Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

ఎల్‌ఈడీ వెలుగులేవి?

Published Fri, Apr 19 2024 1:25 AM

అర్వయ్యపల్లి గ్రామంలో వెలగని 
ఎల్‌ఈడీ వీధి లైట్లు - Sakshi

నల్లబెల్లి : గ్రామాల్లో ఉపయోగిస్తున్న వీధిలైట్లతో విద్యుత్‌ బిల్లులు భారీగా రావడం.. నిర్వహణ కష్టమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విద్యుత్‌ పొదుపు, నిర్వహణ వ్యయం తగ్గేలా వీధిలైట్లను నిర్వహిస్తామని ముందుకొచ్చిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎల్‌) గుర్తింపు సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు గ్రామ పంచాయతీల్లో ఏడేళ్లపాటు ఎల్‌ఈడీ లైట్ల సరఫరా, ఏర్పాటు, నిర్వహణ వ్యవహారాలను ఈ సంస్థ చూడాల్సి ఉంది. ప్రజాప్రతినిధుల పట్టింపు, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పంచాయతీల్లో ఎల్‌ఈడీ లైట్ల నిర్వహణను సంస్థ గాలికొదిలేసింది. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి బిగించిన లైట్లను మరమ్మతు చేయడం లేదు. పనిచేయని లైట్‌ స్థానంలో మరో లైట్‌ ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఇవేమీ పట్టనట్లుగానే వ్యవహరిస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఒప్పందాన్ని విస్మరించిన ఈఈఎస్‌ఎల్‌

ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎల్‌) సంస్థ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు ఏడాదిన్నర క్రితం గ్రామ పంచాయతీలకు ఎల్‌ఈడీ లైట్ల వెలుగులు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. జిల్లాలో 323 గ్రామ పంచాయతీలు ఉండగా.. 319 గ్రామ పంచాయతీల్లో 56 వేల ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేసింది. లైట్ల బిగింపుతోపాటు నిర్వహణ, ఇంధన పొదుపు సాంకేతికతలో భాగంగా టైమర్ల ఏర్పాటు వ్యవస్థను సంస్థ ఏడేళ్లపాటు చూసుకోవాల్సి ఉంది. కానీ, నిర్వహణ బాధ్యతలను ఈఈఎస్‌ఎల్‌ విస్మరించింది. ఫలితంగా సుమారు ఐదు నెలలుగా పలు గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. ఇక గ్రామ పంచాయతీల్లో ఎల్‌ఈడీ కాంతులు వెదజల్లుతాయని అనుకున్న ప్రజల ఆశలు అడియాసలయ్యాయి. లైట్ల నిర్వహణ చేపట్టాలని మండలస్థాయి అధికారులు ఆ సంస్థ ప్రతినిధులను ఎన్నిమార్లు అడిగినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే చెబుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత ఉన్నతాధికారులు సంస్థపై తగు చర్యలు తీసుకొని గ్రామాల్లో ఎల్‌ఈడీ లైట్లు వెలిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

పల్లెల్లో నిర్వహణ బాధ్యతలను

విస్మరించిన ఈఈఎస్‌ఎల్‌

ఐదు నెలలుగా అంధకారం..

కొరవడిన అధికారుల పర్యవేక్షణ

జిల్లాలో 323 గ్రామాలు..

319 జీపీల్లో 56 వేల లైట్లు

సంస్థ పట్టించుకోవడం లేదు..

నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో గ్రామాల్లో కొన్ని నెలలుగా ఎల్‌ఈడీ లైట్లు వెలగడంలేదు. మరమ్మతులు చేయాలని పలుమార్లు సంబంధిత సంస్థ ప్రతినిధులకు చెప్పినా పట్టించుకోవడంలేదు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాం. గ్రామాల్లో రాత్రి వేళ ఎల్‌ఈడీ వీధిలైట్లు వెలుగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా మరమ్మతులు చేపట్టి ఎల్‌ఈడీ వెలుగులు అందించాలి.

– కూచన ప్రకాశ్‌,

మండల పంచాయతీ అధికారి, నల్లబెల్లి

చర్యలు తీసుకుంటాం..

గ్రామాల్లో ఎల్‌ఈడీ వీధిలైట్లు వెలగడం లేదని మా దృష్టికి వచ్చింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. నిర్వహణ పనులు సక్రమంగా జరిగేలా పర్యవేక్షిస్తాం. గ్రామాల్లో రాత్రి సమయాల్లో నిరంతరాయంగా ఎల్‌ఈడీ వీధి లైట్లు వెలిగేలా చూస్తాం.

– కటకం కల్పన, జిల్లా పంచాయతీ అధికారి

1/2

2/2

Advertisement

Copy Button

 

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250