breaking news
-
ఆమే కీలకం
సాక్షి,అమరావతి: వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో మహిళలే నిర్ణయాత్మక శక్తిగా అవతరించనున్నారని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, గోవా, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌లో కూడా మహిళలదే ప్రధాన భూమిక అని నివేదిక వెల్లడించింది. గత దశాబ్ద కాలంగా మహిళా ఓటర్లు ఎలా నిర్ణయాత్మకంగా మారుతున్నారనే అంశంపై ఎస్బీఐ పరిశోధన నివేదికను విడుదల చేసింది. దేశంలో ప్రస్తుత సాధారణ ఎన్నికలతో పాటు రాబోయే ఎన్నికల్లో మహిళా ఓటర్ల పాత్ర గణనీయంగా పెరుగుతుందని అంచనా వేసింది. ప్రస్తుత ఎన్నికల్లో కేరళ, గోవా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని, భవిష్యత్ ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లో మహిళా ఓటర్ల సంఖ్య ఇంకా పెరుగుతుందని నివేదిక వెల్లడించింది. భవిష్యత్ ఎన్నికల్లో తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్, కర్నాటక, సిక్కిం రాష్ట్రాల్లో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్ల సంఖ్య పెరిగి ఫలితాలను నిర్ణయిస్తారని నివేదిక పేర్కొంది. మహిళా ఓటర్లలో చైతన్యం ఆంధ్రప్రదేశ్‌లో 2014 ఎన్నికల్లో 83 లక్షల మంది మహిళలు పోలింగ్ కేంద్రాలకు రాలేదని, 2019 ఎన్నికల్లో మాత్రం పోలింగ్ కేంద్రాలకు రాని మహిళా ఓటర్ల సంఖ్య ఏకంగా 41 లక్షలకు తగ్గిపోయిందని, మహిళలు ఓటింగ్‌లో ఎక్కువ మంది పాల్గొంటున్నారనడానికి ఇదే సంకేతమని స్పష్టం చేసింది. గతంలో కంటే ప్రస్తుత ఎన్నికల్లో మహిళా ఓటర్లు ఎక్కువ మంది ఓటింగ్‌లో పాల్గొంటారని, తద్వారా ఫలితాలు గణనీయంగా మారిపోతాయని అంచనా వేసింది. దేశంలో వివిధ రాష్ట్రాల్లో జెండర్ రేషియో పెరుగుతోందని, లోక్‌సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్ల పాత్ర గణనీయంగా పెరుగుతోందని నివేదిక తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత ఎన్నికల్లో పురుష, మహిళ ఓటర్ల రేషియో 1:1.02 ఉండగా భవిష్యత్‌లో 1:1.06కు పెరుగుతుందని వెల్లడించింది. గత ఓటింగ్ శాతాలు, మార్పులను విశ్లేíÙంచడం ద్వారా 2024లో పోలింగ్ 68 కోట్లకు చేరుతుందని, ఇందులో 33 కోట్లు మహిళా ఓటర్లే ఉంటారని, ఇది 49 శాతంగా ఉంటుందని పేర్కొంది. ప్రస్తుత పోలింగ్ రేటు ప్రకారం 2029 నాటికి పోలింగ్ 73 కోట్లకు చేరుతుందని, ఇందులో 37 కోట్లు మహిళా ఓటర్లు ఉంటారని అంచనా వేసింది. 2047 నాటికి దేశంలో 115 కోట్ల మంది ఓటర్లుగా నమోదు కావచ్చని, ఓటింగ్‌లో 92 కోట్ల మంది పాల్గొంటారని నివేదిక తెలిపింది. 2047లో అత్యధికంగా మహిళా ఓటర్లు 50.6 కోట్ల మంది పాల్గొననుండగా పురుష ఓటర్లు 41.1 కోట్ల మంది పాల్గొంటారని అంచనా వేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పురుష ఓటర్ల పోలింగ్ 67.01 శాతం ఉండగా మహిళా ఓటర్ల పోలింగ్ 67.18 శాతం ఉందని పేర్కొంది. గత లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే 2024 ఎన్నికల్లో అదనంగా 13 కోట్ల మంది మహిళలు ఓటు వేయవచ్చని, ఇది గేమ్ చేంజర్‌గా మారవచ్చని వ్యాఖ్యానించింది. -
ఒడిశాలో బీజేపీ ఎన్నికల ప్రచారం.. రంగంలోకి 40 మంది స్టార్ క్యాంపెయినర్లు
లోక్‌సభ ఎన్నికల్లో 400పై చీలుకు స్థానాల్లో గెలిచే లక్ష్యంగా బీజేపీ తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ప్రత్యర్ధి గెలుపు అవకాశాల్ని మలుపు తిప్పేలా ఎన్నికల వ్యూహాలు రచిస్తుంది. ఇందులో భాగంగా ఒడిశా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో 40 మంది స్టార్‌క్యాంపెయినర్లను రంగంలోకి దించింది. వారిలో ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇక 40 మంది స్టార్ క్యాంపెయినర్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , హోంమంత్రి అమిత్ షా , బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉన్నారు. వీరితో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లు ఈ జాబితాలో ఉన్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి సమర్పించిన లేఖలో పేర్కొంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, ఒడియా నటులు అనుభవ్ మొహంతి, శ్రీతమ్ దాస్, హరిహర్ మహపాత్ర, పింకీ ప్రధాన్ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఒడిశాలో మే 13 నుంచి నాలుగు దశల్లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. -
జైల్లో మాజీ సీఎం హేమంత్ సోరెన్.. ఈడీకి స్పెషల్ కోర్టు కీలక ఆదేశాలు
మనీ ల్యాండరింగ్ కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ గత వారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై జార్ఖండ్ ప్రత్యేక పీఎంఎల్ఏ (ప్రివెంటివ్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్) కోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారం చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఈడీ ప్రత్యుత్తరం ఇచ్చేందుకు తమకు రెండు వారాలు సమయం కావాలని కోరింది. అయితే ఈడీ నిర్ణయాన్ని సోరెన్ తరుపు న్యాయవాదులు కపిల్ సిబల్, అరుణాభ్ చౌదరి తప్పుబట్టారు. రెండు వారాల సమయం వల్ల తన క్లయింట్ ఎన్నికల ప్రచారానికి దూరం కావాల్సి వస్తుందని వాదించారు. ఇరుపక్ష వాదనలు విన్న కోర్టు సోరెన్ బెయిల్ పిటిషన్‌పై ప్రత్యుత్తరం ఇచ్చేందుకు ఈడీకి వారం రోజుల గడువు మాత్రమే ఇచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణను మే 1న చేపట్టనుంది. మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి సోరెన్‌ను ఈడీ జనవరి 31న అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన రాంచీలోని బిర్సా ముండా సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. -
ఎన్నికల ప్రచారంలో డింపుల్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
పాట్నా : అటు కేంద్రం బీజేపీని ఓడిస్తే.. ఇటు రాష్ట్రంలో కూడా ఆ పార్టీని ప్రతిపక్షంలో కూర్చొబెట్టొచ్చంటూ ఉత్తర్‌ప్రదేశ్ సమాజ్‌వాదీ పార్టీ, మెయిన్‌పురి ఎంపీ అభ్యర్ధి డింపుల్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెయిన్‌పురిలో డింపుల్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ..‘రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకే ఈ లోక్‌సభ ఎన్నికలు. సమాజంలోని ప్రతి వర్గం నిర్లక్ష్యానికి గురవుతోంది. బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం అబద్ధాలు, దోపిడి ప్రభుత్వమని రాష్ట్రం, దేశం మొత్తం తెలిసిపోయిందని అన్నారు. అందుకే ఈ సారి లోక్‌సభ ఎన్నికల్ని చాలా తెలివిగా ఎదుర్కోవాలని ఓటర్లకు పిలునిచ్చారు. రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్న ప్రభుత్వాన్ని ఓడించారు. అందుకు ఈ ఎన్నికలే మనకు ఆయుధం. ఈ (బీజేపీ) ప్రభుత్వాన్ని కేంద్రం నుండి తొలగిస్తే, అప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తొలగించే పని కూడా జరగవచ్చు అని అన్నారు. కాగా, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సతీమణీయే డింపుల్ యాదవ్ -
‘టీవీ రాముడి’ ఎన్నికల ప్రచారం.. రోడ్‌షోలో జేబు దొంగల చేతివాటం..!
పాట్నా : దేశంలో పలు దశల్లో జరగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ఆయా స్థానాల అభ్యర్ధులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ప్రచారంలో దొంగలు తమ చేతి వాటం చూపిస్తున్నారు. అభ్యర్ధులు, కార్యకర్తలను ఇలా దొరికనోళ్లను దొరికినట్లుగా దోచేస్తున్నారు. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్ మీరట్ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్ధిగా ప్రముఖ టీవీ సీరియల్ ‘రామాయణ్’లో రాముడి పాత్రను పోషించిన అరుణ్ గోవిల్, తన సహనటులు సీతగా నటించిన దీపికా చిక్లియా, లక్ష్మణ్ పాత్రలో నటించిన సునీల్ లహ్రీ నగరంలో ఎన్నికల ప్రచారం రోడ్‌షో నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో ఓ షాపు యజమాని కులభూషణ్ తన దుకాణం దాటి వెళ్తున్న అరుణ్ గోవిల్ కాన్వాయ్ కనిపిండచంతో భక్తి పార్వశంలో మునిగిపోయారు. కులభూషణ్‌తో పాటు స్థానాలు చేతులు పైకెత్తి ‘జైశ్రీరామ్’ నినాదాలతో హోరెత్తించారు. అప్పుడే దొంగలు తమ చేతికి పనిచెప్పారు. కులభూషణ్ జేబులో ఉన్న 36 వేలతో పాటు ఇతరుల నుంచి పెద్ద మొత్తంలో నగదు, బంగారం, ఫోన్లు ఇతర విలువైన వస్తువుల్ని కాజేశారు. దీంతో సుమారు డజను మందికి పైగా తమ విలువైన వస్తువుల్ని పోవడంపై పోలీసుల్ని ఆశ్రయించారు. బీజేపీ పశ్చిమ ప్రాంత సమన్వయకర్త అలోక్ సిసోడియా మొబైల్ ఫోన్ కూడా చోరీకి గురైంది. కొంతమంది అగంతకులు గుంపుగా ఉన్న అభిమానుల్ని అవకాశంగా తీసుకుని చోరీకి పాల్పడ్డారని ఆరోపించారు. ఇక బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఢిల్లీకి చెందిన ముగ్గురు నివాసితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల ప్రచారంలో ఆ ముగ్గురు దొంగిలించిన మొబైల్‌లు, కార్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నియోజకవర్గానికి ఏప్రిల్ 26న రెండో దశలో పోలింగ్ జరగనుంది.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019