Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

పెమ్మసానిపై చర్యలు తీసుకోండి

Published Tue, Apr 23 2024 8:30 AM

పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్న రజక సంఘాల నాయకులు 
 - Sakshi

నెహ్రూనగర్‌: టీడీపీ గుంటూరు పార్లమెంట్‌ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ నామినేషన్‌ వేసే క్రమంలో రజకులను కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని రజక సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రజక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రాత్రి పట్టాభిపురం స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు పాతపాటి అంజిబాబు మాట్లాడుతూ టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని నామినేషన్‌ వేసేందుకు బయలుదేరుతున్న సమయంలో లౌడ్‌ స్పీకర్స్‌లో రజకులను కించపరిచే విధంగా పలుమార్లు వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటన్నారు. రజకులను చాకలి అని అనకూడదని..అలా అంటే చర్యలు తీసుకోవాలని టీడీపీ హయాంలో ప్రత్యేకంగా జీఓ జారీ చేసిందన్నారు. కానీ రజకులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నప్పటికీ పెమ్మసాని కనీసం ఖండించకపోవడం బాధాకరమన్నారు. గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గంలో 63వేల ఓటింగ్‌ ఉన్న రజకులను కించపరిచిన పెమ్మసానికి రజకుల ఓటుతో తగిన బుద్ధి చెబుతామన్నారు. మాజీ ప్రభుత్వ న్యాయవాది పోకల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రజకులను కించపరిచిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పట్టాభిపుర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారితో పాటు, ఇతర అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. అన్నదాన సత్రం చైర్మన్‌ పోకల వసంత్‌ రజక సామాజిక వర్గం అని చెప్పుకుని టీడీపీ తరుపున టికెట్‌ తెచ్చుకున్న గల్లా మాధవి.. అదే రజక సామాజిక వర్గాన్ని దూషిస్తుంటే ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. ఇప్పుడు ఖండించకపోతే భవిష్యత్తులో రజకులకు ఏం న్యాయం చేయగలరని అన్నారు. ఈ విషయంపై పెమ్మసాని చంద్రశేఖర్‌ రజకులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంతోపాటు టీడీపీ నాయకులు రజకులను దూషించిన అంశాన్ని కరపత్రాల రూపంలో రజకుల ఇంటింటికి వెళ్లి అందజేస్తామన్నారు. రజక సంఘాల నాయకులు నూతలపాటి వెంకటేశ్వర్లు, రామరావు, దుర్గ, బద్రినాథ్‌, గౌరి, ఉదయ్‌ తదితరులు పాల్గొన్నారు.

రజకులను కించపరిచే రీతిలో వ్యాఖ్యలు

63 వేల ఓట్లు ఉన్న రజకులంతా కలిసి బుద్ధి చెబుతాం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రజక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో టీడీపీ లోక్‌సభ అభ్యర్థిపై చంద్రశేఖర్‌పై పోలీసులకు ఫిర్యాదు

Advertisement

Copy Button

 

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250