Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

Fact Check: ఈసీలపైనా గుడ్డి రాతలేనా?

Published Fri, Mar 29 2024 5:14 AM

Ramoji who hides facts and tells lies - Sakshi

ఒక్క మార్చిలోనే జరిగిన రిజిస్ట్రేషన్లు 2.62లక్షలు 

రాష్ట్ర వ్యాప్తంగా జారీ అయిన ఈసీలు 1,53,035 

కానీ కబోదిలా ఈనాడులో తప్పుడు రాతలు 

వాస్తవాలను దాచిపెట్టి అబద్ధాలు అచ్చేస్తున్న రామోజీ 

సాక్షి, అమరావతి: ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో చూపి... అదే పనిగా రాష్ట్ర ప్రభుత్వంపైకి తప్పు నెట్టేయడం ఈనాడుకు... దానిని నడుపుతున్న రామోజీకి నిత్యకృత్యంగా మారింది. తాజాగా ఈసీల జారీలో ఎలాంటి ఇబ్బందులు లేకున్నా... అవి అందించలేకపోవడంతో రిజిస్ట్రేషన్లు అగిపోయాయంటూ ఓ అబద్ధాన్ని అందంగా అచ్చేశారు. కానీ వాస్తవానికి ఒకటి కాదు.. రెండు కాదు.. ఒక్క మార్చిలోనే రాష్ట్రంలో 2,62,807 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఆన్‌లైన్‌లో 1.26,123 ఉచితంగా, సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా 26,912 ఈసీలు జారీ అయ్యాయి. ఇక్కడ లక్షల్లో దస్తావేజుల రిజిస్ట్రేషన్లు, ఈసీల జారీ కనిపిస్తుంటే.. రాజగురువు రామోజీ మాత్రం కళ్లుండి ధృతరా్రషు్టడిలా మారిపోయారు.

రాజకీయంగా చతికిలపడిన తన పార్ట్‌నర్‌ చంద్రబాబు గ్రాఫ్‌ను పైకి లేపేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఈనాడులో నిత్యం అసత్య కథనాలు వండివారుస్తూ దిగజారిపోతున్నారు. దేశంలోనే రిజిస్ట్రేషన్ల విధానంలో ఏపీ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కార్డ్‌ ప్రైమ్‌ సాఫ్ట్‌వేర్‌ అమలులోకి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ల సేవలు మరింత సులభంగా, సురక్షితంగా సాగుతున్నాయి. ఇక్కడ ప్రభుత్వ సక్సెస్‌ను జీర్ణించుకోలేని రామోజీ ప్రైమ్‌ సాఫ్ట్‌వేర్‌ సమస్య కారణంగా పది రోజులుగా ఈసీలు నిలిచిపోయాయంటూ కుట్రపూరిత కథనాన్ని అల్లేశారు.అవాస్తవాలే అందులో వార్తలు రాష్ట్రంలో ఈసీల జారీ నిలిచిపోలేదు.

క్రయవిక్రయా­లు ఆగలేదు. రిజిస్ట్రేషన్లు నిరాటంకంగా కొనసా­గుతూనే ఉన్నాయి.  www.registration.­­ap.­gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఉచితంగా ఈసీలు అందుతున్నాయి. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల కౌంటర్ల ద్వారా ప్రజలు నిర్దేశిత దరఖాస్తు నింపి, నిర్ణీత రుసుము చెల్లింపులతో సబ్‌రిజిస్ట్రార్ ఈ–సైన్‌తో కూడిన ఈసీలను పొందుతున్నారు. మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు అందించేవారికి జారీ చేస్తున్న విధానం ప్రస్తుతం సాంకేతిక భద్రతా ప్రమాణాల ఆడిటింగ్‌ కారణంగా తాత్కాలికంగా నిలిచింది. మిగిలిన విధానాల్లో యథావిధిగా ఈసీల జారీ కొనసాగుతోంది.

కానీ, వాస్తవాలను పక్కన పెట్టి ఈనాడు యథావిధిగా అసత్యాలను అచ్చేసింది. సెక్యూరిటీ ఆడిట్‌ పూర్తయిన వెంటనే మీసేవ ద్వారా కూడా ఈసీల జారీ పునఃప్రారంభమవుతుంది. దీనితో పాటు రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌ ద్వారా 30వ తేదీ నుంచి డిజిటల్‌ సర్టిఫైడ్‌ ఈసీలు, డాక్యుమెంట్‌ సర్టిఫైడ్‌ కాపీలు ఆన్‌లైన్‌లో నిర్ణీత రుసుము చెల్లింపులతో పొందవచ్చు. కానీ కేవలం అబద్ధాలే అచ్చేసే ఈనాడు ఈ విషయంలోనూ జనాన్ని తప్పుదారి పట్టించేందుకు యరిజిస్ట్రార్స్తోంది.   

Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250