Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

రైలు నుంచి జారిపడి మహిళ మృతి

Published Fri, Apr 19 2024 1:40 AM

గౌరి మృతదేహం  - Sakshi

గూడూరు రూరల్‌: నెల్లూరు నుంచి గూడూరు వైపు వచ్చే రైలు మార్గంలో గురువారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో రైల్వే స్టేషన్‌కు ఉత్తరం వైపున సుమారు 35 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని మహిళ ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృతి చెందినట్లు రైల్వే ఎస్‌ఐ కొండప్పనాయుడు తెలిపారు. మృతురాలి వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఈమేరకు గుర్తు తెలియని మహిళగా కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

మహిళ అనుమానాస్పద మృతి

శ్రీకాళహస్తి : ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన పట్టణంలోని ముత్యాలమ్మగుడి వీధిలో గురువారం చోటుచేసుకుంది. ఒకటవ పట్టణ సీఐ నరసింహారావు అందించిన వివరాల మేరకు.. శ్రీకాళహస్తి మండలం, టీఎంవీ కండ్రిగకు చెందిన వెంకటేష్‌రెడ్డి, వాణి దంపతుల కుమార్తె గౌరి(28)ని పట్టణంలోని ముత్యాలమ్మ గుడివీధికి చెందిన పురం అనిల్‌కుమార్‌కు ఇచ్చి 2019లో వివాహం జరిపించారు. అనిల్‌కుమార్‌ పట్టణంలో ఓ ఎలక్ట్రానిక్‌ దుకాణం నడుపుతున్నాడు. ఈ దంపతులకు భరత్‌(7), హర్షవర్దన్‌(5) ఇద్దరు పిల్లలు ఉన్నారు. గురువారం మధ్యాహ్నం షాపు నుంచి ఇంటికి వెళ్లి చూడగా గౌరి ఇంట్లో ఉరివేసుకుని ఉన్నట్లు అనిల్‌కుమార్‌ చెబుతుండగా.. మృతురాలు గౌరి తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తె మృతిపట్ల అనుమానం ఉందని అంటున్నారు. దీంతో గౌరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.

పూరిల్లు దగ్ధం

వాకాడు : వాకాడు ముస్లిం కాలనీలో గురువారం పూరిల్లు దగ్ధమైంది. స్థానికుల కథనం.. గ్రామంలో ఎస్‌కే అల్లాబాషా నివాసం ఉంటున్నాడు. ఆయన శుక్రవారం పనిమీద బయటికి వెళ్లాడు. ఈ క్రమంలో ఏమి జరిగిందో కానీ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చుట్టు పక్కల వారు గమనించి ఇంటి యజమానికి తెలియజేసి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అనంతరం కోట అగ్నిమాపకశాఖ సిబ్బంది అక్క డి కి చేరుకుని మంటలను ఆర్పేశారు. సుమారు రూ. 50 వేల వరకు ఆస్తి నష్టం జరిగిందని స్థానికులు తెలిపారు.

మృతిచెందిన గుర్తు తెలియని మహిళ
1/1

మృతిచెందిన గుర్తు తెలియని మహిళ

Advertisement

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250