Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

Gaming: 'టేల్స్‌ ఆఫ్‌ కెన్‌జెర’ ఈ నెల 23న విడుదల కాబోతోంది..

Published Fri, Apr 12 2024 9:01 AM

Gaming: Tales Of KenJera' Will Release On 23rd Of This Month - Sakshi

సర్జెంట్‌ స్టూడియోస్‌ వారి ‘టేల్స్‌ ఆఫ్‌ కెన్‌జెర’ ఈ నెల 23న విడుదల కాబోతోంది. ఈ గేమ్‌లో ప్రధాన పాత్ర జావ్‌. డబుల్‌ జంప్, వాల్‌ జంప్, గాల్లో గంతులు వేయడంలో దిట్ట. మూడు ఆత్మలను బంధించి మృత్యుదేవత కలుంగకు అర్పిస్తుంది. సన్‌ మాస్క్, మూన్‌ మాస్క్‌ అనేవి జావ్‌ ప్రధాన ఆయుధాలు.

శత్రువుల ఆటకట్టించడంలో ఈ రెండు ఆయుధాలకు తమదైన ప్రత్యేకత ఉంది. శత్రువులను జయించినప్పుడు వారి నుంచి ‘ఉలోగి’ అనే సోల్‌ ఎనర్జీని కలెక్ట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ‘టేల్స్‌ ఆఫ్‌ కెన్‌జెర’ అనేది 2.5డీ ప్లాట్‌ఫామ్‌ అడ్వెంచర్‌ గేమ్‌. ప్లేయర్స్‌ క్రమంగా కొత్త కొత్త స్కిల్స్‌ను సొంతం చేసుకుంటారు.

  • ప్లాట్‌ఫామ్స్‌: మైక్రోసాఫ్ట్‌ విండోస్, నిన్‌టెండో స్విచ్, ఎక్స్‌ బాక్స్‌ సిరీస్‌ ఎక్స్‌/ఎస్‌
  • మోడ్‌: సింగిల్‌ ప్లేయర్‌

Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250