Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

Lok Sabha Elections 2024: హెలికాఫ్టర్‌లో బయలుదేరిన పోలింగ్ సిబ్బంది.. వీడియో వైరల్

Published Tue, Apr 16 2024 11:53 AM

Polling Team Went To Chhattisgarh in Helicopter For Lok Sabha Elections - Sakshi

బీజాపూర్: సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. జాతీయ పార్టీలు మాత్రమే కాకుండా.. ప్రాంతీయ పార్టీలు సైతం విజయమే ప్రధానంగా ప్రచారం సాగిస్తున్నాయి. ఈ తరుణంలో ఎలక్షన్ కమిషన్ కూడా ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి సన్నద్ధమైంది.

దేశం మొత్తం మీద ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. ప్రారంభంలో మొదటి దశలో చత్తీస్‌ఘడ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న జరగనున్న తొలి దశ ఎన్నికల కోసం పోలింగ్ సిబ్బంది హెలికాఫ్టర్లలో పయనమయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్ అవితున్నాయి.

లోక్‌సభ ఎన్నికలకు ముందు, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలకు MI-17 ఛాపర్లను ఉపయోగించి పోలింగ్ బృందాలు బయలుదేరాయి. శాంతియుతంగా ఓటింగ్ ప్రక్రియ నిర్వహించి ఎన్నికల అధికారులకు, ఓటర్లకు సురక్షితమైన వాతావరణం కల్పిస్తామని బీజాపూర్ కలెక్టర్ అనురాగ్ పాండే, ఎస్పీ జితేంద్ర యాదవ్ హామీ ఇచ్చారు.

ఎన్నికలు జరగటానికి మూడు రోజులు ముందుగానే పోలింగ్ సిబ్బందిని.. పోలింగ్ జరిగే ప్రాంతాలకు పంపడం ప్రారంభిస్తామని బీజాపూర్ కలెక్టర్ అనురాగ్ పాండే పేర్కొన్నారు. ఇవన్నీ ఎలక్షన్ కమీషన్ ఆదేశాల మెడకు జరుగుతాయని ఆయన అన్నారు. నేటి నుంచి పోలింగ్ అధికారులు వివిధ ప్రాంతాలకు బయలుదేరుతారు.. ఎన్నికల అధికారులందరికీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (EVM), అవసరమైన అన్ని పరికరాలను సంబంధిత అధికారులకు అందించారు.

చ‌త్తీస్‌ఘ‌ఢ్‌లో మొత్తం 11 లోక్‌స‌భ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ పోలింగ్ మొత్తం మూడు ద‌శ‌ల్లో నిర్వ‌హించ‌నున్నారు. అయితే ఏప్రిల్ 19వ తేదీన కొన్ని ప్రాంతాల్లో మాత్ర‌మే ఎన్నికలు జరగున్నాయి. రెండు, మూడో దశల్లో మిగిలిన నియోజక వర్గాల్లో జరుగుతాయి.

Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250