Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

పాలస్తీనాకు శాశ్వత సభ్యత్వ తీర్మానం.. వీటో పవర్ వాడిన అమెరికా

Published Fri, Apr 19 2024 9:13 AM

USA used vetoes resolution seeking full UN membership for Palestine - Sakshi

ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వాన్ని కల్పించాలని కోరుతూ పాలస్తీనా ప్రవేశపెట్టిన తీర్మాణా​న్ని అమెరికా అడ్డుకుంది. తీర్మానంపై ఓటింగ్‌ సమయంలో అగ్రరాజ్యం అమెరికా వీటో పవర్‌ను వినియోగించింది. 193 దేశాలు సభ్యతం గల ఐరాసలో పాలస్తీనాకు శాశ్వత సభ్యత్వం కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానంపై గురువారం భద్రతా మండలిలో ఓటింగ్‌ జరిగింది.

ఈ ఓటింగ్‌ సందర్భంగా 12 కౌన్సిల్‌ సభ్యదేశాలు పాలస్తీనా తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. ఇక.. బ్రిటన్‌, స్విట్జర్లాండ్  దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. అమెరికా వీటో ఉపయోగించటంతో ఈ తీర్మానం వీగిపోయింది. 

‘రెండు దేశాల సమస్య పరిష్కారానికి అమెరికా ఎప్పుడూ మద్దుతు ఇస్తుంది. ఈ ఓటు పాలస్తీనా ప్రత్యేక దేశానికి వ్యతిరేకమైంది కాదు. అయితే ఇరు దేశాల మధ్య పత్యక్ష చర్చల ద్వారా మాత్రమే సమస్యకు పరిష్కారం లభిస్తుంది’ అని యూఎన్‌లో యూఎస్‌ డిప్యూటీ రాయబారి రాబర్ట్‌ వుడ్‌ భద్రతామండలికి తెలిపారు. 

తీర్మానాన్ని అమెరికా వీటో చేయటంపై  పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌ తీవ్రంగా ఖండించారు. ‘పాలస్తీనా శాశ్వత సభ్యత్వానికి సంబంధించిన తీర్మానాన్ని అమెరికా వీటో చేయటం చాలా  అనైతికం, అన్యాయం’ అని అన్నారు. ‘ఈ తీర్మానంపై ఆమోదం పొందలేదనే విషయం పాలస్తీనా ప్రయత్నాన్ని తగ్గించదు. అదే విధంగా పాలస్తీనా సంకల్పాన్ని ఓడించదు.  మా ప్రయత్నం ఆగదు’ అని యూఎన్‌లో పాలస్తీనా రాయబారి రియాద్ మన్సూర్‌ ఒకింత భావోద్వేగంతో అన్నారు.

Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250