breaking news
-
వెండితెర శ్రీరాముడిగా మెప్పించింది వీళ్లే (ఫొటోలు)
-
Quiz On Lord Rama: శ్రీరాముడి గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
నేడు శ్రీరామ నవమి.. హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ. శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీరాముడి గురించి మీకు ఎన్ని విషయాలు తెలుసు?... శ్రీరాముడి గురించి మీకు ఈ విషయాలు తెలుసా.. ఈ కింద లింక్ క్లిక్ చేసి క్విజ్‌లో పాల్గొనండి.. -
Sri Rama Navami 2024: వెండితెర శ్రీరామచంద్రులు వీరే
శ్రీరాముడితో తెలుగు తెరకు మంచి అనుబంధమే ఉంది. ఇప్పటికే రాముడు, రామాయణంపై పదుల సంఖ్యల్లో సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్ మొదలు ప్రభాస్ వరకు పలువురు స్టార్ హీరోలు రాముడి పాత్రలు పోషించి మెప్పించారు. రేపు(ఏప్రిల్ 17) శ్రీరామనమవి. ఈ సందర్భంగా రామాయణం నేపథ్యంలో వచ్చిన సినిమాలు, రాముడిగా మెప్పించిన హీరోలపై ఓ లుక్కేయండి. ♦తొలిసారి టాలీవుడ్ తెరపై రాముడి పాత్ర పోషించింది యడవల్లి సూర్య నారాయణ. ‘పాదుకా పట్టాభిషేకం’సినిమాలో సూర్యనారాయణ రాముడిగా నటించాడు. బాదామి సర్వోత్తం దర్శకత్వం వహించిన ఈ సినిమా 1932లో విడుదలై మంచి విజయం సాధించింది. తెలుగులో వచ్చిన రెండో టాకీ మూవీ ఇది. ఇదే టైటిల్‌తో 1945లో మరో సినిమా తెరకెక్కింది. ఇందులో సి.ఎస్.ఆర్ ఆంజనేయులు రాముడిగా నటించి మెప్పించారు ♦ ఆ తర్వాత 1944లో వచ్చిన శ్రీ సీతారామ జననం సినిమాలో ఏఎన్నార్ శ్రీరాముడి పాత్ర పోషించి ప్రేక్షకుల మనసును దోసుకున్నాడు. ♦ శ్రీరాముడు పాత్రను ఎంతమంది పోషించినా.. అందరికి గుర్తిండేది మాత్రం ఒక్క ఎన్టీఆర్ మాత్రమే. వెండితెర రాముడు అనగానే అందరికి గుర్తొచ్చే రూపం ఎన్టీఆర్. 1959లో విడుదలైన సంపూర్ణ రామాయణంతో తొలిసారి రాముడు గెటప్‌లో కనిపించాడు ఎన్టీఆర్. ఆత ర్వాత లవకుశ, రామదాసు, శ్రీరామాంజనేయ యుద్దం సినిమాల్లో కూడా రాముడిగా కనిపించి మెప్పించాడు. ♦ఎన్టీఆర్ రాముడిగా నటించడమే కాదు.. రామాయణం నేపథ్యంతో వచ్చిన చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. ఆయన దర్శకుడిగా ‘శ్రీరామ కల్యాణం’, శ్రీరామ పట్టాభిషేకం సినిమాలు చేశాడు. శ్రీరామ పట్టాభిషేకంలో ఆయనే శ్రీరాముడి పాత్రలో కనిపిస్తే.. సీతారామ కల్యాణంలో మాత్రం హరనాథ్ రాముడి గెటప్ వేశాడు. ♦ 1968లో వచ్చిన ‘వీరాంజనేయ’ సినిమాలో కాంతారావు రాముడిగా కనిపించాడు. 1976లో దర్శకుడు బాపు తెరకెక్కించిన ‘సీతా కల్యాణం’లో రవికుమార్ రాముడిగా నటించి ఆకట్టుకున్నాడు. ♦ టాలీవుడ్ సొగ్గాడు శోభన్ బాబు కూడా రాముడి గెటప్‌లో ఆకట్టుకున్నాడు. బాపు దర్శకత్వంలోనే 1971లో వచ్చిన ‘సంపూర్ణ రామాయణం’లో టాలీవుడ్ సోగ్గాడు శోభన్‌బాబు రాముడి పాత్రలో నటించి మెప్పించారు. ♦ 1997లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘బాల రామాయణం’లో జూనియర్ ఎన్టీఆర్ రాముడిగా కనిపించాడు. ఈ చిత్రం నేషనల్ అవార్డుని కూడా అందుకోవడం విశేషం. ♦ నాగార్జున నటించిన ‘శ్రీ రామదాసు’ సినిమాలో సుమన్ రాముడిగా కనిపించి అందర్నీ ఆకట్టుకున్నారు. ♦ కోడిరామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన దేవుళ్లు’ సినిమాలో ఒక పాటలో శ్రీకాంత్ కాసేపు రాముడిగా కనిపించి అలరించాడు. ♦ నందమూరి బాలకృష్ణ సైతంగా రాముడిగా నటించి మెప్పించాడు. బాపు దర్శకత్వంలో శ్రీరామరాజ్యం సినిమాలో బాలయ్య ఎన్టీఆర్ పాత్రను పోషించాడు. 2011లో వచ్చిన ఈ చిత్రంలో నయనతార సీతాగా నటించింది. ♦శ్రీరామ రాజ్యం తర్వాత చాలా కాలంపాటు రామాయణం, రాముడి నేపథ్యంలో సినిమాలు రాలేదు. దాదాపు 12 ఏళ్ల తర్వాత రామాయణం నేపథ్యంలో వచ్చిన ‘ఆదిపురుష్’చిత్రంలో ప్రభాస్ రాముడిగా మళ్లీ తెలుగు తెరపై మెరిశాడు.ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రామాయణానికి ఆధునిక టెక్నాలజీతో రూపొందించారు. -
Sri Rama Navami 2024: శ్రీరామనవమి ముహూర్తం, ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
తెలుగువారి తొలి పండుగ ఉగాది తరువాత వచ్చే మరో విశిష్టమైన పండుగ శ్రీరామ నవమి. శ్రీమహావిష్ణువు ఏడో అవతారమైన శ్రీరాముని జన్మదినాన్ని రామ నవమిగా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా కూడా శ్రీరామ నవమి వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. భక్తి శ్రద్ధలతో రాముణ్ని పూజిస్తారు. సీతారాముల కళ్యాణం జరిపిస్తారు. శ్రీరామనవమి విషిష్టత ఏంటో తెలుసుకుందాం. అయోధ్య రాజు దశరథ మహారాజు రాణి కౌసల్య దంపతులకు శ్రీరాముడు జన్మించిన శుభ సందర్భమే శ్రీరామ నవమి. త్రేతా యుగంలో చైత్ర శుద్ధ నవమి రోజున వసంత ఋతువు కాలంలో పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల పుట్టాడు. అందుకే ఈ పవిత్రమైన రోజున శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటారు. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ,పట్టాభిషేకాన్ని ఘనంగా నిర్వహిస్తారు. 2024లో రామ నవమి ఎప్పుడు? చైత్ర నవరాత్రులు ఈ సంవత్సరం ఏప్రిల్ 9, మంగళవారం ప్రారంభమయ్యాయి.ఏప్రిల్ 17 న రామ నవమి పండుగతో ముగుస్తాయి. రామ నవమి శుభ ముహూర్తం రామ నవమి, ఏప్రిల్ 17,బుధవారం. ముహూర్తం - ఉదయం 11:03 -మధ్యాహ్నం 01:38 వరకువ్యవధి - 02 గంటల 35 నిమిషాలు అని పండితులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా రామనవమిని ఉత్సాహంగా జరుపుకుంటారు. ముఖ్యంగా రామజన్మభూమిగా భావించే అయోధ్యలో, శ్రీరాముని జన్మదినోత్స వేడుకలు కోలాహలంగా ఉంటాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు అయోధ్యకు వస్తారు.ఈ ఏడాది ప్రాణ ప్రతిష్ట చేసుకున్న రామజన్మభూమి దేవాలయంలో రామ్ లల్లా తొలి వేడుకులు ప్రాధాన్యతను సంతరించుకోనున్నాయి. సీతారామకళ్యాణం ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి మొదలు అంటే ఉగాది నుంచి శ్రీరామనవమి వరకూ శ్రీరామ కల్యాణ ఉత్సవాలను నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం ఆజానుబాహుడు, అరవింద నేత్రుడు అయిన శ్రీరాముడికి - అందాల సీతమ్మకు ఈ రోజునే పెళ్లి జరిగింట. అందుకే ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున సీతారాముల కల్యాణాన్ని ప్రతి రాముడి ఆలయంలోనూ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అలాగే పద్నాలుగేళ్లు అరణ్యవాసం తరువాత శ్రీరాముడు అయోధ్యకు పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఇదేనని భక్తుల విశ్వాసం. చాలామంది ఆ రోజు ఉపవాసం ఉంటారు. రామ భక్తులు రామాయణం భాగవత గ్రంథాలను పఠిస్తారు. సీతారామ లక్ష్మణులతోపాటు హనుమంతుడిని కూడా పూజిస్తారు. వడపప్పు, పానకం పానకం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైందట. అందుకే శ్రీరాముడిని పూజించిన తరువాత కొత్తకుండలో మిరియాలు, బెల్లంతో చేసిన పానకం, వడపప్పు నైవేద్యంగా పెడతారు. పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు వసంత రుతువులో వచ్చే గొంతు సంబంధిత వ్యాధులకు ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది ఔషధంలా పనిచేస్తాయని ఆయుర్వేదం చెపుతుంది. -
న్యూయార్క్ టైమ్స్ స్వ్కేర్ రామ మయం!
అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట సందర్భంగా అమెరికాలో పండుగ వాతవరణం నెలకొంది. న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ ప్రాంతం రామనామ జపంతో మార్మోగింది. ప్రవాసులు భారతీయ సంప్రదాయాలు ఉట్టిపడేలా భజనలు, కీర్తనలతో ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. టైమ్స్ స్క్వేర్‌లోని బిల్‌బోర్డుపై రాముడి చిత్రాలను ప్రదర్శించారు. ఇక భారీ స్కీన్‌ను ఏర్పాటు చేసిన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని లైవ్‌లో ప్రసారం చేశారు. ఈ సందర్భంగా టైమ్స్ స్క్వేర్ ప్రాంతానికి ప్రవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సంప్రదాయ దుస్తులు ధరించి, శ్రీరాముడి చిత్రాలున్న జెండాలు చేతబూని వేడుకలు చేసుకున్నారు. ఇక చిన్నారుల నుంచి పెద్దల వరకు జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో పలువురు విదేశీయులు సైతం పాల్గొనడం విశేషం. (చదవండి: మస్కట్‌లో సంక్రాంతి సంబరాలు)
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019