Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

ముందస్తు చెల్లింపుపై రాయితీ

Published Thu, Apr 18 2024 9:30 AM

ఆత్మకూర్‌లో ఆస్తిపన్ను వసూలు చేస్తున్న పుర అధికారులు  
 - Sakshi

సద్వినియోగం చేసుకోవాలి..

ముందస్తు ఆస్తి పన్ను చెల్లింపుపై 5 శాతం రాయితీని పుర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఈ నెలాఖరు వరకే అవకాశం ఉంది. ప్రస్తుతం రూ.10 వేలకు రూ.500 ఆదా అవుతుంది. ముందస్తు చెల్లింపులతో కలిగే లాభాలను వివరిస్తూ ప్రత్యేక చార్ట్‌ను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నాం.

– ఎం.పూర్ణచందర్‌,

పుర కమిషనర్‌, వనపర్తి

2024–25 ఆర్థిఽక

సంవత్సరానికి వర్తింపు

పుర ప్రజలను ప్రోత్సహించేందుకు అధికారుల యత్నం

జిల్లాలో 5 శాతం రిబేట్‌తో రూ.33 లక్షల వరకు ఆదా

వనపర్తి టౌన్‌: పురపాలికల్లో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముందస్తు పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం 5 శాతం రాయితీ ప్రకటిస్తూ ఉత్తర్వులిచ్చింది. దీంతో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఉన్న ప్రజలకు మొత్తంగా రూ.33 లక్షల వరకు ఆదా కానుంది. ఎలాంటి పాత బకాయిలు లేకుండా ఈ ఏడాది పన్ను చెల్లించే వారికి మాత్రమే రాయితీ వర్తించనుంది. గతేడాది ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యం చేరకపోవడంతో ప్రభుత్వం ప్రకటించిన రాయితీ ప్రజలు, పురపాలక సంఘానికి కలిసి రా నుందని చెప్పవచ్చు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో పన్ను బకాయిల వడ్డీపై 90 శాతం ఇవ్వడం.. పుర అధికారులు మార్చిలో బృందాలుగా ఏర్పడి బకాయిల వసూళ్లకు తిరగడంతో కొంత మేర లాభం చేకూరింది. ముందస్తు పన్ను చెల్లింపుదారులకు ఈ నెల 30 వరకు అవకాశం ఇవ్వడంతో పురపాలికలకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది.

¢ జిల్లాకేంద్రంలో మొత్తం 17,649 అసెస్‌మెంట్లు ఉండగా.. 9,126 మంది యజమానులు 5 శాతం రిబేట్‌కు అర్హత సాధించారు. రూ.3.21 కోట్ల డిమాండ్‌ ఉండగా.. రూ.15.91 లక్షలు ఆదా కానుంది. పుర అధికారులు ఇప్పటి వరకు రూ.32 లక్షలు వసూలు చేశారు.

¢ అమరచింతలో 5 శాతం రిబేట్‌కు 1,726 అసైస్‌మెంట్లు అర్హత ఉండగా.. రూ.28.32 లక్షలు వసూలు చేయాల్సి ఉంది. పుర ప్రజలకు రూ.1.41 లక్షల వరకు ఆదా కానుంది, రాయితీతో ఇప్పటి వరకు రూ.1.05 లక్షలు వసూలు చేశారు.

¢ ఆత్మకూర్‌ మున్సిపాలిటీలో 5,428 అసైస్‌మెంట్లు ఉన్నాయి. రూ.1.90 కోట్లు లక్ష్యం కాగా.. 5 శాతం రాయితీతో రూ.9.50 లక్షలు ఆదా కానున్నాయి. ఇప్పటి వరకు రూ.17 లక్షలు వసూలు చేశారు. మిగిలిన కొత్తకోట, పెబ్బేర్‌ మున్సిపాలిటీల్లోనూ పుర అధికారులు పన్ను వసూళ్లు చేపడుతున్నారు.

ప్రచారం అంతంతే..

ముందస్తు చెల్లింపు రాయితీపై పుర ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో 14 రోజులే అవకాశం ఉండటంతో లక్ష్యం చేరుకుంటారా? లేదా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు వసూలు చేసింది 10 శాతంలోపే కావడం గమనార్హం.

1/1

Advertisement

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250