Just In
Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1
Ad - Sakshi_Home_Sticky
-
ఇక్కడ డీల్ కుదిరింది.. అక్కడ వేలు తెగింది
సాక్షి ప్రతినిధి, గుంటూరు/ గుంటూరు రూరల్ : ఈ చిత్రం చూశారుగా.. సోమవారం ఢిల్లీలో వేలు కోసుకొని హడావుడి చేసిన గుంటూరు స్వర్ణభారతి నగర్‌కు చెందిన కోపూరి లక్ష్మి టీడీపీ నేత బూర్ల రామాంజనేయులుతో ఉన్న చిత్రమిది. కొన్నేళ్లుగా తాడేపల్లిలో ఉంటున్న లక్ష్మి ప్రత్తిపాడు టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు, వేమూరు టీడీపీ అభ్యర్థి నక్కా ఆనందబాబుతో కలిసి ఆ పార్టీలో పనిచేస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన వ్యక్తిగా 2014 నుంచి 2017 మధ్య గుంటూరు, పరిసర ప్రాంతాల్లో చాలా భూ దందాలు, ఫోర్జరీ పత్రాలతో వేరొకరి స్థలాలు అమ్మేయడాలు, కేసులు పెట్టిన వారిపై అనుచరులతో కలిసి దాడులు చేయడంలో పేరొందిన ‘ఆదర్శ’ మహిళ. ఢిల్లీ డ్రామాలో నాయిక. లక్ష్మి తల్లి, తండ్రిది కూడా భూ దందాల చరిత్రే. ఆమె తండ్రి కూడా చేతులు కోసుకొని, కళ్లు పొడుచుకొని అధికారులను బెదిరించి, పనులు చేయించుకొనే వాడు. వారి మరణానంతరం వారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొంది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో గుంటూరు, పరిసర ప్రాంతాల్లో లక్ష్మి చేసిన దందాలు అన్నీ ఇన్నీ కావు. ఆమెపై గుంటూరులో పలు కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో ఆమె తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసుల నుంచి బయట పడేందుకు ఆ పార్టీలో చేరింది. ఆమె కోరుకున్నట్లుగానే కేసులు, దర్యాప్తులు ఆగాయి. ఇప్పుడు ఇదే కోపూరి లక్ష్మిని పావుగా వాడుకొని వైఎస్సార్సీపీకి చెందిన దళిత నేతలపై ఆరోపణలు చేయించి, తద్వారా ఎన్నికల్లో ఎంతో కొంత లబ్ధి పొందాలన్న చవకబారు ఆలోచనతో టీడీపీ భారీ పథకమే రచించింది. భూ అక్రమాలకు పాల్పడిన అమె చేతే, వేరే వారెవరో అక్రమాలు చేస్తుంటే అడ్డుకొన్నానంటూ చెప్పించడం వెనుక ఎల్లో స్క్రిప్టు ఉందన్న విషయం ఆమె ఢిల్లీ వెళ్లి ఆడిన డ్రామాలోనే తేటతెల్లమైంది. అంతలోనే ఇంత పెద్ద స్పందనా? కోపూరి లక్ష్మి ఇలా ఢిల్లీలో వేలు కోసుకొన్నానని చెప్పిందో లేదో.. కొద్ది నిమిషాల్లోనే టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టడం ప్రారంభించారు. ఆమె ఢిల్లీలో ఆడిన డ్రామా వెనుక టీడీపీ పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం అక్కర్లేదు. ఒకాయన వేలు కోసుకోవద్దు.. ఓటేయండంటాడు. ఇంకొకాయన మరో రకంగా ఓదారుస్తాడు. అసలు వేలు కోయించిన వాళ్లే క్షణాల్లో ఇలా ఓదార్పు మాటలు మాట్లాడటం విడ్డూరమే. కేసుల ఎత్తివేత హామీ, ప్రలోభాలు ఎవరైనా తనపై దాడులు జరిగినా, వేధింపులకు గురిచేసినా ముందుగా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. తనను కొంతమంది వేధిస్తున్నారంటూ ఆరేళ్ల కిందట టీడీపీ ప్రభుత్వంలోనే కేసులు పెట్టింది. తర్వాత గుంటూరు నుంచి తాడేపల్లి వెళ్లిపోయింది. ఇటీవలి కాలంలో ఆమెపై ఎప్పుడు దాడులు జరిగాయి, వాటిని ఎవరు చేశారో తెలియదు. ఆమె ఫిర్యాదు కూడా చేయలేదు. ఢిల్లీలో విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో కూడా 2018 నాటి కేసుల గురించే ప్రస్తావించింది. టీడీపీ నేతల అండ, ఆర్థిక సహకారంతో ఏకంగా ఢిల్లీ వెళ్లి, తనపై వైఎస్సార్సీపీ నేతల దాడులంటూ ఆరోపణలకు దిగింది. ఇందుకు చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ నేతలు పెద్ద స్క్రిప్టే తయారు చేశారు. ఆమెతో భారీ డీల్ కుదుర్చుకున్నారు. ఆమెపై ఉన్న కేసులు ఎత్తేస్తామని, ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తామంటూ ప్రలోభాలకు గురి చేశారు. ఈ డీల్ కుదిరిన వెంటనే ఆమె ఢిల్లీ వెళ్లి, ఎల్లో స్క్రిప్టు ప్రకారం వైఎస్సార్సీపీ నేతలపై ఆరోపణలు చేసి, వేలు కోసుకొన్నానని చెప్పి డ్రామాను రక్తికట్టించే ప్రయత్నం చేసింది. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాలకు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. టీడీపీ పెద్దల అండ లేనిదే ఆమె ఇంత దూరం వెళ్లదన్న విషయం ఇక్కడ సుస్పష్టం. ఆమె ఢిల్లీ నుంచి రాగానే నేరుగా టీడీపీ కార్యాలయానికి తీసుకువెళ్లి మీడియా ముందు పెట్టడమూ ఎల్లో స్క్రిప్టు ఉందన్న విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. లక్ష్మి గతమంతా అక్రమాలే స్వర్ణ భారతి నగర్‌కు చెందిన నామాల కృష్ణమూర్తి, భార్య తులసమ్మ 25 ఏళ్ళ కిందట స్వర్ణభారతి నగర్లో ప్రభుత్వ స్థలాల్ని కబ్జా చేసి, వాటిలో ప్లాట్లు వేసి ఫోర్జరీ పత్రాలు సృష్టించి అమాయక ప్రజలకు అంటగట్టేవారు. ఆ కాలనీకి ఇద్దరి పేర్లు కలిసేలా కృష్ణతులసీ నగర్ అనే పేరు వారే పెట్టారు. నామాల కృష్ణమూర్తి కూడా 25 ఏళ్ళ క్రితం ఇదే విధంగా చేతులు కోసుకుని, కళ్ళు పొడుచుకుని అధికారులను బెదిరించి పనులు చేయించుకునేవాడని కాలనీవాసులే చెబుతున్నారు. వారి కుమార్తే కోపూరి లక్ష్మి. వారి మరణానంతరం తల్లిదండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకుని స్వర్ణభారతి నగర్, కృష్ణతులసీ నగర్, అడవితక్కెళ్ళపాడు, తుఫాన్ నగర్లలో ఇదే విధంగా బ్లాక్మెయిల్, స్థలాల కబ్జాలకు పాల్పడుతుండేదని, ఫోర్జరీ పత్రాలతో వేరొకరి స్థలాలు అమ్మేస్తుండేదని స్థానికులు చెబుతున్నారు. ఆమెపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ కేసులన్నీ అప్పటి కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలోనే నమోదయ్యాయి. చాలా కేసులు కోర్టులో విచారణలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. వాటిలో కొన్ని.. ♦ 2013లో స్వర్ణభారతి నగర్‌కు చెందిన దివ్యభారతి అనే మహిళకు చెందిన స్థలానికి నకిలీ బీఫారం సృష్టించి, అందులో తహసీల్దారు సంతకం సైతం ఫోర్జరీ చేసి, ఆ స్థలం తనదేనని స్థానికంగా ఉండే పద్మశ్రీ అనే మహిళకు విక్రయించింది. విషయం తెలుసుకున్న దివ్యభారతి కోపూరి లక్ష్మిపై ఫిర్యాదు చేయగా, పోలీసులు ఫోర్జరీ, నకిలీ పత్రాలు తయారీ తదితర విషయాలపై కేసు నమోదు చేశారు. 2016లో ఈ కేసు విషయమై కోర్టు నుంచి ఇంటికి వస్తున్న పద్మశ్రీ కుటుంబ సభ్యులను స్వర్ణభారతినగర్ సమీపంలో అడ్డగించి వారిపై కోపూరి లక్ష్మి, ఆమె అనుచరులు దాడిచేశారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా లక్ష్మిపై కేసు నమోదు చే«శారు. ♦కోపూరి లక్ష్మి నకిలీ ఫోర్జరీ బీఫారాలను తయారు చేసి, అందులో తనకు తెలియకుండానే తన పేరిట సాక్షి సంతకాలు చేసేదని స్వర్ణభారతి నగర్‌కు చెందిన రమాదేవి అనే మహిళ 2013లో నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. ♦2014లో సుశీల, అంజలి అనే మహిళల ఇళ్ళను కబ్జా చేసేందుకు కోపూరి లక్ష్మి ప్రయత్నించింది. వారిపై దాడి చేసి ఇరువురి ఇళ్ళకు ఫోర్జరీ సంతకాలతో నకిలీ బీఫారాలు తయారు చేసి స్థానికంగా ఉండే వ్యక్తికి విక్రయించాలని ప్రయత్నించింది. దీంతో లక్ష్మిపై సుశీల నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ♦ 2015లో కోపూరి లక్ష్మి తన 15 సంవత్సరాల పెద్ద కుమార్తెకు వివాహం కాకున్నా, అప్పటికే వివాహం జరిగిందని రెవెన్యూ అధికారులను నమ్మించి ఆమె పేరుతో బీఫారం సృష్టించి ఆ స్థలాన్ని వేరే వ్యక్తికి విక్రయించాలని చూసింది. ఈ మోసాన్ని గమనించిన ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ♦ 2017లో నకిలీ పత్రాలతో మోహనరావు అనే వ్యక్తికి ఇంటి స్థలం విక్రయించింది. అయితే, ఈ స్థలాల దస్తావేజులు నకిలీవని తేలడంతో ఆయన నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసుల్లో పోలీసులు లక్ష్మిని పలుమార్లు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆమె పోలీసులను సైతం ఏమార్చి స్టేషన్ నుంచి పారిపోయిన సంఘటనలు ఉన్నాయని పోలీసులే చెబుతున్నారు. మా స్థలానికి నకిలీ బీఫారం సృష్టించి అమ్మేసింది 2016లో నా కుమార్తె అనారోగ్యంతో ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లేదాన్ని. ఆ క్రమంలో కోపూరి లక్ష్మి మా ఇంటి స్థలానికి నకిలీ బీఫారాన్ని సృష్టించి వేరేవారికి అమ్మేసింది. అదేమని అడిగితే మాపై దాడి చేసింది. దీంతో మనస్థాపానికి గురైన మా కుమార్తె చనిపోయింది. తరువాత పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి లక్ష్మి నకిలీ బీఫారం సృష్టించిందని రూజువు చేసి మా ఇల్లు మేము కాపాడుకున్నాం. – పాకనాటి ఆరోగ్యం, భర్త నాగేశ్వరరావు, కృష్ణతులసీ నగర్ మా స్థలం కబ్జాకు ప్రయత్నించింది.. మమ్మల్ని బెదిరించింది మా ఇంటి స్థలాన్ని కబ్జా చేసేందుకు కోపూరి లక్ష్మి తీవ్రంగా ప్రయత్నించింది. మమ్మల్ని బెదిరించింది. మేము పదేళ్ళ క్రితం రైతుబజారులో కూలీ పనులు చేసుకునేవాళ్లం. స్వర్ణభారతి నగర్లో మా స్థలం ఖాళీగా ఉండేది, దానిని కబ్జా చేసి విక్రయించాలని చూసింది. పోలీసులు, స్థానిక నాయకుల సహకారంతో అతి కష్టం మీద మా స్థలాన్ని కాపాడుకున్నాం. అప్పటి నుంచి మాపై పలుమార్లు దాడులు చేయించింది. లక్ష్మి మనుషులు ఇప్పటికీ ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. – పుష్పలత, స్వర్ణభారతి నగర్ నకిలీ బీఫారాన్ని సృష్టించి అమ్మేసింది మేము వ్యవసాయ కూలీలం. పనులు ఉన్న సమయంలో ఇతర గ్రామాలకు వెళ్ళి కూలీ చేసి, వేసవిలో సొంత ఇంటికి వచ్చే వాళ్లం. మేము లేని సమయంలో కృష్ణతులసీ నగర్‌లోని మా ఇంటిని కబ్జాచేసి నకిలీ బీఫారాన్ని సృష్టించి అమ్మేసింది. దీంతో పోలీసులను ఆశ్రయించాం. లక్ష్మి తన మనుషులతో మాపై దాడులు చేయించింది. చంపుతామని బెదిరించింది. రెవెన్యూ అధికారులు, పోలీసులు, స్థానిక నాయకుల సాయంతో తిప్పలుపడి మా స్థలాన్ని కాపాడుకున్నాం. – పులిపాటి అంజలి, భర్త లోకయ్య, కృష్ణతులసీ నగర్ అక్రమాలకు అడ్డుపడుతున్నామని కేసు పెట్టింది కోపూరి లక్ష్మి స్థలాల ఆక్రమణలను అడ్డుకున్నందుకు నాపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది. అదేమని అడిగితే పోక్సో కేసు పెడతానని, నన్ను చంపేస్తానని బెదిరించింది. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి నా నుంచి లక్షల్లో డబ్బు వసూలు చేసింది. ఆమె బాధలు పడలేక హైదరాబాద్ వెళ్ళి బతుకుతున్నాను. – కె మోహనరావు, స్వర్ణభారతి నగర్ జాతీయ మీడియా దృష్టినాకర్షించడానికే ఢిల్లీకి కోపూరి లక్ష్మికి నిజంగా అన్యాయం జరిగితే ఇదే పని గుంటూరులోనో, తాడేపల్లిలోనో చేయొచ్చు కదా! ఢిల్లీ వరకు ఎందుకు వెళ్లారు? ఇక్కడ మళ్లీ చంద్రబాబు పాత్రే కనపడుతుంది. 1994 నుంచి ఆయన ఆడుతున్న పాత చీప్‌ట్రిక్స్‌నే ఇక్కడా ప్రయోగించారు. అవే గుంటనక్క వేషాలు ప్రదర్శించారు. రాష్ట్రంలో అయితే, ఆమెను నమ్మే వారెవరూ ఉండరు. ఆమె అక్రమాల చరిత్ర అటువంటిది. అదే ఢిల్లీలో అయితే ఎల్లో మీడియాతోపాటు జాతీయ మీడియా దృష్టిని, కొందరు జాతీయ నేతల దృష్టిని ఆకర్షించొచ్చు. అందుకే చంద్రబాబు ఇలాంటి చవకబారు డ్రామాకు తెరతీశారు. -
చంద్రబాబుపై చర్యలకు ఎన్నికల సంఘం సిఫార్సు
సాక్షి, అమరావతి: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఉల్లంఘించడంపై తదుపరి చర్యలకు సిఫార్సు చేస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా బాబు తన ప్రసంగాల్లో నిబంధనలు తుంగలో తొక్కుతూ సీఎం జగన్‌పై అభ్యంతరకర పదజాలంతో దూషిస్తూ, ఉద్వేగాలను రెచ్చగొట్టే విధంగా చేస్తున్న ప్రసంగాలకు సంబంధించి వైఎస్సార్సీపీ ఎన్నికల సంఘానికి అనేకమార్లు ఫిర్యాదు చేసింది. వాటిలో 18 ఫిర్యాదులకు సంబంధించి చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. ఫిర్యాదుల ఆధారంగా వివరణ ఇవ్వాలంటూ బాబుకు నోటీసులు జారీ చేయగా.. కొన్నింటికి సమాధానాలు ఇచ్చిన బాబు మరికొన్నింటికి అసలు స్పందించలేదు. బాబు సమాధానంపై సంతృప్తి చెందని రాష్ట్ర ఎన్నికల సంఘం ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత బాబు ప్రసంగాలు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉన్నట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. ఈ 18 ఫిర్యాదులకు సంబంధించిన వీడియో క్లిప్పులను జత చేస్తూ తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ముఖేష్‌కుమార్ మీనా కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్యకార్యదర్శి అవినాష్ కుమార్‌కు లేఖ రాశారు. తాజాగా మరో ఫిర్యాదు ఎన్నికల ప్రచార సభల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనాకు వైఎస్సార్సీపీ మంగళవారం ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు, పార్టీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.నారాయణమూర్తి, న్యాయవాది కె.శ్రీనివాసరెడ్డి వెలగపూడి సచివాలయంలో సీఈవోకు ఫిర్యాదు అందించారు. ఈ నెల 22న జగ్గంపేట బహిరంగ సభలో బాబు ప్రసంగిస్తూ.. సీఎం జగన్, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌కు విరుద్ధం కాబట్టి బాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. జగ్గంపేట సభతోపాటు నర్సంపేట, ఎస్.కోట సభల్లో కూడా చంద్రబాబు పరుష పదజాలం వాడారని, సీఎం వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఇలాంటి దుర్మార్గమైన చర్యను చంద్రబాబు పదే పదే కొనసాగిస్తున్నారని, పచ్చమీడియాను అడ్డం పెట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని వివరించారు. మెగా డీఎస్సీపైనే తొలి సంతకం అంటూ నిరుద్యోగులకు మళ్లీ దగా చేయాలని చూస్తున్నారని, వీటిని నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. -
వలంటీర్ చెప్పినవారికి ఓటేసేంత బలహీనంగా ఓటర్లు లేరు
సాక్షి, అమరావతి: వలంటీర్ల మాటలు విని.. వారు చెప్పినవారికి ఓటు వేసేంత బలహీనంగా ఓటర్లు లేరని హైకోర్టు వ్యాఖ్యానించింది. వలంటీర్, లబ్దిదారు మధ్య ఉన్న అనుబంధం వలంటీర్ రాజీనామాతో తెగిపోతుందని స్పష్టం చేసింది. అలాంటప్పుడు వలంటీర్ చెప్పినట్టు ఓటరు ఎందుకు చేస్తారని ప్రశ్నిం చింది. వలంటీర్లు తమ జేబులో నుంచి తీసి డబ్బేమీ ఇవ్వడం లేదని, అలాంటప్పుడు వారి మాటలను ఓటరు ఎందుకు వింటారని పిటిషనర్‌ను నిలదీసింది. ఎవరైనా కూడా ఓటరును పోలింగ్ బూత్ వద్దకు వెళ్లేంత వరకే ప్రభావితం చేయగలిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. పోలింగ్ బూత్‌లోకి వెళ్లాక ఓటరు తనకు నచ్చినవారికే ఓటు వేస్తారని తెలిపింది. రాజీనామా చేశాక ఎవరైన వలంటీర్ ఏదైనా ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నిం చింది. మొత్తం వలంటీర్లు ఎందరు? ఎంతమంది పనిచేస్తున్నారు? రాజీనామా చేసినవారెందరు? తదితర వివరాలను తమ ముందుంచాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు వలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ విచారణ జరిపారు. రాజీనామా చేశాక మేమేం చేయలేం.. కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది శివదర్శన్ వాదనలు వినిపిస్తూ.. వలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కారన్నారు. ఎన్నికల్లో విధుల్లో పాల్గొనకుండా, పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరించకుండా వలంటీర్లను నియంత్రిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఒకవేళ వలంటీర్ రాజీనామా చేస్తే వారిపై ఎన్నికల సంఘానికి ఎలాంటి నియంత్రణ ఉండదన్నారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేమని స్పష్టం చేశారు. వారికి సైతం ప్రాథమిక హక్కులున్నాయని.. ఇష్టానుసారం రాజీనామా చేసే హక్కు వారికి సైతం ఉందన్నారు. వలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు పిటిషనర్ ఎలాంటి ఉదంతాలను పొందుపరచలేదని చెప్పారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి.. విచారణను బుధవారానికి వాయిదా వేశారు. ప్రత్యక్ష పరిచయాలతో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు.. పిటిషనర్ రామచంద్ర యాదవ్ తరఫు న్యాయవాది పీవీజీ ఉమేష్ వాదనలు వినిపిస్తూ.. అధికార పార్టీకి సహకరిస్తున్నారన్న ఆరోపణలతో వలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచుతూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఆ ఆదేశాల నుంచి తప్పించుకునేందుకు వలంటీర్లు ఇప్పుడు రాజీనామాలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్దిదారులతో వలంటీర్లు ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నారన్నారు. ఇప్పుడు రాజీనామాలు చేసి ఎన్నికల్లో లబ్దిదారులను అధికార పార్టీ వైపు తిప్పడానికి వారిని ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. అందువల్ల వలంటీర్ల రాజీనామాల విషయంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారు. మరి సెలబ్రిటీలు కూడా ప్రచారం చేస్తున్నారుగా.. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలపై న్యాయమూర్తి స్పందిస్తూ.. వలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేసి, ఆయా పార్టీల అభ్యర్థుల అవకాశాలను ప్రభావితం చేయడం సాధ్యమా? అని ప్రశ్నిం చారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఒకరు పెద్ద ధనవంతుడు, మరొకరు పేద వ్యక్తి అయి ఉంటే, ఆ పేద వ్యక్తి.. తాను ఎన్నికల్లో తలపడేందుకు సమాన అవకాశాలు కల్పించాలని ఎన్నికల సంఘాన్ని కోరగలడా? అని నిలదీశారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు సెలబ్రిటీలు కూడా ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ఊహల ఆధారంగా పిటిషనర్ ఈ పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. రాజీనామాలు చేశాక వలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు ఎక్కడా కూడా పిటిషన్లో పేర్కొనలేదన్నారు. వలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కారని, వరుసగా వారు మూడు రోజుల పాటు విధులకు హాజరు కాకుంటే వారిని విధుల నుంచి తొలగించవచ్చన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందజేసేందుకే వలంటీర్లను నియమించామని చెప్పారు. వారు కేవలం గౌరవ వేతనం మాత్రమే అందుకుంటున్నారని గుర్తు చేశారు. కొందరు తాము అధికారంలోకి వస్తే వలంటీర్లకు గౌరవ వేతనం పెంచుతామంటూ ఎన్నికల ప్రచారంలో వాగ్దానాలు చేస్తున్నారని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. ఈ రోజుల్లో ఐఏఎస్ అధికారులు కూడా తమ ఉద్యోగానికి రాజీనామా చేసి, నచ్చిన పార్టీల తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నారన్నారు. కాబట్టి రాజీనామా చేశాక ఎవరినీ నియంత్రించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. -
ప్రజలను వెధవలు అంటారా?
పెనమలూరు: ‘రాష్ట్ర ప్రజలను వెధవలు అని కించపరుస్తారా... ఇది మీ పెత్తందారి ఆలోచనలకు నిదర్శనం...’ అని టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం నేతలపై మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కృష్ణాజిల్లా గంగూరులోని తన కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం దెబ్బతీసిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అగ్రవర్ణ పేదలు అందరూ సీఎం వైఎస్ జగన్ వైపే ఉన్నారని, రాష్ట్రానికి మళ్లీ జగనన్న సీఎం అవుతారని అనేక సర్వేలు స్పష్టంచేశాయని చెప్పారు. దీంతో టీడీపీ దిక్కుతోచక అధికారం కోసం అడ్డదారులు తొక్కుతోందన్నారు. ఇందులో భాగంగా టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం రంగంలోకి వచ్చిందని, ప్రజలను డబ్బులతో ప్రలోభాలకు గురిచేయాలని ప్రయత్నిస్తోందన్నారు. ఈ ప్రయత్నంలో ‘డబ్బుతో ఓట్లు కొనవచ్చు... తెలుగు ప్రజలు వెధవలు...’ అంటూ టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం నేత కోమటి జయరాం చేసిన ప్రసంగాన్ని జోగి రమేష్ మీడియాకు చూపించారు. ఇక్కడే పుట్టి, ఇక్కడే చదివి, విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదించుకున్న తరువాత తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ మాట్లాడటం దారుణమని, ఇది పెత్తందారుల మనస్తత్వానికి నిదర్శమని మండిపడ్డారు. కోమటి జయరాం, టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం నేతలపై ఎన్నికల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. ఎన్ఆర్ఐలు చంద్రబాబును నమ్మి రాజకీయాల్లో తలదూర్చి అక్రమాలకు పాల్పడితే నట్టేట ముంచుతాడని జోగి రమేష్ హెచ్చరించారు. ఎన్ఆర్ఐలు డబ్బు సంచులతో గ్రామాల్లోకి వచ్చి ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తే జనం తరిమికొడతారని, దొంగ ఓట్లు వేయటానికి ప్రయత్నిస్తే జైలుకు వెళతారని స్పష్టంచేశారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో ఓడిపోయి హైదరాబాద్‌కు పలాయనం చిత్తగిస్తారని, ఇక ఆయన ఎన్ఆర్ఐలను ఎలా కాపాడుతారో ఆలోచించుకోవాలని సూచించారు. ఎన్ఆర్ఐలు తాము పుట్టి, పెరిగి, చదువుకున్న ప్రాంతానికి నిస్వార్థంగా సేవ చేయాలని, స్వార్థ రాజకీయాలకు దూరంగా ఉండాలని కోరారు. పేదలకు మేలు చేస్తున్న సీఎం జగన్‌కు ఎన్ఆర్ఐలు మద్దతు తెలిపితే ప్రజలందరికి మరింత మంచి జరుగుతుందని చెప్పారు. -
పైసా ఖర్చు లేకుండా ప్రపంచ స్థాయి నైపుణ్యాలు
సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే అత్యుత్తమ, నాణ్యమైన విద్యను అందించడం.. విద్యార్థులు ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా ఆన్లైన్ కోర్సులు అందించడంలో ప్రపంచంలోనే దిగ్గజ ఎడ్యుటెక్ సంస్థ.. ఎడెక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఎడెక్స్ ద్వారా 260కిపైగా వరల్డ్ క్లాస్ వర్సిటీలు, కంటెంట్ పార్టనర్స్‌తో కలిసి 2వేలకు పైగా కోర్సులను ఉచితంగా అందుబాటులోకి తెచి్చంది. దీంతో పైసా ఖర్చు లేకుండా వీటిని అభ్యసిస్తున్న విద్యార్థులు సర్టీఫికేషన్ల సాధనలో రికార్డులు సృష్టిస్తున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ‘ఎడెక్స్’ కోర్సులు ప్రారంభించిన నెల రోజుల్లోనే ఏకంగా 1,03,956 సర్టీఫికేషన్లు సాధించి సత్తా చాటారు. దీంతో ఎడెక్స్ చరిత్రలోనే ఏపీ అతిపెద్ద సర్టిఫికేషన్ హబ్‌గా ఆవిర్భవించింది. ఏటా ప్రపంచవ్యాప్తంగా ఎడెక్స్ కేవలం 5 లక్షల సర్టీఫికేషన్లు మాత్రమే అందిస్తోంది. కానీ, రాష్ట్ర విద్యార్థులకు ఏడాదికి 12లక్షల సర్టీఫికేషన్లు ఇచ్చేలా ప్రభుత్వం ఎడెక్స్‌తో ఒప్పందం చేసుకోవడం విశేషం. 1,469 కోర్సుల్లో సర్టీఫికేషన్లు.. ఎడెక్స్ ద్వారా కోర్సులు అందిస్తున్నవాటిలో హార్వర్డ్, ఎంఐటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కొలంబియా, న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఉన్నాయి. రాష్ట్ర విద్యార్థులు 100 ప్రపంచ స్థాయి వర్సిటీల నుంచి 1,469 రకాల కోర్సుల్లో లక్షకుపైగా సర్టీఫికేషన్లు సాధించారు. ఎంఐటీ 320, హార్వర్డ్ 1,560, గూగుల్ 410, ఐబీఎం 33,700, ఏడబ్ల్యూఎస్ 770, ఏఆర్ఎం 6,400, కొలంబియా వర్సిటీ 100, ఐఐఎం బెంగళూరు 1,957, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ 170, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ 700, స్టాన్‌ఫర్డ్ 2,200, ఫుల్ బ్రిడ్జి (హార్వర్డ్, ఎంఐటీ సంయుక్తంగా అందిస్తున్న కోర్సులు)ద్వారా 13,500 సర్టిఫికేషన్లు పొందారు. ఉన్నత విద్యా మండలి ఒక ఎడెక్స్ కోర్సును తప్పనిసరి సబ్జెక్టుగా చదివేలా కరిక్యులంలో చేర్చింది. వీటికితోడు విద్యారి్థకి నచి్చనన్ని ఎడెక్స్ కోర్సులను వ్యాల్యూ యాడెడ్‌గా చదువుకోవడానికి వీలు కలి్పస్తోంది. సులభంగా ప్రవేశాలు.. ఎడెక్స్ ద్వారా మైక్రో మాస్టర్స్ కోర్సులో 7 వేల మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. దీన్ని పూర్తి చేస్తే విదేశాల్లో ఎంఎస్‌లో చేరడం సులువవుతుంది. పైగా అక్కడికి వెళ్లాక సిలబస్‌లో ప్రస్తుతం ఎడెక్స్‌లో నేర్చుకున్న గ్రూప్ మాడ్యూల్స్‌ను మినహాయిస్తారు. తద్వారా విద్యారి్థకి ఎంఎస్‌లో చదవాల్సింది తగ్గడంతో పాటు సంబంధిత కోర్సుకు చెల్లించాల్సిన ఫీజు కూడా ఆదా అవుతుంది. రూ.382 కోట్లు వ్యయమయ్యే కోర్సులు ఉచితంగా.. ఇప్పటి వరకు 3 లక్షల మంది విద్యార్థులు, బోధన సిబ్బంది ఎడెక్స్ కోర్సులకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరందరూ ఎడెక్స్ అందించే 2 వేల కోర్సుల్లో ఒక్కో కోర్సు చొప్పున బయట చదువుకుంటే మార్కెట్ రేటు ప్రకారం ఏకంగా రూ.382 కోట్లు వ్యయమవుతుంది. ఇప్పటివరకు సుమారు 75వేల మందికిపైగా విద్యార్థులు ఆయా కోర్సులు పూర్తి చేసి 1,03,956 సర్టిఫికేషన్లు పొందారు. ఈ కోర్సుల మార్కెట్ విలువ రూ.115 కోట్ల వరకు ఉంది. ఇంత ఖరీదైన కోర్సులను విద్యార్థులపై నయాపైసా భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తోంది. మన వర్సిటీల్లోకి అంతర్జాతీయ స్థాయి విద్య అంతర్జాతీయ స్థాయి విద్యను మన వర్సిటీల్లోకి తేవాలన్నదే మా లక్ష్యం. అందుకే ఎడెక్స్‌తో ఒప్పందం చేసుకున్నాం. ప్రపంచంలో టాప్ 50లో ఉన్న 37 వర్సిటీలు ఇందులో కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఎడెక్స్ ద్వారా అంతర్జాతీయ కోర్సులు అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ ఒక్కటే. ప్రపంచంలో అత్యుత్తమ అధ్యాపకులతో మన విద్యార్థులకు బోధన అందిస్తున్నాం. – కె.హేమచంద్రారెడ్డి, చైర్మన్, ఉన్నత విద్యా మండలి 32 కోర్సుల్లో సర్టీఫికేషన్లు.. మాది మదనపల్లె. అమ్మా కూరగాయలు అమ్ముతూ, నాన్న ఆటో నడుపుతూ నన్ను, తమ్ముడిని చదివిస్తున్నారు. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన సాయంతో ఇంజనీరింగ్ చదువుతున్నా. నేను ఎడెక్స్ ద్వారా ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా సంస్థలు అందిస్తున్న 32 రకాల కోర్సులు పూర్తి చేశాను. డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఏఐ వంటి కోర్సుల్లో అడ్వాన్స్డ్ మెథడ్స్ నేర్చుకున్నాను. హార్వర్డ్, ఐబీఎం, గూగుల్ వంటి సంస్థల నుంచి సర్టీఫికేషన్లు పొందాను. ఈ కోర్సులు బయట చేయాలంటే వేల రూపాయలు పెట్టాలి. ఎడెక్స్ కోర్సులతో నాలాంటి పేద విద్యార్థులకు పెద్ద సంస్థల్లో మంచి ఉద్యోగాలు దక్కుతాయనే నమ్మకం ఉంది. – టి.మోక్షిత్ సాయి, బీటెక్ , శ్రీ వేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, చిత్తూరు కర్టీన్ వర్సిటీ నుంచి సర్టిఫికేషన్.. మాది నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం గోవిందిన్నె గ్రామం. అమ్మ చిరుద్యోగి. నాన్న కూలి పనులకు వెళ్తారు. మా అన్నను, నన్ను జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు ఆదుకున్నాయి. నేను నంద్యాలలో రాజీవ్‌గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాను. ఎడెక్స్‌లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ)లో మైక్రో మాస్టర్స్ గ్రూప్ కోర్సు చేశాను. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 182వ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాలోని కర్టీన్ వర్సిటీ నుంచి సర్టిఫికేషన్ సాధించాను. – దూలం చందు, బీటెక్ (ఈఈఈ) స్పెయిన్ వర్సిటీ నుంచి ఐవోటీ చేశా.. నేను ఉచితంగా ఎడెక్స్ ద్వారా ప్రపంచంలోనే అడ్వాన్స్డ్ కోర్సులు నేర్చుకుంటున్నా. స్పెయిన్‌కు చెందిన ‘వాలెన్సియా పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయం’ నుంచి ఐవోటీలో మైక్రో మాస్టర్స్ కోర్సు పూర్తి చేశాను. మరో రెండు కోర్సులను కూడా త్వరలో పూర్తి చేయబోతున్నా. సొంతంగా డబ్బులు ఖర్చుపెట్టి చదవలేని నాలాంటి వారందరికీ ఎడెక్స్ కోర్సులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. – అర్వా నాగ సుజిత, బీటెక్ (ఈఈఈ), రాజీవ్‌గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నంద్యాల
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Chekc 1234 off the field
Test article qid_23456x4
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 17 ఏళ్ల కెరీర్‌కు గుడ్ బై
ఎవరేశారో తెలుసుకోకుండా దోశలు తినేయడమేనా!!
స్టోయినిష్ అరుదైన రికార్డు.. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
విశ్వసనీయత లేని ప్రతిపక్షాన్ని తిరస్కరించాలి!
అభివృద్ధి బటన్ నొక్కిన సీఎం జగన్
దిక్కుతోచని కుటుంబం దిశ మారింది..!
సారా.. నారా అండతో దోపిడీకి C/O సీఎం రమేష్
ఛాంపియన్ దేశం
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019