Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత

Published Tue, Apr 16 2024 6:16 PM

Encounter In Chattisgarh Maoist Top Leder Killed - Sakshi

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం(ఏప్రిల్‌16) భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. కాంకేర్‌ జిల్లా మాడ్‌లో మావోయిస్టులకు, బీఎస్‌ఎఫ్‌ జవాన్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు జిల్లా సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్పీ) కళ్యాణ్‌ ఎల్లిసెల తెలిపారు.

చొట్టేబెటియా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బినాగుండ-కోరగుట్ట జంగిల్స్ సమీపంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య తొలుత ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయన్నారు. ఎదురు కాల్పుల తర్వాత జరిగిన సోదాల్లో నాలుగు ఏకే 47 తుపాకులు, మూడు మెషీన్‌ గన్లు సహా మావోయిస్టులకు చెందిన ఆయుధాలను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చెప్పారు.

కాల్పుల్లో మృతి చెందిన వారిలో మావోయిస్టు అగ్రనేత శంకర్‌రావు ఉన్నారు. ఈయన మీద రూ.25 లక్షల రివార్డు ఉంది. ఎదురు కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఎన్‌కౌంటర్‌ కొనసాగుతున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. 

ఇప్పటికే ఎన్‌కౌంటర్‌ ప్రదేశం నుంచి 29 మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఆపరేషన్‌ను బీఎస్‌ఎఫ్‌ జవాన్లు, డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డు(డీఆర్‌జీ) పోలీసులు సంయుక్తంగా చేపట్టారు.  

Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250