Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

Telugu Actors As Lord Rama: తెలుగు సీనీ శ్రీరామచంద్రులు వీరే.. వెండితెర తొలి రాముడు ఎవరంటే?

Published Tue, Apr 16 2024 6:53 PM

Sri Rama Navami 2024: List Of Tollywood Actors Who Impressed As Playing Lord Rama Role In Movies - Sakshi

శ్రీరాముడితో తెలుగు తెరకు మంచి అనుబంధమే ఉంది. ఇప్పటికే రాముడు, రామాయణంపై పదుల సంఖ్యల్లో సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్‌ మొదలు ప్రభాస్‌ వరకు పలువురు స్టార్‌ హీరోలు రాముడి పాత్రలు పోషించి మెప్పించారు. రేపు(ఏప్రిల్‌ 17) శ్రీరామనమవి. ఈ సందర్భంగా రామాయణం నేపథ్యంలో వచ్చిన సినిమాలు, రాముడిగా మెప్పించిన హీరోలపై ఓ లుక్కేయండి. 

తొలిసారి టాలీవుడ్‌ తెరపై రాముడి పాత్ర పోషించింది యడవల్లి సూర్య నారాయణ. ‘పాదుకా పట్టాభిషేకం’సినిమాలో సూర్యనారాయణ రాముడిగా నటించాడు. బాదామి సర్వోత్తం దర్శకత్వం వహించిన ఈ సినిమా 1932లో విడుదలై మంచి విజయం సాధించింది. తెలుగులో వచ్చిన రెండో టాకీ మూవీ ఇది. ఇదే టైటిల్‌తో 1945లో మరో సినిమా తెరకెక్కింది. ఇందులో సి.ఎస్.ఆర్ ఆంజనేయులు రాముడిగా నటించి మెప్పించారు

♦ ఆ తర్వాత 1944లో వచ్చిన శ్రీ సీతారామ జననం సినిమాలో ఏఎన్నార్‌ శ్రీరాముడి పాత్ర పోషించి ప్రేక్షకుల మనసును దోసుకున్నాడు. 

♦ శ్రీరాముడు పాత్రను ఎంతమంది పోషించినా.. అందరికి గుర్తిండేది మాత్రం ఒక్క ఎన్టీఆర్‌ మాత్రమే. వెండితెర రాముడు అనగానే అందరికి గుర్తొచ్చే రూపం ఎన్టీఆర్‌. 1959లో విడుదలైన సంపూర్ణ రామాయణంతో తొలిసారి రాముడు గెటప్‌లో కనిపించాడు ఎన్టీఆర్‌. ఆత ర్వాత లవకుశ, రామదాసు, శ్రీరామాంజనేయ యుద్దం సినిమాల్లో కూడా రాముడిగా కనిపించి మెప్పించాడు. 

ఎన్టీఆర్‌ రాముడిగా నటించడమే కాదు.. రామాయణం నేపథ్యంతో వచ్చిన చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. ఆయన దర్శకుడిగా ‘శ్రీరామ కల్యాణం’, శ్రీరామ పట్టాభిషేకం సినిమాలు చేశాడు. శ్రీరామ పట్టాభిషేకంలో ఆయనే శ్రీరాముడి పాత్రలో కనిపిస్తే.. సీతారామ కల్యాణంలో మాత్రం హరనాథ్‌ రాముడి గెటప్‌ వేశాడు. 

♦ 1968లో వచ్చిన ‘వీరాంజనేయ’ సినిమాలో కాంతారావు రాముడిగా కనిపించాడు. 1976లో దర్శకుడు బాపు తెరకెక్కించిన ‘సీతా కల్యాణం’లో రవికుమార్‌ రాముడిగా నటించి ఆకట్టుకున్నాడు. 

♦ టాలీవుడ్‌ సొగ్గాడు శోభన్‌ బాబు కూడా రాముడి గెటప్‌లో ఆకట్టుకున్నాడు.  బాపు దర్శకత్వంలోనే 1971లో వచ్చిన ‘సంపూర్ణ రామాయణం’లో టాలీవుడ్ సోగ్గాడు శోభన్‌బాబు రాముడి పాత్రలో నటించి మెప్పించారు.

♦ 1997లో గుణశేఖర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘బాల రామాయణం’లో జూనియర్‌ ఎన్టీఆర్ రాముడిగా కనిపించాడు. ఈ చిత్రం నేషనల్ అవార్డుని కూడా అందుకోవడం విశేషం.

♦ నాగార్జున నటించిన ‘శ్రీ రామదాసు’ సినిమాలో సుమన్‌ రాముడిగా కనిపించి అందర్నీ ఆకట్టుకున్నారు.

♦  కోడిరామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన దేవుళ్లు’ సినిమాలో ఒక పాటలో శ్రీకాంత్‌ కాసేపు రాముడిగా కనిపించి అలరించాడు.

♦ నందమూరి బాలకృష్ణ సైతంగా రాముడిగా నటించి మెప్పించాడు. బాపు దర్శకత్వంలో శ్రీరామరాజ్యం సినిమాలో బాలయ్య ఎన్టీఆర్‌ పాత్రను పోషించాడు. 2011లో వచ్చిన ఈ చిత్రంలో నయనతార సీతాగా నటించింది.

శ్రీరామ రాజ్యం తర్వాత చాలా కాలంపాటు రామాయణం, రాముడి నేపథ్యంలో సినిమాలు రాలేదు. దాదాపు 12 ఏళ్ల తర్వాత రామాయణం నేపథ్యంలో వచ్చిన ‘ఆదిపురుష్‌’చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా మళ్లీ తెలుగు తెరపై మెరిశాడు.ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా  రామాయణానికి ఆధునిక టెక్నాలజీతో రూపొందించారు.  

Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250