Sakshi News home page

5న కాగజ్‌నగర్‌కు అమిత్‌ షా

Published Tue, May 7 2024 1:45 PM

5న కాగజ్‌నగర్‌కు అమిత్‌ షా

కౌటాల/కాగజ్‌నగర్‌రూరల్‌: కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌ షా ఈ నెల 5న కాగజ్‌నగర్‌కు రానున్నారని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఉదయం 11.30 గంటలకు ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియెజకవర్గ పరిధిలోని కాగజ్‌నగర్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారని వివరించారు. ఎస్పీఎం గ్రౌండ్‌లో నిర్వహించే వికాస సంకల్ప సభలో ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్‌ తరుఫున ప్రసంగిస్తారని పేర్కొన్నారు. జిల్లాలోని బీజేపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.

Advertisement

homepage_300x250