breaking news
Ad - Sakshi_Home_Sticky
-
నా కంటే అందమైన వాళ్లున్నారు.. కానీ: రష్మిక ఆసక్తికర కామెంట్స్
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది యానిమల్ మూవీతో మరో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. అంతే కాదు భారతీయ సినిమాలోనే అత్యధికంగా అభిమానులను అలరించిన నటిగానూ మొదటి స్థానంలో ఉన్నారు. రష్మిక పలు భాషలు, పలు చిత్రాల్లో నటించినా తెలుగు చిత్రం పుష్ప ఈమె కెరీర్‌కు పెద్ద టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఈ చిత్రం తరువాతనే బాలీవుడ్ ఎంట్రీ యానియల్ సినిమాతో హిట్ కొట్టింది. కాగా ఇటీవల రష్మిక మందన్నా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకంటే అందం, ప్రతిభ కలిగిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారన్నది తనకు తెలుసన్నారు. అయితే తనకు మంచి అవకాశాలు రావడంతో ఆ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. ఇందుకు తాను నిజంగా కృతజ్ఞతురాలినై ఉంటానన్నారు. జీవితంలో సంతోషాన్ని, మీరు పొందిన విజయాన్ని సాధారణంగా భావించరాదన్నారు. గత కొద్ది కాలంగా తాను నేర్చుకున్నది ఇదేనని నటి రష్మిక మందన్నా పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఈ కన్నడ బ్యూటీ పుష్ప -2: ది రూల్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో తెరపైకి రానుంది. ఈ చిత్రంపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ తర్వాత చావ అనే ఒక హిందీ చిత్రం, రెయిన్బో అనే ద్విభాషా చిత్రం (తమిళం, తెలుగు), ది గర్ల్ ఫ్రెండ్ అనే తెలుగు చిత్రం రష్మిక చేతిలో ఉన్నాయి. -
ఛాయ్ పే శ్రీవల్లి.. బేగంపేటలో రష్మిక సందడి (ఫొటోలు)
-
Pushpa 2 Teaser Photos: చీర కట్టులో పుష్ప రాజ్ విశ్వరూపం
-
'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా "ది గర్ల్ ఫ్రెండ్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. నేడు రష్మిక మందన్న బర్త్ డే సందర్భంగా "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా నుంచి శుభాకాంక్షలు చెబుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో రష్మిక సింపుల్ మేకోవర్‌లో బ్యూటిఫుల్‌గా కనిపిస్తోంది. "ది గర్ల్ ఫ్రెండ్" లో ఆమె కాలేజ్ స్టూడెంట్‌గా నటిస్తున్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది. వైవిధ్యమైన ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతున్న "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్లో ఉంది. ఇప్పటికి 60 శాతం షూటింగ్ పూర్తయినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే పుష్ప 2 చిత్రం నుంచి కూడా రష్మిక ఫస్ట్ లుక్ పోస్ట్ విడుదలైంది. అందులో ఆమె లుక్ చూసిన ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు ఉండటంతో టీజర్ విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చేసింది. ఈ ఏడాదిలో రష్మిక నుంచి దాదాపు నాలుగు సినిమాలు విడుదల కానున్నాయి. -
తండ్రి కష్టాలను తాను మోస్తూ.. పోరాటం కొనసాగించిన 'రష్మిక మందన్న'
రష్మిక మందన్నా.. నిజానికి కన్నడ నటి. నేడు 28వ పుట్టిన రోజు జరుపుకుంటుంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన రష్మిక 'కిరిక్ పార్టీ' చిత్రంతో కన్నడ సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత 'ఛలో' సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ‘గీతగోవిందం, సరిలేరు నీకెవ్వరు, పుష్ప,యానిమల్ చిత్రాలతో నేషనల్ క్రష్‌గా వెలిగిపోతుంది. తనపట్ల పలు రకాలుగా రూమర్స్, డీప్ ఫేక్ వీడియోలు వంటివి ఎదురైనా బలంగా నిలబడింది. అందుకే నేడు ఆమె పాన్ ఇండియా రేంజ్లో సత్తా చాటుతూ చరిత్రలో తనకంటూ ఒక పేజీని ఏర్పాటు చేసుకుంది. రష్మిక విద్యాభ్యాసం వివరాలు రష్మిక మందన్న కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరాజ్‌పేట్‌లో ఏప్రిల్ 5, 1996లో జన్మించారు. రష్మిక కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత రష్మిక M. S. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుంచి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి పెంచుకున్న రష్మిక.. చదువును నిర్లక్ష్యం చేస్తూ నటి కావాలని కలలు కనలేదు. చదువులో అగ్రస్థానంలో నిలిచిన రష్మిక మొదట మోడలింగ్ షోలలో పనిచేయడం ప్రారంభించింది. అలా ఒక షోలో ఆమెను చూసిన రక్షిత్ శెట్టి 'కిరిక్ పార్టీ' సినిమాలో ఎలాంటి ఆడిషన్ లేకుండానే ఛాన్స్ ఇచ్చాడు. అద్దె ఇంట్లో జీవితం ప్రారంభం రష్మిక చిన్నప్పుడు తమ కుటుంబం మొత్తం ఓ అద్దె ఇంట్లో ఉండేవారమని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆర్థిక కష్టాల కారణంగా రెంట్ కట్టలేకపోవడంతో పదే పదే ఇల్లు మారాల్సి వచ్చేదని చెబుతూ ఆ సమయంలో కంటతడి పెట్టుకుంది. తల్లిదండ్రులు చివరికి తనకి ఆడుకోవడానికి ఒక బొమ్మని కూడా కొనివ్వలేకపోయారని వాపోయింది. పాఠశాల రోజుల్లో తన కుటుంబం ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంది. ఆపై వ్యాపారాల్లో నష్టం వచ్చి తన నాన్నగారు బాధపడిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఎలాగైనా ఆ పరిస్థితిని మార్చాలని రష్మిక బలంగా కోరుకుంది. అందుకు తగ్గట్లు కష్టపడింది. తన తల్లిదండ్రులకు ఎలాంటి సినీ నేపథ్యం లేదు.. అయినా ధైర్యంగా ఇందులో అడుగుపెట్టింది. ఇప్పుడు తను రెండుజేతులా ఆర్జిస్తూ తండ్రికి బిజినెస్‌లో ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేస్తోంది. అలానే ఓ పెద్ద ఇల్లుని కూడా పేరంట్స్‌కి గిప్ట్గా ఇచ్చింది. ఛలో టూ పుష్ప కిరిక్ పార్టీ సినిమా విజయంతో రష్మిక మందన్నకు ఛలో సినిమాలో ఛాన్స్ దక్కింది. కేవలం రంగుల కలలు కని సినిమాల్లోకి తను రాలేదు. ఈ వృత్తిలో ఉండే సాధకబాధకాల గురించి ముందే తెలుసుకుంది. అయితే ప్రతి వృత్తిలో ఉన్నట్లే సినిమారంగంలో కూడా ఒడిదొడుకులు, ఎగుడుదిగుళ్లు ఉంటాయనేది కూడా బాగా తెలుసు అందుకే ఆమెపై ఎన్ని రూమర్స్ వచ్చినా బలంగా తట్టుకుని నిలబడింది. సరైన అవకాశం కోసం ఎదురుచూసింది. ఆ సమయం పుష్ప సినిమాతో వచ్చింది. దీంతో ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రస్తుతం పుష్ప2 తో అంతకు మించి ఇమేజ్ ను సాధించడానికి రెడీగా ఉంది రష్మిక. ఫస్ట్ రెమ్యునరేషన్ కిరిక్ పార్టీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక రూ. 1.50 లక్షలు మాత్రమే రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఆ తర్వాత ఛలో సినిమాకు రూ. 50 లక్షలు అందుకున్నారని టాక్. టాలీవుడ్ తర్వాత కోలీవుడ్లోకి అడుగుపెట్టింది రష్మిక. తమిళంలో కార్తీ సరసన నటించిన ఆమె ఆ తర్వాతి సినిమాలోనే తలపతి విజయ్ సరసన నటించే అవకాశాన్ని చేజిక్కించుకుని కోలీవుడ్ మార్కెట్‌ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 5 కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్న రష్మిక యానిమల్ సినిమాకు మాత్రం రూ. 7 కోట్ల వరకు తీసుకున్నట్లు టాక్. పేదరికం నుంచి కోట్లలో సంపద చిన్నతనంలో నాన్న పడుతున్న కష్టాన్ని తన కళ్లతోనే చూసింది. ఎలాగైనా తన కుటుంబ పరిస్థితిని మార్చాలని కోరుకుంది. అందుకే సంపాదించిన ప్రతి రూపాయి ఇప్పటికి కూడా తన తండ్రికి అప్పజెప్పుతుంది. ప్రస్తుతం సినిమా రెమ్యునరేషన్‌తో పాటు ఆమె పలు ప్రకటనల్లో కూడా కనిపిస్తుంది. ఒక్కో ప్రకటనకి డెబ్బై లక్షల నుంచి కోటి రూపాయల వరకు డిమాండ్ చేస్తోందట. అలా ఇప్పటి వరకు మొత్తంగా రూ. 70 కోట్ల వరకు రష్మిక సంపాధించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్న మాట. 23 ఏళ్లకే కోటీశ్వరురాలిగా మారిన రష్మికకు బెంగళూరు, కూర్గ్, గోవా, హైదరాబాద్, ముంబై సహా నగరాల్లో ఇళ్లు ఉన్నాయట. ఇందులో రష్మిక బెంగళూరులోని లగ్జరీ ఇంటి విలువ 10 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. రష్మికకు కార్లంటే చాలా ఇష్టం మరియు అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. టయోటా ఇన్నోవా, ఆడి క్యూ3, మెర్సిడెస్ బెంజ్ సి క్లాస్, రేంజ్ రోవర్ స్పోర్ట్, హ్యుందాయ్ క్రెటా వంటి ఖరీదైన కార్లు ఆమె గ్యారేజీలో వరుసలో ఉన్నాయి. ముఖ్యంగా ఆమె సినిమాల్లో సంపాదించని డబ్బును తన తండ్రి ద్వారా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడుతందని సమాచారం. దాంతో తన ఆస్తులతో పాటు.. సంపద కూడా భారీగా పెరుగుతూ వస్తోందట. చిన్నప్పుడు తన తల్లిదండ్రులను గర్వించేలా చేయాలని బలంగా కోరుకున్న రష్మిక అనుకున్నట్లు గానే సాధించింది. చిన్నతనంలోనే తన జీవితం గురించి ఏ విధంగా అయితే కలలుకనిందో వాటిని నిజం చేసుకుంది. అయినా జీవితంలో ఇంకా సాధించాల్సింది చాలానే ఉందంటున్న రష్మిక.. అవన్నీ నెరవేరాలని కోరుకుంటూ నేషనల్ క్రష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019