Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

Rashmika Mandanna: పార్టీ కావాలంటోన్న రష్మిక.. విజయ్ రిప్లై ఏంటంటే?

Published Fri, Mar 29 2024 8:18 AM

Rashmika Mandanna Tweet Goes Viral On Family Star Movie - Sakshi

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను దిల్‌ రాజు, శిరీష్ నిర్మించారు. తాజాగా రిలీజైన ట్రైలర్‌కు అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ ట్రైలర్‌ ఏకంగా యూట్యూబ్‌లో నంబర్‌వన్‌ ప్లేస్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చింది. 

తాజాగా ట్రైలర్ వీక్షించిన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా చిత్రం బృందానికి అభినందనలు తెలిపింది.  ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది. ఫ్యామిలీ స్టార్‌ కచ్చితంగా విజయం సాధిస్తుందని రాసుకొచ్చింది. ఆ తర్వాత పార్టీ కావాలని ట్విటర్‌ ద్వారా కోరింది. ఈ ట్వీట్‌కు స్పందించిన విజయ్ దేవరకొండ.. క్యూటెస్ట్ అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. గతంలో చాలాసార్లు ఈ జంటపై డేటింగ్ రూమర్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. 

Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250