breaking news
Ad - Sakshi_Home_Sticky
-
Mohini Dey: మూడు సంవత్సరాల వయసు నుంచే బాస్ గిటార్‌తో..
పదకొండు సంవత్సరాల వయసులోనే బాస్ గిటారిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకుంది మోహిని డే. మోహిని మూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తండ్రి సుజయ్ డే బాస్ గిటార్ చేతికి అందించాడు. అలా మూడు సంవత్సరాల వయసు నుంచే బాస్ గిటార్‌తో మోహిని ఫ్రెండ్షిప్ మొదలైంది. జాజ్ ఫ్యూజన్ గిటారిస్ట్‌గా సంగీత ప్రయాణాన్ని మొదలుపెట్టిన సుజయ్ ఆ తరువాత జాజ్‌కు దూరమై కుటుంబ పోషణ కోసం కోల్కత్తా నుంచి ముంబైకి వచ్చాడు. సెషన్స్ ఆర్టిస్ట్‌గా మారాడు. మోహిని విషయానికి వస్తే తండ్రి సుజయ్ తొలి మ్యూజిక్ టీచర్. తండ్రి సహకారంతో చిన్న వయసులోనే పేరున్న పెద్ద కళాకారులతో కలిసి సంగీత కచేరీలు చేసింది మోహిని. పదమూడు సంవత్సరాల వయసులో ప్రసిద్ధ పృథ్వీ థియేటర్ నుంచి మోహినికి ఆహ్వానం అందింది. ‘మ్యూజిక్ ప్రాక్టిస్ చేస్తున్న నా దగ్గరకు నాన్న వచ్చి రంజిత్ అంకుల్ నుంచి కాల్ వచ్చింది, బ్యాగ్ సర్దుకో అని చెప్పారు. పృథ్వీ థియేటర్‌కు వెళ్లిన తరువాత అక్కడ జాకీర్ హుస్సేన్‌ను, ఫిల్మ్స్టార్స్ను చూశాను. రంజిత్ అంకుల్ నన్ను జాకీర్ అంకుల్‌కు పరిచయం చేశారు. ఆ తరువాత స్టేజీ మీద బాస్ గిటార్ ప్లే చేశాను. మంచి స్పందన వచ్చింది’ అంటూ తన మ్యూజికల్ మెమోరీలోకి వెళుతుంది మోహిని. తండ్రి సుజయ్ బాస్ గిటారిస్ట్. ఎంత బిజీగా ఉన్నా కూతురికి సంగీత పాఠాలు నేర్పడానికి అధికప్రాధాన్యత ఇచ్చేవాడు. విక్టర్ వుటెన్ నుంచి మార్కస్ మిల్లర్ వరకు ఎంతో మంది గిటారిస్ట్ల ప్రభావం మోహినిపై ఉంది. ఒకే స్టైల్‌కి పరిమితం కాకుండా రకరకాల స్టైల్స్‌ను ప్లే చేయడంలోప్రావీణ్యం సంపాదించింది. ‘రకరకాల స్టైల్స్నుప్రాక్టిస్ చేస్తున్న క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. ఆ సవాళ్లను అధిగమించగలిగినప్పుడు కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. స్కూల్, కాలేజి రోజుల్లో నా ఆలోచనలు స్నేహితులకు వింతగా అనిపించేవి. నా ఆలోచనలు, ఐడియాలు ఎప్పుడు నా వయసు వారి కంటే చాలా భిన్నంగా ఉండేవి’ అంటుంది మోహిని. ‘ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి?’ అనే ప్రశ్నకు మోహిని ఇచ్చే జవాబు ఇది.. ‘సొంతంగా మ్యూజిక్ స్కూల్ స్టార్ట్ చేయాలనేది నా కల. జంతుసంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొనాలనుకుంటున్నాను. వోన్ మ్యూజిక్ షోతో ప్రేక్షకులకు నచ్చే మ్యూజిక్ అందించాలనుకుంటున్నాను’ తల్లిదండ్రులే నా సంగీత పాఠశాల.. తల్లిదండ్రులే నాకు వరం. వారు నాకు సంగీత పాఠశాలలాంటి వారు. ప్రశంస ఎవరికైనా సరే ఉత్సాహాన్ని ఇస్తుంది. నాకు ఎన్నో ప్రశంసలు వచ్చినప్పటికీ అహం ప్రదర్శించలేదు. ఇది కూడా నా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నదే. బాస్ గిటార్‌తో జీవనోపాధికి ఇబ్బంది అని, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టం అనుకునే సమయంలో యువతకు బాస్ గిటార్‌పై ఆసక్తి పెరిగేలా చేశాను. – మోహిని డే ఇవి చదవండి: Japnit Ahuja: డిజిటల్ జెండర్ గ్యాప్‌ను కోడింగ్ చేసింది! -
సంగీతంలో అపశ్రుతి
సంగీతంలో సప్తస్వరాలు ఉన్నాయి. పశుపక్ష్యాదుల ధ్వనుల నుంచి ఇవి పుట్టినట్లు ప్రతీతి. శ్రుతి లయలు స్వరాల గమనానికి దిశానిర్దేశం చేసి, సంగీతాన్ని మనోరంజకం చేస్తాయి. సంగీతానికి ఆధారభూతమైన సప్తస్వరాలైనా, శ్రుతిలయాదులైనా– అన్నీ ప్రకృతి నుంచి పుట్టినవే! ప్రకృతికి కులమతాలు లేవు. ప్రకృతి నుంచి పుట్టిన సంగీతానికి కూడా కులమతాలు లేవు, సరిహద్దులు లేవు. చక్కని సంగీతానికి శ్రావ్యతే గీటురాయి. సంగీత కళను శాస్త్రబద్ధం చేసిన తొలి రోజుల్లో సంగీతానికి సంబంధించిన శాస్త్రీయ సంప్రదాయాలు కొన్ని ఏర్పడ్డాయి. తర్వాతి తరా లలో కొందరు సంగీత విద్వాంసులు పూర్వసంప్రదాయాలను, చాదస్తాలను తోసిపుచ్చి, తమదైన సృజనతో కొత్త ఒరవడికి నాంది పలికారు. తొలినాళ్లలో ఏకరీతిలో ఉన్న భారతీయ సంగీతంలో పద్నాలుగో శతాబ్దం నాటికి విభజన ఏర్పడింది. భారతీయ సంగీతంలో హిందుస్తానీ సంగీతం, కర్ణాటక సంగీతం ప్రధాన శాఖలుగా ఏర్పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా సంగీతంలో ఎన్ని శాఖలు ఉన్నా, అవన్నీ శైలీభేదాల వల్ల ఏర్పడి నవి మాత్రమే! కర్ణాటక సంగీతానికి పురందరదాసు పితామహుడిగా పేరుగాంచారు. ఆయన తర్వాతి కాలంలో త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి ‘కర్ణాటక సంగీత త్రిమూ ర్తులు’గా పేరుపొందారు. వీరందరూ ఎవరి స్థాయిలో వారు ప్రయోగాలు చేసిన వారే గాని, పూర్వ శాస్త్రగ్రంథాల్లోని పాఠాలకు కట్టుబడి, వాటినే తు.చ. తప్పకుండా వల్లెవేసిన వారు కాదు. వారంతా మడిగట్టుకుని పూర్వగ్రంథాల్లోని పద్ధతులకే పరిమితమై ఉన్నట్లయితే, ఈనాడు కర్ణాటక సంగీతం ఇంతటి ఉత్కృష్ట స్థాయికి చేరుకునేదే కాదు. ముత్తుస్వామి దీక్షితార్ సాహసోపేతమైన ప్రయోగాలే చేశారు. ఈస్టిండియా కంపెనీ అధికారి కర్నల్ జేమ్స్ బ్రౌన్ ప్రోత్సాహంతో ఇంగ్లిష్ సంగీత బాణీలకు సంస్కృత రచనలు చేశారు. ఈస్టిండియా కంపెనీ బ్యాండ్ ఆర్కెస్ట్రాలో ఉపయోగించే వయొలిన్‌ను చూసి ముచ్చటపడి కర్ణాటక సంగీత కచేరీల్లోకి తీసుకువచ్చారు. ముత్తుస్వామి సోదరుడు బాలుస్వామి తొలిసారిగా కర్ణాటక సంగీత కచేరీలో వయొలిన్ వాయించారు. పాశ్చాత్య శైలిలో ‘నోటు స్వరాలు’ కూర్చి సంప్రదాయ కచేరీల్లో వినిపించడం ప్రారంభించారు. ముత్తుస్వామి దీక్షితార్ చేసిన ప్రయోగాలు ఆనాటిసంప్రదాయవాదులకు మింగుడుపడనివే! చాదస్తపు విమర్శలకు భయపడి ముత్తుస్వామి తన ప్రయోగాలను విరమించుకున్నట్లయితే, ఆయన అనామకంగానే కాలగర్భంలో కలిసిపోయేవారు. ముత్తుస్వామి దీక్షితార్ తర్వాతికాలంలో కూడా కొందరు విద్వాంసులు క్లారినెట్, శాక్సాఫోన్, మాండొలిన్, గిటార్, వయోలా, పియానో వంటి పాశ్చాత్య వాద్యపరికరాలను కర్ణాటక సంగీత కచేరీలకు పరిచయం చేశారు. త్యాగరాజు కాలం నాటికి అప్పటి తంజావూరు సంస్థానంలో పాశ్చాత్య సంగీతానికి కూడా సమాదరణ ఉండేది. త్యాగరాజు రాజాశ్రయానికి దూరంగా తనసంగీత సాధన కొనసాగించినా, ఆయనపైనా పాశ్చాత్య సంగీత ప్రభావం లేకపోలేదు. త్యాగరాజు ఏటా వేసవిలో ఎక్కువగా తిరువయ్యారులో గడిపేవారు. అక్కడ ఉన్నప్పుడే ఆయన పాశ్చాత్యసంగీతాన్ని ఆస్వాదించారు. త్యాగరాజు ఆ తర్వాతి కాలంలో శంకరాభరణ రాగంలో కూర్చిన ‘వరలీలా గానలోలా’, ‘సారస నేత్ర’, సుపోషిణి రాగంలో కూర్చిన ‘రమించు వారెవరురా’ వంటి కొద్ది కీర్తనల్లో పాశ్చాత్య సంగీత ధోరణులు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ప్రయోగాలు లేకుండా ఏ కళా, ఏ శాస్త్రమూ అభివృద్ధి చెందదు. మన కాలానికి చెందిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ కూడా కర్ణాటక సంగీతంలో ఎన్నో ప్రయోగాలు చేసి శ్రోతలను మెప్పించారు. సంగీత సంప్రదాయం ప్రకారం ఆరోహణ అవరోహణలలో ఒక రాగానికి కనీసం ఐదేసి స్వరాలు ఉండాలి. ఆరోహణ అవరోహణలలో ఐదు కంటే తక్కువ స్వరాలను ఉపయో గించి ఆయన కొత్త రాగాలను సృష్టించారు. నేటితరంలో టి.ఎం.కృష్ణ తనదైన శైలిలో సంగీతంలో ప్రయోగాలను కొనసాగిస్తున్నారు. సంప్రదాయ కచేరీ నమూనాలోనే మార్పులను తీసుకొచ్చారు. వర్ణాలు, కృతులు, తిల్లానాలు వంటి వాటితోనే సాగే కర్ణాటక సంగీత కచేరీల్లో టి.ఎం.కృష్ణ క్రైస్తవ గీతాలను, ఇస్లాం గీతాలను, తమిళ కవుల గేయాలను కూడా పాడటం ద్వారా కొత్త ఒరవడికి నాంది పలికారు. కచేరీల్లో టి.ఎం. కృష్ణ ఈ మార్పులను తెచ్చినప్పటి నుంచి మతతత్త్వవాదులు ఆయనపై విమర్శలు గుప్పిస్తూ వస్తు న్నారు. టి.ఎం.కృష్ణ సంగీత రంగానికి మాత్రమే పరిమితం కాకుండా; దేశంలోని సామాజిక పరిణామాలపై ఎప్పటికప్పుడు స్పందించే తీరు, దళితవాడలకు వెళ్లి కచేరీలు చేస్తూ సంగీతాన్ని సామాన్యుల చెంతకు చేరుస్తున్న పద్ధతి కూడా వారికి కంటగింపుగా మారింది. ఇదివరకు టి.ఎం. కృష్ణకు రామన్ మెగసెసె అవార్డు వచ్చినప్పుడు రుసరుసలు వినిపించాయి. ఇటీవల ఆయనకు మ్యూజిక్ అకాడమీ ‘సంగీత కళానిధి’ అవార్డును ప్రకటించింది. దీనికి నిరసనగా గాయనీమణులు రంజని, గాయత్రి మ్యూజిక్ అకాడమీలో ఈసారి కచేరీ చేయబోమంటూ, అకాడమీ అధ్యక్షుడికి లేఖ రాశారు. మ్యూజిక్ అకాడమీ అధ్యక్షుడు ఎన్. మురళి ఆ లేఖకు ఇచ్చిన సమాధానంలో వారి తీరును తప్పుపట్టారు. టి.ఎం.కృష్ణపై అక్కసు వెళ్లగక్కుతున్న వారంతా ఆయన సంగీత సామ ర్థ్యాన్ని గురించి మాట్లాడకుండా, ఆయన సంప్రదాయాన్ని మంటగలిపేస్తున్నాడంటూ గగ్గోలు పెడుతుండటం గమనార్హం. రంజని, గాయత్రి వంటి వారి తీరు సంగీత ప్రపంచంలో ఒక అపశ్రుతి. అయితే, సంగీతం ఒక స్వరవాహిని. ఇలాంటి అపశ్రుతులను సవరించుకుంటూ తన ప్రవాహాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. -
సంగీతం వస్తేనే సింగర్ అయిపోరు అని ప్రూవ్ చేసింది!
ఎలాంటి సంగీత నేపథ్యం లేకున్నా పాటను చక్కగా ట్యూన్ చేయగలదు. ఆమె పాటలను రాసి ట్యూన్ చేసి పాడేస్తుంది. అవే సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఫేమస్ అయ్యింది. అదే సినీ ఇండస్ట్రీలోకి వచ్చేల చేసింది. అంతేకాదండోయ్ ఫేమస్ పాట 'జిందగీ' పాడింది కూడా ఈమెనే. ఆమె ఎవరంటే.. లాక్డౌన్ కాలంలో దొరికిన విరామంలో ఎంతోమంది తమలోని క్రియేటివ్ టాలెంట్స్‌ను మెరుగు పరుచుకున్నారు. అలాంటి వారిలో హనియా ఒకరు. కేరళలోని కోచికి చెందిన హనియా నసిఫా లాక్డౌన్లో ఖాళీ సమయం దొరకడంతో సంగీతం నేర్చుకోవడం ప్రారంభించింది. ‘నాకు ఎలాంటి సంగీత నేపథ్యం లేదు. అయితే పాటలను రాసి ట్యూన్ చేస్తున్నప్పుడు ఎంతో సంతోషంగా అనిపించేది. అలా పాటలనేవి నా దిన్యచర్యలో భాగం అయ్యాయి’ అంటుంది హానియా. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ట్రాక్స్ వైరల్ అయ్యాయి. ఇది హానియాను లైమ్‌లైట్‌లోకి తీసుకువచ్చింది. ‘నా షార్ట్ మ్యూజిక్ క్లిప్స్‌కు వేలల్లో వ్యూస్ రావడం మొదలు కావడంతో మరింత ఉత్సాహం వచ్చింది. ఇక అప్పటి నుంచి పాటలను ప్రొఫెషనల్‌గా రికార్డ్ చేయడం ప్రారంభించాను. మ్యూజిక్ ఇన్స్ట్రూమెంట్స్ను అప్‌గ్రేడ్ చేశాను’ అంటుంది ఇరవై సంవత్సరాల హనియా. హనియా తన టాలెంట్‌తో సోషల్ మీడియా నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి ఎంతో కాలం పట్టలేదు. మన తెలుగు సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో ‘జిందగీ’ అనే పాటను పాడింది. (చదవండి: ఈజీగా బరువు తగ్గేందుకు సులభమైన మూడు మార్గాలు ఇవే!) -
Adithi Sehgal: ‘ఎవ్రీబడీ డ్యాన్సెస్ టు టెక్నో’
‘నా జీవితంలో సంగీతం భాగం అయిపోయింది’ అంటుంది అదితి సెహగల్. రాక్ మ్యూజిషియన్ అమిత్ సెహగల్, నటి షెనా గమత్ల కుమార్తె అయిన అదితి ‘డాట్’ పేరుతో కూడా మ్యూజిక్ వరల్డ్‌లో పాపులర్ అయింది. ఆరేళ్ల వయసులో పియానో ప్లే చేయడం నేర్చుకుంది. పన్నెండేళ్ల వయసులో మ్యూజిక్ కంపోజింగ్లోకి వచ్చింది. 'ప్రాక్టిస్ రూమ్స్’ ఆల్బమ్ ఆమెకు ఎంతో పేరు తెచ్చింది. ‘ఎవ్రీబడీ డ్యాన్సెస్ టు టెక్నో’ మ్యూజిక్ వీడియో వైరల్ హిట్ అయింది. గాఢమైన స్నేహబంధానికి అద్దం పట్టే ‘గర్ల్స్ నైట్’ సాంగ్ కూడా అదితికి ఎంతో పేరు తెచ్చింది. ‘ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30’ తాజా జాబితాలో సంగీత విభాగంలో చోటు సాధించిది అదితి. ఆదితి సంగీతకారిణి మాత్రమే కాదు మంచి నటి కూడా. జోయా అక్తర్ ‘ది ఆర్చీస్’ సినిమాలో నటిగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఇవి చదవండి: Ambitio: ధైర్యం ఇస్తూ... దారి చూపుతూ -
మారుతున్న కాలానుగుణంగా.. ఈ కొత్త టెక్నాలజీ మీకోసం..
'అతి వేగంగా పరుగెడుతున్న ఈ కాలాన్ని ఆపడం ఎవరి వలన కాదు. ఈ కాలంతోపాటుగా కొత్త టెక్నాలజీ కూడా అంతే వేగంగా పరుగెడుతుంది. దానిని మనం గుప్పిట్లో దాచి, సరైన క్రమంలో.. టెక్నాలజీని ఉపయోగించుటకై సరికొత్త పరికరాలు మీ ముందుకు వస్తున్నాయి. మరి వాటిని గురించి పూర్తిగా తెలుసుకందామా..!' మిల్క్ వే ట్యాబ్.. మన దేశ విద్యారంగంలోని కీలకమైన అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ టెక్ సంస్థల సహాకారంతో ‘ఎపిక్’ ఫౌండేషన్ రూపొందించిన ట్యాబ్ మిల్క్ వే. కొన్ని వివరాలు: సైజ్: 8 అంగుళాలు రిజల్యూషన్: 1,280“800 పిక్సెల్స్ మీడియా టెక్ 8766 ఏప్రాసెసర్ 4జీబి ర్యామ్/64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ 5,100 ఎంఏహెచ్ హానర్ మ్యాజిక్ బుక్ 16ప్రో.. సైజ్: 16.00 అంగుళాలు రిఫ్రెష్ రేట్: 165 హెచ్జడ్ రిజల్యూషన్: 3072“1920 పిక్సెల్స్ ఆపరేషన్ సిస్టమ్: విండోస్ 11 స్టోరేజ్: 16జీబి ప్లస్ 512జీబి సపోర్ట్: ఫింగర్‌ప్రింట్ సెన్సర్ బరువు: 1.75 కేజీ కలర్స్: వైట్ పర్పుల్ ఫ్రెండ్ మ్యాప్ ఫీచర్.. ‘ఫ్రెండ్ మ్యాప్’ అనే కొత్త ఫీచర్‌పై పనిచేస్తోంది ఇన్స్టాగ్రామ్. ప్లాట్‌ఫామ్‌లోని యూజర్లకు తమ స్నేహితుల లోకేషన్‌ను చెక్ చేయడానికి ఈ ఫీచర్ ఉపకరిస్తుంది. స్నాప్‌చాట్‌లోని ‘స్నాప్ మ్యాప్’ను పోలిన ఫీచర్ ఇది. తమ లొకేషన్‌ను ఎవరు చూడాలో ఎంపిక చేసుకోవడానికి అనుమతిస్తుంది. ‘ఫ్రెండ్ మ్యాప్’లో యూజర్ తన చివరి యాక్టివ్ లొకేషన్‌ను దాచే ‘ఘోస్ట్ మోడ్’ కూడా ఉంటుంది. స్టిక్కీ నోట్స్.. మైక్రోసాఫ్ట్ వారి ‘స్టిక్కీ నోట్స్’ యాప్ కొత్త హంగులతో ముందుకు వచ్చింది. పాత ‘స్టిక్కీ నోట్స్’ను రీవ్యాంప్ చేసి ఎన్నో కొత్త ఫీచర్లు తీసుకువచ్చారు. నోట్స్ క్రియేట్ చేయడానికి, స్క్రీన్ షాట్లను తీసుకోవడానికి, ఆడియోను రికార్డ్ చేయడానికి ఇది యూజర్లను అనుమతిస్తుంది. ఇవి చదవండి: అసలు వీటి గురించి మీకు తెలుసా..!
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019