీ అభ్యర్థిగా అరుణరాజి ఒకటి, ఇండిపెండెంట్‌గా మల్లికార్జున ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.

కడప: రీఫార్మ్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అభ్యర్థిగా సుబ్రమణ్యం ఒకటి, ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ అభ్యర్థిగా అలీషేర్‌ ఒకటి, నేషనల్‌ మహా సభ అభ్యర్థిగా పట్టుపోగుల పవన్‌కుమార్‌ ఒకటి, జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ అభ్యర్థిగా అవ్వారు మల్లికార్జున నామినేషన్‌ దాఖలు చేశారు.

పులివెందుల: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఒకటి, జై భారత్‌ నేషనల్‌ పార్టీ అభ్యర్థిగా దాసరి రవిశంకర్‌ ఒకటి, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అభ్యర్థిగా గవిరెడ్డి రామేశ్వర్‌రెడ్డి ఒకటి, బహుజన సమాజ్‌ పార్టీ తరఫున బెల్లం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఒక నామినేషన్‌ దాఖలు చేశారు.

కమలాపురం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పి.రవీంద్రనాథ్‌రెడ్డి రెండు సెట్లు, ఇండిపెండెంట్‌గా నర్రెడ్డి కిశోర్‌రెడ్డి ఒకటి, సీపీఐ తరఫున గాలి చంద్ర ఒకటి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా పాముల బ్రహ్మానందరెడ్డి ఒకటి దాఖలు చేశారు.

జమ్మలమడుగు: ఇండిపెండెంట్‌గా రామేశ్వర్‌రెడ్డి ఒకటి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా డాక్టర్‌ మూలె సుధీర్‌రెడ్డి రెండు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా క్రాంతి ప్రియ ఒకటి, ఇండిపెండెంట్‌గా ప్రమోద్‌కుమార్‌రెడ్డి ఒకటి, ఇండిపెండెంట్‌గా రామాంజనమ్మ ఒకటి, ఇండిపెండెంట్‌గా వెంకట సుబ్బారెడ్డి ఒక నామినేషన్‌ దాఖలు చేశారు.

ప్రొద్దుటూరు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా రాచమల్లు శివస్రాద్‌రెడ్డి ఒకటి, బీఎస్పీ అభ్యర్థిగా సుబ్బరాయుడు ఒకటి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా మహమ్మద్‌ నజీర్‌ ఒకటి, జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ అభ్యర్థిగా సురేష్‌బాబు ఒక నామినేషన్‌ దాఖలు చేశారు.

మైదుకూరు: తెలుగుదేశం పార్టీ తరఫున పుట్టా సుధాకర్‌ ఒకటి, పుట్టా రవికుమార్‌ యాదవ్‌ ఒకటి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా రఘురామిరెడ్డి ఒకటి, బీఎస్పీ తరఫున డీఎస్‌ జయరాం ఒకటి, ఇండిపెండెంట్‌గా ఆవుల వెంకట రమణ ఒకటి, బీఎస్పీ అభ్యర్థిగా డీఎస్‌ కల్యాణ్‌ ఒకటి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా గుండ్లకుంట శ్రీరాములు ఒకటి, జయభారత్‌ నేషనల్‌ పార్టీ అభ్యర్థిగా లెక్కల శ్రీనివాసులురెడ్డి ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.

మొత్తం 44 నామినేషన్లు దాఖలు

1/3

2/3

3/3

Advertisement

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250