Sakshi News home page

చెరువులో పడి యువకుడి మృతి

Published Sat, Apr 20 2024 1:15 AM

-

మాచారెడ్డి: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఏఎస్సై రామేశ్వర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గజ్జనాయక్‌ తండాకు చెందిన లక్ష్మణ్‌(36) గురువారం బహిర్భూమికని వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు పలు చోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. మండల కేంద్రంలోని ఊర చెరువులో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

ఆర్థిక ఇబ్బందులతో వివాహిత..

ఎడపల్లి: ఆర్థిక ఇబ్బందులతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని మంగళ్‌పాడ్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై వంశీచందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పోలెపల్లి ఇంద్రజ(48)కు ముగ్గురు సంతానం. వీరు ఇటీవల ఇంటి నిర్మాణం చేపట్టడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతక్రుదయం ఉపాధి హామీ పనులకు వెళ్లిన ఇంద్రజ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Advertisement

adsolute_video_ad

homepage_300x250