breaking news
Ad - Sakshi_Home_Sticky
-
హాయి హాయిగా... కూల్ కూల్‌గా!
ఎలాంటి క్యాప్షన్ లేకుండా రమీజ్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన చెన్నై ఆటోడ్రైవర్ వీడియో 3 కోట్ల ఎనభై ఎనిమిది లక్షలకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. ‘ఏమిటీ ఆటోడ్రైవర్ స్పెషాలిటీ?’ అనే విషయానికి వస్తే... ఎండా కాలంలో చెన్నైలో వేడి అంతా ఇంతా కాదు. ఈ వేడిని తట్టుకోవడానికి సదరు ఆటోడ్రైవర్ ఎకో ఫ్రెండ్లీ ఏసీ ఫ్యాన్‌ను తయారుచేసి తన ఆటోలో బిగించాడు. ఆటోడ్రైవరే కాదు ప్రయాణికులు కూడా హాయి హాయిగా కూల్ కూల్‌గా ప్రయాణిస్తున్నారు. -
వేసవిలో చల్ల చల్లగా : గోండ్ కటీరా జ్యూస్.. ఒక్కసారి తాగితే..!
వేసవిలో బాడీని చల్లగా చేసే గోండ్ కటీరా గురించి విన్నారా? ఇది ఎడిబుల్ గమ్. దీని వలన ఆనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎముకలను బలంగా ఉంచుతుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శక్తిని పెంచుతుంది. గోండ్ కటీరా మరిన్ని ప్రయోజనాల గురించి తెలుసుకుందామా..! గోండ్ కటీరా అనేది తినగలిగే గమ్. ఇది కిరాణా షాపుల్లో, ఆన్లైన్లో కూడా దొరుకు తుంది. వేసవిలో చల్లదనం కోసం దీన్ని తాగితే, చాలా లాభాలున్నాయి. గోధుమ బంక లేదా బాదాం బంక అనే పేర్లతో ప్రసిద్ధి. దీన్ని ఆస్ట్రాగాలస్ ప్రొపింకస్ అనే నాచు రకం మొక్కల వేర్ల నుంచి సేకరిస్తారు. ఇది పౌడర్ లేదా క్యాండీ రూపంలో లభిస్తుంది. గోండ్ కటీరా జ్యూస్ ముందుగా ఈ గమ్‌ను కొద్దిగా తీసుకుని రాత్రంతా నానబెట్టాలి. దీంతో ఇది ఒక జెల్లాగా తయారవుతుంది. దీన్ని ఒక గ్లాస్లో తీసుకోవాలి. ఇందులో నానబెట్టిన సబ్జా గింజలు, కొద్దిగా తరగిన పుదీనా వేసుకోండి. ఇక చివరగా కాస్తంత నిమ్మరసం కలుపుకొని, గ్లాసు నిండా నీళ్లు పోసుకొని చక్కగా తాగెయ్యడమే. కావాలంటే ఒకటి రెండు ఐస్‌క్యూబ్స్ యాడ్ చేసుకోవచ్చు. దీని పౌడర్‌ను పాలలో కలుపుకొని తాగటం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతుంది. గోండ్ కటీరా ఆరోగ్య ప్రయోజనాలు: ఆయుర్వేద వైద్యంలో దీన్ని విస్తృత ప్రయోజనాల కోసం వినియోగిస్తారు. జిగురు లాంటి పదార్ధమైన గోండ్ కటిరా రుచికరమైంది ఇది అనేక పోషకాలతో నిండి ఉంది. అందుకే పంజాబ్‌లో రుచికరమైన గోండ్కే లడ్డూ, పిన్నియాన్ బాగా పాపులర్. ఇందులో డైటరీ ఫైబర్ ఎక్కువ. అందుకే ప్రేగు కదలికలను సులభంచేసి మలబద్ధకానికి మంచి ఉపశమనంగా పని చేస్తుంది. ఇందులో కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. ఎముక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గర్భధారణ సమయంలో ప్రయోజనకరమైన సప్లిమెంట్‌గా పనిచేస్తుంది. తల్లి, పిండం ఇద్దరికీ ఆరోగ్యకర మైన ఎముకల అభివృద్ధికి తోడ్పడుతుంది. అంతేకాదు గర్భధారణ సమయంలో రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. పోషకాలు అధికం కాబట్టి బాలింతల్లో పాలను వృద్ధి చేస్తుంది. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ల మిశ్రమమైన ఇది శక్తిని పెంచుతుంది పునరుత్పత్తి ఆరోగ్యానికి మంచిది. పురుషులలో కొన్ని పునరుత్పత్తి ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తుంది. మహిళల్లో పీరియడ్ సమస్యలకూ మంచింది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.ఇందులోని కరిగే ఫైబర్, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ. అందుకే కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. మూత్రపిండాల పనితీరును మెరుగు పరుస్తుంది. -
ఏం టెక్నాలజీ గురూ.. సంచిలో పడేస్తే చల్లగా ఉంటాయట
కూల్‌డ్రింక్స్, వైన్, బీరు వంటివి చల్లగా ఉండాలనే అందరూ కోరుకుంటారు. ఆరుబయట పిక్నిక్లకు వెళ్లేటప్పుడు ఇవన్నీ చల్లగా దొరకాలంటే కుదిరే పని కాదు. వాటి కోసం పోర్టబుల్ రిఫ్రిజిరేటర్లను లేదా ఐస్‌మేకర్లను తీసుకుపోవాల్సి ఉంటుంది. అయితే, పిక్నిక్లకు వెళ్లేటప్పుడు ఈ సంచి వెంట ఉంటే చాలు. పోర్టబుల్ రిఫ్రిజిరేటర్లను, ఐస్‌మేకర్లను మోసుకుపోనవసరం ఉండదు. ముందుగానే ఇంట్లోని ఫ్రిజ్‌లో చల్లబరచిన పానీయాల సీసాలు,క్యాన్లను ఇందులో పడేసుకుని తీసుకుపోతే చాలు. ఇందులో భద్రపరచిన సీసాలు, క్యాన్లు ఇరవైనాలుగు గంటలసేపు ఏమాత్రం చల్లదనం కోల్పోకుండా, అప్పుడే ఫ్రిజ్‌లోంచి బయటకు తీసినట్లుగా ఉంటాయి. కట్టుదిట్టమైన ఇన్సులేషన్‌తో రూపొందించిన ఈ బ్యాగ్ లోపల ఎంత చల్లని వస్తువులను ఉంచినా, బయటకు ఏమాత్రం నీరు చిమ్మదు. కెనడియన్ స్టార్టప్ కంపెనీ ‘కూలీ’ పేరుతో ఈ బ్యాక్‌ప్యాక్ కూలర్ బ్యాగును ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది. ఆరు రంగుల్లో దొరికే ఈ బ్యాగు ధర 50 డాలర్లు (రూ.4,131) మాత్రమే! -
అంతరిక్ష యుద్ధంలో చల్లగా చావు దెబ్బ
అంతరిక్ష యుద్ధంలో చైనా నానాటికీ దూసుకుపోతోంది. ఇంధన ఆయుధ పరిజ్ఞానంలో అతి గొప్ప పురోగతి సాధించినట్లు చైనా సైన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. కనీ వినీ ఎరుగని అత్యాధునిక కూలింగ్ సిస్టం ఒకదాన్ని కనిపెట్టినట్టు చంగ్ షాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు ప్రకటించారు. అత్యంత హెచ్చు ఇంధన సామర్థ్యంతో కూడిన లేజర్లను పెద్దగా వేడెక్కనేయకుండా, నిరంతరం శక్తివంతంగా, ఎంతటి పెను దాడికైనా నిత్యం సిద్ధంగా ఉంచేందుకు ఈ విధానం దోహదపడుతుందని వర్సిటీ వర్గాలను ఉటంకిస్తూ సౌత్ చైనా మారి్నంగ్ పోస్ట్ వార్తా సంస్థ ఒక కథనం వెలువరించింది. ఈ విధానం సఫలమైందన్న వార్త నిజమైతే చైనా అమ్ములపొదిలోని అత్యాధునిక ఆయుధాలు అతి శక్తివంతమైన లేజర్ కిరణాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు విచ్చలవిడిగా ప్రయోగించగలవు. అప్పుడిక యుద్ధం తీరు తెన్నులే సమూలంగా మారిపోతాయని సంబంధిత వర్గాలు విశ్లేíÙంచాయి. పరిశోధన వివరాలను చైనీస్ జర్నల్ ఆక్టా ఆప్టికా సైనికాలో ప్రచురితమయ్యాయి. వేడే అసలు శత్రువు ఇలాంటి అతి శక్తివంతమైన లేజర్ ఆయుధాలను ప్రయోగించే క్రమంలో భరించలేనంత వేడి ఉద్భవిస్తుంది. ఇది సదరు ఆయుధాలకే తీవ్రంగా నష్టం చేస్తుంది. దీంతో ఆయుధం పాడవకుండా ఉండేందుకు ఆ వేడిని సంపూర్ణంగా తట్టుకునే కూలింగ్ వ్యవస్థను కనిపెట్టినట్టు చైనా చెబుతోంది. లేజర్ ఆయుధాల అభివృద్ధిలో ఇలా వాటిని చల్లబరచడమే అతి పెద్ద సాంకేతిక సవాలు. అమెరికా అప్పట్లోనే తయారు చేసినా... అమెరికా అప్పట్లోనే తయారు చేసినా... ఇలాంటి అత్యాధునిక లేజర్ ఆయుధ వ్యవస్థల తయారీలో అమెరికా చాలాకాలంగా ఎంతో ముందుంది. నేవీ అడ్వాన్స్డ్ కెమికల్ లేజర్, మిడిల్ ఇన్ఫ్రా రెడ్ అడ్వాన్స్డ్ కెమికల్ లేజర్, టాక్టికల్ హై ఎనర్జీ లేజర్, స్పేస్ బేస్డ్ లేజర్ వంటివెన్నో ఇందులో ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో ప్రయోగించినప్పుడు అద్భుతాలు చేశాయి. శబ్ద వేగాన్ని మించి దూసుకుపోగల సూపర్ సానిక్ క్షిపణులను సైతం ధ్వంసం చేసి చూపించాయి. అయితే భారీ పరిమాణం, బరువు కారణంగా వాటిని అటకెక్కించారు. పైగా వాటి పరిధి మహా అయితే కొన్ని కిలోమీటర్లు మాత్రమే. కానీ లేజర్ కాంతి పుంజం విధ్వంసక శక్తిని ఎన్నో రెట్లు పెంచినట్లు లేజర్ కాంతిపుంజ ఆయుధాల శాస్త్రవేత్త యువాన్ బృందం చెబుతోంది. స్పేస్ ఎక్స్ పైకీ ప్రయోగం? కూలింగ్ సిస్టమ్ సాయంతో పనిచేసే ఈ అధునాతన లేజర్ క్షిపణి వ్యవస్థ సంప్రదాయ వ్యవస్థలతో పోలిస్తే చాలా చవకైనది. ఎంతో ప్రభావవంతమైనది కూడా. పైగా దీన్ని రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. అవసరమైతే స్పేస్ ఎక్స్ తాలూకు స్టార్ లింక్ వంటి ఉపగ్రహ వ్యవస్థల పైకి ఈ లేజర్ ఆయుధాలను ప్రయోగించే యోచనలో చైనా ఉన్నట్టు చెబుతున్నారు. హెచ్ యు ఇంధన సామర్థ్యంతో కూడిన లేజర్ ఆయుధాల ప్రయోగం విషయంలో ఇది నిజంగా ఒక గొప్ప ముందడుగు –లేజర్ కాంతి పుంజ ఆయుధాల శాస్త్రవేత్త యువాన్ షెంగ్ ఫు –సాక్షి, నేషనల్ డెస్క్ -
రెక్కల్లేని ఫ్యాన్.. ధర తక్కువ & నిమిషాల్లో చల్లదనం
ఈ ఫొటోలో గది మధ్య స్తంభంలా కనిపిస్తున్నది 36 అంగుళాల టవర్ ఫ్యాన్. దీనికి రెక్కలు లేకపోయినా, దీన్ని ఆన్ చేసుకుంటే గదిలో గాలికి లోటుండదు. అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ ‘వెసింక్’కు అనుబంధ సంస్థ అయిన ‘లెవోయిట్’ ఈ స్తంభంలాంటి టవర్ ఫ్యాన్‌ను ఇటీవల విడుదల చేసింది. మిగిలిన ఫ్యాన్ల మాదిరిగానే దీనిలోనూ గాలి వేగాన్ని అదుపు చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే, మామూలు ఫ్యాన్ల మాదిరిగా ఇది శబ్దం చేయదు. (ఇదీ చదవండి: సమయం ఆదా చేసే 'అల్ట్రాస్పీడ్ త్రీడీ ప్రింటర్' - ధర ఎంతంటే?) తొంభై డిగ్రీల కోసం అటూ ఇటూ తిరుగుతూ గాలిని కోరుకున్న వేగంలో ప్రసరిస్తుంది. అంతేకాదు, ఇందులో ఇంకో విశేషమూ ఉంది. ఇది ‘టెంపరేచర్ రెస్పాన్సివ్ ఫ్యాన్’. అంటే, ఈ ఫ్యాన్ గదిలోని ఉషోగ్రతకు అనుగుణంగా పనిచేస్తుంది. లోపల బాగా వేడిగా ఉంటే, ఇందులోని సెన్సర్లు ఉషోగ్రతను గుర్తించి, నిమిషాల్లోనే గదిని చల్లబరుస్తాయి. ఇది దాదాపుగా ఏసీకి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని చెబుతున్నారు. దీని ధర 69.99 డాలర్లు (రూ. 5,743) మాత్రమే!
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019