Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

విషాదం: స్కాట్లాండ్‌లో ఇద్దరు తెలుగు విద్యార్థుల దుర్మరణం

Published Fri, Apr 19 2024 11:44 AM

Two Telugu students found dead at popular hangout in Scotland - Sakshi

 స్కాట్లాండ్ లో నీట మునిగి మరణించిన ఇద్దరు భారతీయ విద్యార్థులు
 

విదేశాల్లో ఉన్నత చదువులకోసం వెళ్లిన  భారతీయ విద్యార్థుల  వరుస  మరణాలు తల్లిదండ్రులకు తీరని కడుపుశోకాన్ని మిగుల్చుతోంది.  తాజాగా స్కాట్లాండ్‌లో  ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. స్కాట్లాండ్‌లోని ఓ పర్యాటక ప్రదేశంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు ప్రమాదవశాత్తూ నీట మునిగి చనిపోయారు. బుధవారం సాయంత్రం జరిగిన దురదృష్టకర సంఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు మునిగిపోయారని వారి మృతదేహాలను  స్వాధీనం చేసుకున్నామని  లండన్‌లోని భారత హైకమిషన్ ప్రతినిధి వెల్లడించారు. వీరిని డూండీ యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తున్న చాణక్య బొలిశెట్టి (22), జితేంద్రనాథ్ కరుటూరి (27)గా గుర్తించారు.

వాటర్‌ఫాల్స్‌కు పాపులర్‌ అయిన లిన్ ఆఫ్ తుమ్మెల్ జలపాతం వద్ద వీరిద్దరూ దుర్మరణం పాలయ్యారు.  అత్యవసర సేవల ద్వారా ఇద్దరి మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. డూండీ యూనివర్సిటీలో చదువుతున్న నలుగురు స్నేహితులు ట్రెక్కింగ్ చేస్తుండగా, ప్రమాద వశాత్తూ  ఇద్దరు నీటిలో పడి మునిగిపోయారు.  దీంతో మిగిలిన ఇద్దరు విద్యార్థులు ఎమర్జెన్సీ సర్వీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక, అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టాయి. (అమెరికా : ఆ ఇద్దరు తప్పు చేశారా? చేతివాటమా?)

కాగా భారత కాన్సులేట్ జనరల్ విద్యార్థుల కుటుంబాలకు సమాచారం అందించింది వారికి తగిన సహాయాన్ని అందిస్తోంది.  అలాగే ఒక కాన్సులర్ అధికారి బ్రిటన్‌లో నివసిస్తున్న విద్యార్థి బంధువును కలిశారు. అటు డూండీ విశ్వవిద్యాలయం కూడా తగిన  సాయాన్ని  హామీ ఇచ్చింది. పోస్ట్‌మార్టం అనంతరం వారి మృతదేహాలను భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు  చేస్తున్నారు
 

Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250