Sakshi News home page

Massive Traffic Jam In Bengaluru: ఐదు రోజులు సెలవులు.. బెంగళూరులో భారీ ట్రాఫిక్ జామ్

Published Thu, Sep 28 2023 8:48 AM

Bengaluru Hit By Massive Traffic Jam Ahead of Long Weekend  - Sakshi

బెంగళూరు: వరుసగా ఐదు రోజులు సెలవులు రావడంతో బెంగళూరులో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. బుధవారం సాయంత్రం కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గంటల తపబడి వాహనదారులు రోడ్లపైనే వేచి ఉన్నారు. పాఠశాల విద్యార్థులు సైతం అర్థరాత్రి వరకు రోడ్లపైనే గడిపారు. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల మధ్య ట్రాఫిక్ ఒక్కసారిగా పెరిగిపోయిందని పోలీసులు తెలిపారు.

ఐదు రోజులు..
ఈ వీకెండ్‌కు ఐదు రోజులు సెలవులు వస్తున్నాయి. ఈ రోజు ఈద్ మిలాద్ ఉన్ నబీకి అధికారికంగా సెలవు ఉంటుంది. కర్ణాటక-తమిళనాడు మధ్య చెలరేగుతున్న కావేరి నదీ జలాల వివాదంపై రేపు బంద్‌కు పిలుపునిచ్చారు. టెక్ కంపెనీలకు శనివారం, ఆదివారం సెలవులు ఉంటాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా పబ్లిక్ హాలిడే. దీంతో నగరవాసులు తమ సొంతూళ్లకు వెళ్తున్నారు.

బుధవారం సాయంత్రం ట్రాఫిక్‌ ఒక్కసారిగా పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. సాధారణ రోజుకు రెండింతలు ట్రాఫిక్ పెరిగిందని వెల్లడించారు. సాధారణంగా రోడ్లపై వాహనాల సంఖ్య 1.5 నుంచి 2 లక్షల వరకు ఉంటుంది. కానీ బుధవారం ఆ సంఖ్య ఏకంగా 3.5 వరకు పెరిగిందని స్పష్టం చేశారు. వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలవడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు.

ఇదీ చదవండి: అప్పులు చేసి ఆడంబర వివాహాలొద్దు   

homepage_300x250