Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

నేడు పీఈసీ సమావేశం

Published Fri, Mar 29 2024 5:03 AM

Revanth Reddy Focus on Lok Sabha Elections: telangana - Sakshi

లోక్‌సభ ఎన్నికల వ్యూహాలపై చర్చ  

సాక్షి, హైదరాబాద్‌: ప్రదేశ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశం శుక్రవారం ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్‌లో జరగనుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. లోక్‌సభ ఎన్నికల్లో విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించనున్నారు. అలాగే ఏప్రిల్‌ 6న తుక్కుగూడలో పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ పాల్గొనే సభను విజయవంతం చేసే అంశంపై కూడా సమావేశంలో చర్చిస్తారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ దీపా దాస్‌మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు, పీఈసీ సభ్యులు పాల్గొంటారు.

‘జాతీయ మేనిఫెస్టో కమిటీ’ ఏర్పాటు
పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు చైర్మన్‌గా ‘ప్రజల ముంగిట్లోకి జాతీయ మేనిఫెస్టో కమిటీ’ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేశారు. పార్టీ జాతీయ మేనిఫెస్టో ప్రజల చెంతకు చేరేలా ఏం చేయాలనే దానిపై ఈ కమిటీ 15 రోజుల్లో టీపీసీసీకి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కమిటీలో కన్వీనర్‌గా ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్య, పీసీసీ మేధావుల విభాగం చైర్మన్‌ శ్యాంమోహన్, మాజీ ఎమ్మెల్సీ కమలాకరరావు, ఎన్‌ఆర్‌ఐ సెల్‌ చైర్మన్‌ బీఎం వినోద్‌కుమార్, పీసీసీ అధికార ప్రతినిధి మహ్మద్‌ రియాజ్, ఐఎన్‌టీయూసీ కార్యదర్శి జనక్‌ ప్రసాద్‌ ఉన్నట్లు పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు.

Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250