breaking news
-
లోక్‌సభ ఎలక్షన్స్ 2024: మొదటి దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
ఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికలు మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 19న (శుక్రవారం) ప్రారంభం కానున్న లోక్‌సభ ఎలక్షన్స్ 21 రాష్ట్రాల్లో మొత్తం 102 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో మొదటి దశ పోలింగ్ జరగనుంది. ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకారం లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో (ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు) జరగనున్నాయి. జూన్ 4న వెలువడే ఫలితాలు దేశ ప్రధానిని నిర్ణయిస్తాయి. ఏప్రిల్ 19న ఓటింగ్ జరిగే నియోజకవర్గాల రాష్ట్రాల వారీగా జాబితా: అరుణాచల్ ప్రదేశ్ 1. అరుణాచల్ వెస్ట్ 2. అరుణాచల్ తూర్పు అస్సాం 1. కాజిరంగ 2. సోనిత్పూర్ 3. లఖింపూర్ 4. దిబ్రూగర్ 5. జోర్హాట్ బీహార్ 1. ఔరంగాబాద్ 2. గయా 3. 39 నవాడ 4. జాముయి ఛత్తీస్‌గఢ్ 1. బస్తర్ మధ్యప్రదేశ్ 1. సిద్ధి 2. 12 షాహదోల్ 3. 13 జబల్పూర్ 4. 14 మండల 5. 15 బాలాఘాట్ 6. చింద్వారా మహారాష్ట్ర 1. రామ్‌టెక్ 2. నాగ్‌పూర్ 3. భండారా - గోండియా 4. గడ్చిరోలి - చిమూర్ 5. చంద్రపూర్ మణిపూర్ 1. ఇన్నర్ మణిపూర్ 2. ఔటర్ మణిపూర్ మేఘాలయ 1. షిల్లాంగ్ 2. తురా మిజోరం 1.మిజోరం నాగాలాండ్ 1. నాగాలాండ్ రాజస్థాన్ 1. గంగానగర్ 2. బికనీర్ 3. చురు 4. ఝుంఝును 5. సికర్ 6. జైపూర్ రూరల్ 7. జైపూర్ 8. అల్వార్ 9. భరత్పూర్ 10. కరౌలి-ధోల్పూర్ 11. దౌసా 12. నాగౌర్ సిక్కిం 1. సిక్కిం తమిళనాడు 1. తిరువళ్లూరు 2. చెన్నై నార్త్ 3. చెన్నై సౌత్ 4. చెన్నై సెంట్రల్ 5. శ్రీపెరంబుదూర్ 6. కాంచీపురం 7. అరక్కోణం 8. వెల్లూరు 9. కృష్ణగిరి 10. ధర్మపురి 11. తిరువణ్ణామలై 12. అరణి 13. విలుప్పురం 14. కళ్లకురిచ్చి 15. సేలం 16. నమక్కల్ 17. ఈరోడ్ 18. తిరుప్పూర్ 19. నీలగిరి 20. కోయంబత్తూరు 21. పొల్లాచ్చి 22. దిండిగల్ 23. కరూర్ 24. తిరుచిరాపల్లి 25. పెరంబలూరు 26. కడలూరు 27. చిదంబరం 28. మయిలాడుతురై 29. నాగపట్టణం 30. తంజావూరు 31. శివగంగ 32. మధురై 33. తేని 34. విరుదునగర్ 35. రామనాథపురం 36. తూత్తుక్కుడి 37. తెన్కాసి 38. తిరునెల్వేలి 39. కన్నియాకుమారి త్రిపుర 1. త్రిపుర వెస్ట్ ఉత్తరప్రదేశ్ 1. సహరన్పూర్ 2. కైరానా 3. ముజఫర్‌నగర్ 4. బిజ్నోర్ 5. నగీనా 6. మొరాదాబాద్ 7. రాంపూర్ 8. పిలిభిత్ ఉత్తరాఖండ్ 1. తెహ్రీ గర్వాల్ 2. గర్వాల్ 3. అల్మోరా 4. నైనిటాల్-ఉధంసింగ్ నగర్ 5. హార్డ్వార్ పశ్చిమ బెంగాల్ 1. కూచ్‌బెహర్ 2. అలీపుర్దువార్స్ 3. జల్పాయ్ గురి అండమాన్ అండ్ నికోబార్ 1.అండమాన్ అండ్ నికోబార్ దీవులు జమ్మూ అండ్ కాశ్మీర్ 1. ఉదంపూర్ లక్షద్వీప్ 1. లక్షద్వీప్ పుదుచ్చేరి 1. పుదుచ్చేరి -
నేటి నుంచే నామినేషన్ల పర్వం
-
నాలుగో విడత లోక్‌సభ ఎన్నికలకు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ జారీ.. ప్రారంభం కానున్న నామినేషన్ల ప్రక్రియ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ప్రధాని మోదీ సినిమా ఫ్లాప్.. కల్యాణ్ బెనర్జీ విమర్శలు
కోల్‌కతా: ప్రధాని నరేంద్ర మోదీ తన పదేళ్ల పాలనను ట్రైలర్ అంటున్నారని కానీ సినిమా అంతా ఫ్లాప్ అయిందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఎద్దేవా చేశారు. ప్రజలకు హామీలు ఇచ్చి.. నెరవేర్చకుండా కేవలం అబద్ధాలు చెప్పే వ్యక్తి ప్రధాని మోదీ అని మండిపడ్డారు. కల్యాణ్ బెనర్జీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ‘బేటీ బచావో, బేటీ పడావో ప్రచారంలో భాగంగా వేల కోట్ల రూపాయల నిధులను కేంద్ర కేటాయిస్తుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ప్రచారం పేరుతో ఎక్కడెక్కడ ఎంత ఖర్చు చేశారో మాకు జాబితా అందించండి. 2014 నుంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెబుతున్నారు. గత పదేళ్ల పాలనలో ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి. మోదీ అబద్ధాలు చెప్పే వ్యక్తి. ఆయన ఒక నకిలీ నటుడు. ప్రజలు నకిలీ నటుడు మోదీకి, బీజేపీ ఓటు వేయొద్దు. ప్రధాని మోదీ ట్రైలర్లో ఫెయిల్ అయ్యారు. సినిమా కూడా సక్సెస్ కాబోదు. మోదీ ఇక గుజరాత్ వెళ్లిపోతారు. మార్కెట్లో మోదీ సినిమా ఎక్కవ కాలం పని చేయదు. విదేశాలకు వెళ్లి కరచాలనాలు చేసే నకిలీ నటుడికి ప్రజలు అస్సలు ఓటువేయొద్దు’ అని ఎంపీ కల్యాణ్ బెనర్జీ అన్నారు. ఇక.. జనవరిలో జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భారీగా ఎంపీలను సస్పెండ్ చేసిన విషయంలో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మణ్ జగదీప్ ధన్‌ఖడ్ తీరును ఎంపీ కల్యాణ్ బెనర్జీ అనుకరించి వివాదాస్పదమైన విషయం తెలిసిందే. -
హెలికాఫ్టర్‌లో బయలుదేరిన పోలింగ్ సిబ్బంది.. వీడియో వైరల్
బీజాపూర్: సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. జాతీయ పార్టీలు మాత్రమే కాకుండా.. ప్రాంతీయ పార్టీలు సైతం విజయమే ప్రధానంగా ప్రచారం సాగిస్తున్నాయి. ఈ తరుణంలో ఎలక్షన్ కమిషన్ కూడా ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి సన్నద్ధమైంది. దేశం మొత్తం మీద ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. ప్రారంభంలో మొదటి దశలో చత్తీస్‌ఘడ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న జరగనున్న తొలి దశ ఎన్నికల కోసం పోలింగ్ సిబ్బంది హెలికాఫ్టర్లలో పయనమయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్ అవితున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలకు MI-17 ఛాపర్లను ఉపయోగించి పోలింగ్ బృందాలు బయలుదేరాయి. శాంతియుతంగా ఓటింగ్ ప్రక్రియ నిర్వహించి ఎన్నికల అధికారులకు, ఓటర్లకు సురక్షితమైన వాతావరణం కల్పిస్తామని బీజాపూర్ కలెక్టర్ అనురాగ్ పాండే, ఎస్పీ జితేంద్ర యాదవ్ హామీ ఇచ్చారు. ఎన్నికలు జరగటానికి మూడు రోజులు ముందుగానే పోలింగ్ సిబ్బందిని.. పోలింగ్ జరిగే ప్రాంతాలకు పంపడం ప్రారంభిస్తామని బీజాపూర్ కలెక్టర్ అనురాగ్ పాండే పేర్కొన్నారు. ఇవన్నీ ఎలక్షన్ కమీషన్ ఆదేశాల మెడకు జరుగుతాయని ఆయన అన్నారు. నేటి నుంచి పోలింగ్ అధికారులు వివిధ ప్రాంతాలకు బయలుదేరుతారు.. ఎన్నికల అధికారులందరికీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (EVM), అవసరమైన అన్ని పరికరాలను సంబంధిత అధికారులకు అందించారు. చత్తీస్ఘఢ్లో మొత్తం 11 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ పోలింగ్ మొత్తం మూడు దశల్లో నిర్వహించనున్నారు. అయితే ఏప్రిల్ 19వ తేదీన కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఎన్నికలు జరగున్నాయి. రెండు, మూడో దశల్లో మిగిలిన నియోజక వర్గాల్లో జరుగుతాయి. #WATCH | Chhattisgarh: Ahead of Lok Sabha elections, polling teams leave by helicopter to Naxal-hit areas, in Narayanpur 11 Lok Sabha seats in Chhattisgarh will go to polls in three phases on April 19, April 26 and May 7. Bastar will be the only seat to go to polls in the first… pic.twitter.com/bxQYMuwbVx — ANI (@ANI) April 16, 2024
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019