breaking news
-
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. 29 మంది మావోయిస్టుల మృతి
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం(ఏప్రిల్16) భారీ ఎన్కౌంటర్ జరిగింది. కాంకేర్ జిల్లా మాడ్‌లో మావోయిస్టులకు, బీఎస్ఎఫ్ జవాన్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) కళ్యాణ్ ఎల్లిసెల తెలిపారు. చొట్టేబెటియా పోలీస్‌స్టేషన్ పరిధిలోని బినాగుండ-కోరగుట్ట జంగిల్స్ సమీపంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య తొలుత ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయన్నారు. ఎదురు కాల్పుల తర్వాత జరిగిన సోదాల్లో నాలుగు ఏకే 47 తుపాకులు, మూడు మెషీన్ గన్లు సహా మావోయిస్టులకు చెందిన ఆయుధాలను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చెప్పారు. కాల్పుల్లో మృతి చెందిన వారిలో మావోయిస్టు అగ్రనేత శంకర్రావు ఉన్నారు. ఈయన మీద రూ.25 లక్షల రివార్డు ఉంది. ఎదురు కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇప్పటికే ఎన్కౌంటర్ ప్రదేశం నుంచి 29 మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఆపరేషన్‌ను బీఎస్ఎఫ్ జవాన్లు, డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డు(డీఆర్జీ) పోలీసులు సంయుక్తంగా చేపట్టారు. -
కెనడాలో కాల్పులు
ఒట్టావా: విదేశాల్లో భారతీయ విద్యార్థుల మరణాల ఘటనలు ఆగట్లేవు. తాజాగా కెనడాలో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో 24 ఏళ్ల భారతీయ విద్యార్థి చిరాగ్ అంటిల్ ప్రాణాలు కోల్పోయారు. వాంకోవర్ సిటీ పరిధిలో 12వ తేన రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. వాంకోవర్ సిటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రెండేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం హరియాణాలోని సోనిపట్ నుంచి చిరాగ్ కెనడాకు వచ్చారు. విద్యార్థి వీసా మీద కెనడాకు వచ్చి ఎంబీఏ చేసి ఇక్కడే తాత్కాలిక ఉద్యోగంలో చేరారు. ఏప్రిల్ 12వ తేదీన చిరాగ్ తన కారులో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. తుపాకీ కాల్పుల శబ్దం విని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేసరికి చిరాగ్ తన కారులో విగతజీవిగా పడి ఉన్నారు. ఈ ఘటనలో ఇంకా ఎవరినీ అరెస్ట్‌చేయలేదు. చిరాగ్ మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు భారత సర్కార్ సాయపడాలంటూ చిరాగ్ కుటుంబం ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్‌కు విజ్ఞప్తిచేసింది. -
స్కూలు బస్సు బోల్తా... ఎనిమిదిమంది చిన్నారులు దుర్మరణం!
హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిదిమంది చిన్నారులు మృతిచెందారు. ఈ ఘటనలో మరో 20 మంది చిన్నారులు గాయపడ్డారు. ఈరోజు(గురువారం) ఉదయం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. కనీనా పట్టణం సమీపంలోని కనీనా- దాద్రి రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడిన చిన్నారులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన చిన్నారుల కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. బస్సు అతి వేగంతో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికంగా కలకలం చెలరేగింది. పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ బస్సు కనీనాలోని జిఎల్ పబ్లిక్ స్కూల్‌కు చెందినది. విద్యార్థులతో వెళుతున్న ఈ బస్సు ఉన్హాని గ్రామ సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిదిమంది విద్యార్థులు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థులను రోహ్తక్ పీజీఐకి తరలించారు. ఈద్ పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉన్నప్పటికీ, పలు ప్రైవేట్ పాఠశాలలను తెరిచారు. ఇదే కోవలో జీఎల్ పబ్లిక్ స్కూల్‌కు కూడా సెలవు ఇవ్వలేదు. డ్రైవర్ మద్యం మత్తులో బస్సు నడుపుతున్నట్లు సమాచారం. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల నిమిత్తం మహేంద్రగఢ్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఇప్పటి వరకు పాఠశాల యాజమాన్యం నుంచి ఈ ఘటనపై ఎలాంటి ప్రకటన రాలేదు. -
UP Encounter: పక్కా ప్లాన్ ప్రకారమే హత్యలు.. హంతకుడి ఎన్కౌంటర్
ఉత్తరప్రదేశ్‌లోని సంచలనం సృష్టించిన బుదౌన్ చిన్నారుల హత్య కేసులో విస్తుపోయే విషయం ఒకటి వెలుగు చూసింది. అప్పు పేరిట ఓ ఇంట్లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి ఇద్దరు చిన్నారుల్ని కిరాతకంగా చంపేయగా.. ఆపై జరిగిన ఎన్కౌంటర్లో ఒక నిందితుడు హతమయ్యాడు. అయితే పాత కక్షలతోనే నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్ధారించారు. చిన్నారుల హత్య నేపధ్యంలో బుదౌన్ నగరంలో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులు పలు చోట్ల నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న బుదౌన్ డీఎం మనోజ్ కుమార్, బరేలీ ఐజీ డాక్టర్ రాకేష్ సింగ్ సహా ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబా కాలనీలోని ఒక ఇంటిలోకి ప్రవేశించిన ఒక వ్యక్తి అక్కడ ఆడుకుంటున్న చిన్నారులు ఆయుష్, యువరాజ్, అహాన్ అలియాస్ హనీలపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆయుష్ (12), అహాన్ అలియాస్ హనీ(8) అక్కడికక్కడే మృతి చెందారు. దాడిలో తీవ్రంగా గాయపడిన మరో చిన్నారి యువరాజ్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన జరిగిన సమయంలో ఆ చిన్నారులు ఇంటి టెర్రస్‌పై ఆడుకుంటున్నారని బరేలీ ఐజీ డాక్టర్ రాకేష్ సింగ్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, నిందితుడిని వెంబడించారు. అయితే నిందితుడు పోలీసులపై కాల్పులు జరిపాడు. పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరపడంతో నిందితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఎన్కౌంటర్లో హతమైన నిందితుని వయస్సు 25 నుంచి 30 ఏళ్లు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. కాగా ఇద్దరు పిల్లల హత్య నేపధ్యంలో బుదౌన్‌లో ఉద్రిక్తత నెలకొంది. కోపోద్రిక్తులైన జనం పలుచోట్ల బీభత్సం సృష్టించి నిప్పు పెట్టారు. ఒక దుకాణాన్ని, బైక్‌ను ధ్వంసం చేశారు. రోడ్డు పక్కన ఉన్న కొన్ని వాహనాలకు నిప్పంటించారు. ఘటన తీవ్రత దృష్ట్యా బదౌన్‌లో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. ఇద్దరు చిన్నారుల మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. చిన్నారుల హత్య వెనుక... పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బార్బర్ షాప్ నడుపుతున్న సాజిద్ అనే వ్యక్తి మంగళవారం సాయంత్రం ఎనిమిది గంటల సమయంలో తన దుకాణాన్ని మూసివేసి, ఎదురుగా ఉంటున్న వినోద్ ఇంటికి వెళ్లి, అతని భార్యను టీ కావాలని అడిగాడు. తరువాత సాజిద్.. టెర్రస్‌పై ఆడుకుంటున్న వినోద్ ముగ్గురు పిల్లలైన ఆయుష్, అహాన్, పీయూష్‌లపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. బాధితుడు వినోద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం సాజిద్ తమ ఇంటిలోనికి వచ్చి, ఐదువేల రూపాయలు కావాలని తన భార్యను డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని ఆమె ఫోన్లో తెలిపింది. తరువాత ఆమె టీ చేయడానికి వంటగదిలోకి వెళ్లింది. ఈలోపు సాజిద్.. వినోద్ పిల్లలపై దాడి చేశాడు. ఘటన అనంతరం నిందితుడు అతని స్నేహితుడు జావేద్‌తో కలిసి బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యాడు. సాజిద్ దాడిలో ఇద్దరుచిన్నారులు మృతి చెందారు. ఘటన తరువాత సాజిద్ పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించగా, పోలీసులపై కూడా దాడికి యత్నించాడు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపి, సాజిద్‌ను ఎన్కౌంటర్లో హతమార్చారు. దీనికి ముందు నిందితుడు జరిపిన కాల్పుల్లో సివిల్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ గౌరవ్ బిష్ణోయ్ గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సాజిద్‌కు వినోద్‌కు చాలాకాలంగా వైరం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఘోరానికి సాజిద్ పాల్పడి ఉంటాడని పోలీసులు అంచనాకి వచ్చారు. -
గడ్చిరోలి: మావోయిస్టులకు భారీ దెబ్బ
సాక్షి, గడ్చిరోలి: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మంగళవారం(మార్చి 19) తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్ట్ అగ్రనేతలు మృతి చెందారు. మిగిలిన మావోయిస్టుల కోసం పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. గడ్చిరోలిలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డప్పుడు కాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. చనిపోయిన వారంతా మావోయిస్టు అగ్రనేతలని.. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులని అధికారులు ధృవీకరించారు. మంచిర్యాల డివిజన్ కమిటీ సెక్రటరీ వర్గీస్, చెన్నూరు ఏరియా కమిటీ సెక్రటరీ మగ్తూ, కుర్సంగ్ రాజు, కుడిమెట్ట వెంకటేశ్ ఉన్నారు. ఇదిలా ఉంటే.. కాల్పుల్లో చనిపోయిన మావోయిస్టులపై రూ. 36 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా పోలీసులు భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఇదీ చదవండి.. ప్రాణం పోస్తారనుకుంటే తీశారు
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019