Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

వేసవిలో చల్ల చల్లగా : గోండ్‌ కటీరా జ్యూస్‌.. ఒక్కసారి తాగితే..!

Published Fri, Mar 29 2024 11:48 AM

Do you Know Health benefits of edible gum Gond Katira - Sakshi

  గోండ్‌  కటీరా: ఇదొక ఎడిబుల్‌ గమ్‌

 బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు 

వేసవిలో బాడీని చల్లగా చేసే గోండ్‌ కటీరా గురించి విన్నారా? ఇది ఎడిబుల్‌ గమ్‌. దీని వలన ఆనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎముకలను బలంగా ఉంచుతుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.  శక్తిని పెంచుతుంది.  గోండ్‌ కటీరా మరిన్ని ప్రయోజనాల గురించి తెలుసుకుందామా..!

గోండ్‌ కటీరా అనేది తినగలిగే గమ్‌. ఇది కిరాణా షాపుల్లో, ఆన్‌లైన్‌లో కూడా దొరుకు తుంది.  వేసవిలో చల్లదనం కోసం దీన్ని తాగితే, చాలా లాభాలున్నాయి. గోధుమ బంక లేదా బాదాం బంక అనే పేర్లతో ప్రసిద్ధి. దీన్ని  ఆస్ట్రాగాలస్ ప్రొపింకస్ అనే నాచు రకం మొక్కల వేర్ల నుంచి సేకరిస్తారు.  ఇది పౌడర్ లేదా క్యాండీ రూపంలో లభిస్తుంది.  

గోండ్‌ కటీరా జ్యూస్‌ 
ముందుగా ఈ గమ్‌ను కొద్దిగా తీసుకుని రాత్రంతా నానబెట్టాలి. దీంతో ఇది ఒక జెల్‌లాగా తయారవుతుంది. దీన్ని ఒక గ్లాస్‌లో తీసుకోవాలి. ఇందులో నానబెట్టిన సబ్జా గింజలు, కొద్దిగా తరగిన పుదీనా వేసుకోండి. ఇక చివరగా కాస్తంత నిమ్మరసం కలుపుకొని, గ్లాసు నిండా నీళ్లు పోసుకొని చక్కగా తాగెయ్యడమే.  కావాలంటే  ఒకటి రెండు ఐస్‌క్యూబ్స్‌ యాడ్‌ చేసుకోవచ్చు. దీని పౌడర్‌ను పాలలో కలుపుకొని తాగటం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయని  ఆయుర్వేదం చెబుతుంది.
 
గోండ్‌ కటీరా ఆరోగ్య ప్రయోజనాలు:
ఆయుర్వేద వైద్యంలో దీన్ని విస్తృత ప్రయోజనాల కోసం వినియోగిస్తారు. జిగురు లాంటి పదార్ధమైన గోండ్ కటిరా రుచికరమైంది ఇది అనేక పోషకాలతో నిండి ఉంది. అందుకే పంజాబ్‌లో రుచికరమైన గోండ్కే లడ్డూ, పిన్నియాన్‌ బాగా పాపులర్‌.  ఇందులో డైటరీ ఫైబర్‌ ఎక్కువ. అందుకే ప్రేగు కదలికలను సులభంచేసి మలబద్ధకానికి మంచి ఉపశమనంగా పని చేస్తుంది.

ఇందులో కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. ఎముక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గర్భధారణ సమయంలో ప్రయోజనకరమైన సప్లిమెంట్‌గా పనిచేస్తుంది. తల్లి, పిండం ఇద్దరికీ ఆరోగ్యకర మైన ఎముకల అభివృద్ధికి తోడ్పడుతుంది. అంతేకాదు గర్భధారణ సమయంలో రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. పోషకాలు అధికం కాబట్టి బాలింతల్లో పాలను వృద్ధి చేస్తుంది. 

కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ల మిశ్రమమైన ఇది శక్తిని పెంచుతుంది పునరుత్పత్తి ఆరోగ్యానికి మంచిది.  పురుషులలో కొన్ని పునరుత్పత్తి ఆరోగ్య సమస్యలను  పరిష్కరిస్తుంది.   మహిళల్లో పీరియడ్‌ సమస్యలకూ మంచింది.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.ఇందులోని కరిగే ఫైబర్, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ. అందుకే కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. మూత్రపిండాల పనితీరును మెరుగు పరుస్తుంది. 

Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250